(అంశం :” శ్రీ వ్యాస పౌర్ణిమ”)
తస్మై శ్రీ గురవే నమః
-జాధవ్ ముకుంద్ రావు (కవిరత్న)
జీవబ్రహ్మైక్య సంధానం
ఆధ్యాత్మికత సులభ మార్గం,
ఆషాఢ శుద్ధ పూర్ణిమ సూర్యకిరణం
సనాతన గురు పౌర్ణిమ పర్వదినం !!
పంచం వేదమునకు సృష్టికర్త
భగవద్గీత జ్ఞాన జ్యోతి అర్హత,
శ్రీ విష్ణువు అంశమే సత్యవతి కుమారుడు
అష్టాదశ పురాణాలు వ్రాసిన ప్రత్యక్ష దేవుడు !!
మహర్షి భగవానుడు శ్రీ విష్ణువు
వ్యాసపీఠాన్ని ఆధ్య అదిగురువు,
త్రైలోక్యం ఆది అంతము జ్ఞానవంతుడు
బామ్మతో సమానము జగద్గురువు వ్యాసదేవుడు !!
సనాతన హిందూ ధర్మము విధానమును
పరంపర బాధ్యత చీకటి అంధకారమును,
పంచభూతాలతో జీవాత్మ ముముక్షతామును
అజ్ఞానం తొలగించే చైతన్య స్వరూప సాధనాలను!!
మహర్షి వ్యాస రచించిన మహా విద్యాధనం
సామరస్యంగా జ్ఞాన రసాన్ని ఆస్వాదించే తనం,
విశ్వ జనులకు జ్ఞానజ్యోతిని ప్రకాశించే రూపం
కురుక్షేత్రంలో పాండవులను కాపాడిన నిజస్వరూపం!!
***