తడిలేని మది

తడిలేని మది

-ప్రసాదరావు రామాయణం

ఎండి పోయాయి
మనుషుల మనసులు
పగిలిన బీడుల్లా!….
ఆర్ద్రతా లేదు సార్ద్రతా లేదు
తడి సవ్వడే లేదు
దైన్యాన్ని చూసినా
దుఃఖాన్ని చెవి మోసినా
చమరించదు కన్ను
బిగించదు అధరాన్ని పన్ను

వసివాడిన పసిపాప
ఆకలి కడుపున అర్రులు చాస్తే
చీ చీ పొమ్మన్నావు
ఛీకొట్టి నెట్టేశావు
ఎక్కడ నీ మదిలో తడి?

గురుపూజోత్సవ0 నాడు
గురువు బ్రహ్మ అన్నావు
విష కాలమొచ్చి
ఉద్యోగం ఊడి
ఇటుకలు మోస్తున్నాడు బ్రహ్మ
చెమరించిందా నీ కన్ను?

పారాలింపిక్సులో
పతకాలు పండితే
పటాసులు కాల్చావు
పండుగ చేసావు
ఆ కుంటివాడు
పంటి బిగువుతో
మండిన కడుపు కోసం
బండి రిక్షా లాగుతుంటే
ఎక్కడ తడి నీ మదిలో?

మగడు చచ్చి
మనసు నొచ్చి
మానిని ఏడుస్తుంటే
బొట్టు తుడిచి
తెల్లని బట్టకట్టి
గాజులు దూసి
ప్రదర్శనకు పెడితే
చెమరించిందా నీ మనసు?

లేదు లేదు
ఆరిపోయింది
మదిలో తడి లేదు
హృదిలో గుండె లేదు
మనిషి ఒక ఎండిన మ్రాను

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!