పుస్తకం ప్రపంచ భూషణం
-పసుమర్తి నాగేశ్వరరావు
విజ్ఞాన తరువు మానవాళికి విజ్ఞానఎరువు
ఎంతమందికైనా కడుపునింపి సేద తీర్చేది తరువు
ఎప్పటికి తరగనిది విజ్ఞాన తరువు
ఈ విజ్ఞాన తరువు ఇస్తుంది కొలువు నిలుపుతుంది పరువు
నేటి మానవ జీవిన పయనంలో
పోషిస్తుంది పుస్తకం అపూర్వ పాత్ర
పుస్తకమే ఒక విజ్ఞాన పాత్ర
విజ్ఞానమే ఒక అక్షయ పాత్ర
మనిషి చంద్రమండలంలో అడుగు పెట్టిన
వైద్యశాస్త్రంలో కొత్త ఒరవడి సృష్టించిన
భవిష్యత్ జాతీయ విపత్తులు ముందుగా తెలుసుకున్న
మనిషి మేధా తనానికి పుస్తకమే సరిజోడు
కాలం పరిగెడుతుంది
విజ్ఞానం నూతన పోకడలను సంతరించుకుంటుంది
దూరం భారం కాకుండా దగ్గరవుతుంది
ఖండాంతర ప్రయాణాలు నల్లేరు పై నడకలయ్యాయి
మానవ మస్తిష్కానికి పని చెబుతున్నారు
పుస్తక పఠనాన్ని ఆశ్వాధిస్తున్నారు
పుస్తకం హస్తభూషణం కాదు
పుస్తకం మానవ జీవితానికి ప్రపంచానికి భూషణం