శోభకృత్ నామ సంవత్సరానికి స్వాగతం…

శోభకృత్ నామ సంవత్సరానికి స్వాగతం…

(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: శారద

తూర్పున తెల తెల వారుతుండగానే అందాల ఉదయ భానుడు
బంగారు రంగుల దుస్తువులు ధరించి ఆకాశం పైకి వస్తున్నాడు
అందాల అరుణోదయానికి ద్రిష్టి తీయాలని
ఎర్రటి నీళ్ళు ఉష ఆకాశం చుట్టూ చల్లగా
ఆ నీళ్ళు మబ్బుల పై పడి
ఎర్రగా పసుపు రంగుగా
కాషాయ రంగు ఉదారంగు
తెల్లపు నీలి రంగులో
ఆకాశం అంతా సహారి బంగారు రంగులతో
అందంగా కనిపిస్తుంది
భూదేవి బంగారు వన్నెలతో కూడిన ఆకుపచ్చని ‌చీరతో
ఆకులు ఆకుపచ్చని గాజుల గల గలలో
ఆ సూర్య బింబాన్ని నుదుట బొట్టు గా ధరియించిది
హిమాలయ పర్వతాలునే కిరీటంగా ధరియించి
పర్వతాలలో ధుమికే జలపాతాన్ని నీలాల కురులుగా
ఎంతో అందంగా ఉంది భూదేవి
ఉదయ కిరణాలతో అడవిలోని వృక్షాల ఆకులు
పువ్వులు కాయలు పండ్లు అన్నియు
కొత్త రంగులు సంతరించుకున్నాయి
రంగు రంగుల రామచిలుకలు
చైత్రమాసం వసంతంలో వచ్చు
శోభాయమానంగా వెలుగుతున్న
శోభకృత సంవత్సరానికి రెక్కలు టపటపలాడిస్తూ
తమ కువ కువ భాషల్లో స్వాగతం పలికాయి
శాంతి కపోతం అయిన తెల్లని పావురాలు ‌
గుడుగుడుమంటు మెడ క్రిందకి పైకి ఊపుతూ
రెక్కలు ఆర్చుతు స్వాగతం పలికాయి
అడవిలోని రంగు రంగుల నెమళ్ళు అందంగా పురివిప్పి
ఒళ్ళంతా జలదరించుతూ శక్తికి మీరి ఆనందంతో
కొత్త సంవత్సరంకు స్వాగతం పలికాయి
అడవిలో రక రకాల జంతువులు గర్జనలతో స్వాగతం పలికాయి
లిల్లీ పారిజాతం మల్లె సంపంగి
జాజి పారిజాతం రాత్రి రాణి
పున్నాగ మొగలి సంపంగి విరజాజి వంటి పూలు
మత్తైన సువాసనతో వాయుదేవుడితో కలిసి
వేణు గానంతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాయి
సముద్రంలో నదులలో చేపలు
డాల్ఫిన్ లు ఆకాశం అంత
ఎత్తుకు ఎగురుతూ మొప్పలను జోడించి
శోభకృత్ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఉన్నాయి
వేపచెట్టు లోని వేప పూలు తెల్ల తెల్లగా చుక్కల వలే
కనిపిస్తు వింత సువాసన వెదజల్లుతూ ఉన్నాయి
వసంతుడు వచ్చాడని తరువు లోని రంగు రంగుల పువ్వు లు
సువాసనలు వెదజల్లుతూ అందాల కన్నె పిల్లలా
నాట్యం చేస్తున్నాయి
మామిడి తోపులో పచ్చని ఎర్రని చిగురు ఆకులుతో
గుత్తులు గుత్తులుగా మామిడికాయలతో
కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ
లేలేత చిగురులను మతైన కోయిల తిని
తియ్య తియ్యగా పంచమ శృతితో
నూతన సంవత్సరానికి గాన కచేరి చేసింది
అందాల సరస్సులో స్నానం చేసి
నీళ్ళు అన్ని తమ తొండంతో నింపుకుని
ఆకాశంలోని దేవాను దేవతలను
కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ
జలాన్ని అభిషేకం చేసాయి
ఇంకా తొండం ఎత్తి విఘ్నేశ్వరుడా
విఘ్నాలు రాకూడదని ఘీకారం చేస్తూ కోరుకున్నాయి
మామిడి వేప తోరణాలతో
ఆరు రుచులు కలిగిన ఉగాది పచ్చడి
ఆరు గుణములు నియంత్రిస్తుందని నమ్మకం
దేవుడు పూజతో పంచాంగం
పూజ చేసి ఆచార్యుల ద్వార
పంచాంగం శ్రవణం వింటూ
గ్రహముల గురించి రాశుల
గురించి తెలుసుకుంటారు
ముత్తైదువులకు ముత్తైదువులు
ఒకరికి ఒకరు వాయినం
ఇచ్చుకుంటారు
అన్నపూర్ణవై లక్ష్మీ దేవివై
సరస్వతి దేవివై గంగమ్మ తల్లి వై వచ్చి
ఈ శోభకృత నామ సంవత్సరంను
దిగ్విజయంతో మమ్మల్నందరిని
ఆశీర్వాదించమ్మా…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!