అమ్మ మనసు

అమ్మ మనసు

రచన :: తిరుపతి కృష్ణవేణి.

ఉదయమే రామారావు గార్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ మాట్లాడిన తర్వాత, చాలా ఆందోళన పడుతూ,
అటు ఇటు తిరుగుతున్నాడు. భార్యకి చెపితే ఆమె కంగారు పడుతుంది. అసలే ఆమె బి. పి, షుగర్ పేసెంట్.
ఏమిచేయాలో, అర్ధం కావటం లేదు? అంతా అయోమయంగా ఉంది.
పిల్లలు అరుణ్, వరుణ్ ఉద్యోగరీత్యా అమెరికాలో వున్నారు.
దూరంలోఉన్నపిల్లలకు, ఈ విషయం చెప్పి వారిని బాధ పెట్టడం దేనికి? అలా అని చెప్పక పోవటం కూడా తప్పే అవుతుందేమో?
ఆలోచనలతో రామారావు గారి బుర్ర అంతా వేడెక్కిపోతోంది.గడచిన కాలంలో జరిగిన సంఘటనలు కళ్ళముందు కదులుతున్నాయి.

రామారావు చిన్న తనంలోనే,తండ్రి రంగయ్య అనారోగ్యంతో అర్దాంతరంగా మరణించారు. భర్తను కోల్పోవటంతో, కాంతమ్మకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. కొడుకు చిన్నతనం, కుటుంబ భారం అంతా తనపై పడింది. చేసేది లేక భర్త చేసే కూరగాయల వ్యాపారాన్నే తిరిగి కొనసాగించింది. కుటుంబ పోషణకు తను మాత్రం ఎంతో శ్రమ జేస్తూ , కుమారుణ్ణి, మాత్రం కష్టం అంటే ఏంటో! తెలియకుండా, అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది. రామారావు కూడా,ఇంటి స్థితి గతులను గమనిస్తూ,భాద్యతగా మెలుగుతూ,తల్లి పడే కష్టాన్ని అవగాహన చేసుకుంటూ, క్రమశిక్షణతో బుద్దిగా కష్టపడి చదువుకొంటూ,మంచి ప్రయోజకుడుగా ఎదిగాడు.రామరావు అమ్మ పై ఎంతో గౌరవ భావం పెంచుకున్నాడు ఎన్నో మంచి విషయాలు చెబుతూ ఉన్నత విలువలు నేర్పించింది.అమ్మ లేకపోతే ఈ రోజు నేను ఇంత ఉన్నత స్థానంలో ఉండే వాడిని కాదు.కాంతమ్మ మాత్రం కొడుకు తన లాగా కష్ట పడకూడదని కష్ట మంటే ఏమిటో తన కొడుకుకి తెలియ కుండానే పెంచాలని మంచి విద్యాబుద్ధులు నేర్పించి ఉత్తమ విలువలు కలిగిన వ్యక్తి గా తీర్చి దిద్దాలని ఎన్నో ఆశలు, ఆశయాలతో కొడుకు ఎదుగు దలకు తోడ్పడింది. తండ్రి లేని లోటు లేకుండా తల్లీ తండ్రి అన్ని తానే అయి కొడుకుని ఒక మంచి ప్రయోజకున్ని చేసింది.కొడుకు మండల అ భివృద్ధి అధికారి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు.తల్లి కాంతమ్మ చాలా ఆనందించింది. ఇక
పెళ్లి చేస్తే నా బాధ్యత తీరుతుంది. దగ్గర బంధువుల అమ్మాయి అయితే తనని,కొడుకుని బాగా చూసుకుంటుంది, ఇంట్లో తనకు ఆసరాగా ఉంటుందని ఆలోచించి,లక్షణమైన అమ్మాయిని చూచి ఎంతో ఘనంగా వివాహం జరిపించింది.కొత్త కోడలుతో ఇల్లు కళకళ లాడింది. కొడుకు కోడలుతో సంతోషంగా కాలం సాగిపోపోతోంది. రెండో సంవత్సరంలోనే కోడలు గర్భం దాల్చింది. కాంతమ్మ సంతోషనికి అవధులులేవు. కోడలును అపురూపంగా
చూచుకొంటూ, కూర్చోపెట్టి అన్ని సేవలు చేసింది. కోడలు రమ్యకు నెలలు నిండి ఇద్దరు పండంటి మగబిడ్డలకు
జన్మనిచ్చింది. తల్లి కొడుకు లిద్దరు కవల పిల్లల్ని చూసి తెగ సంబరపడ్డారు. కాంతమ్మ, మనుమళ్ళ రాకతో ఇంతవరకు తాము పడ్డ కష్టాలన్నీ తీరి పోయాయని ఆనందించింది.
కంటికి రెప్పలా చుచుకొనే కొడుకు, కోడలు, ఇద్దరు రత్నాలలాంటి మనుమళ్లని చూచుకొంటూ ఎంతో మురిసిపోయోది.
పిల్లలకు నానమ్మ అంటే ఎంతో ఇష్టం. బడి వయస్సు రాగానే రామారావు పిల్లల్ని పాఠశాలలో చేర్పించాడు. రోజు బడికి వెళ్తున్నారు.కాంతమ్మ మంచి, నీతి కథలు, రామాయణ, భాగవత, పురాణకథలు, పేదరాసి పెద్దమ్మ కథలు చెపుతూ మానవత్వపు విలువలు కలిగిన వ్యక్తులు గా మీరు ఎదగాలన్నదే నా ఆశ అని మనుమళ్లకు చెప్తుండేది.
మనిషికి డబ్బు హోదా వీటన్నిటి కన్నా విలువలు ముఖ్యమని, మానవ విలువలు కలిగిన వ్యక్తులు, డబ్బు హోదా పలుకుబడి ఉన్నవారికంటే గొప్పవారని, మీరు బాగా చదువుకొని అలా తయారవ్వాలని,
నలుగురు మెచ్చుకొనే ఉత్తములుగా, నలుగురికి ఉపయోగ పడే వ్యక్తులుగా ఎదగాలి అన్నదే నా కోరిక అని రోజు పడుకునే ముందువాళ్ళకి మంచి సందేశమున్న కథలతో పాటు, నీతి సూత్రాలు చెప్పుతుండేది.అరుణ్, వరుణ్ చదువులు కాలేజీ స్థాయి వరకు వచ్చాయి. మంచి కాలేజీలలో సీట్లు వచ్చాయి. పై చదువులకు మనమళ్ళు బయటకు వెళ్లిన కొంతకాలం తర్వాత కాంతమ్మ జీవితం ఊహించని మలుపు తిరిగింది. అత్తగారు చేసే పనులు కోడలుకు నచ్చేవి కావు. ఇద్దరిమధ్య చిన్నచిన్న మనస్పర్ధలు మొదలైనాయి. అవి చిలికి చిలికి గాలివానలా తయారయ్యాయి.
ఎంతో అణుకువగా మెలిగే కోడలిలో కొత్తగా వచ్చిన ఈ మార్పుకు ఏం చేయాలో కాంతమ్మకు అర్ధం కావటం లేదు. తన జీవితాన్ని అవసాన దశలో ఎలా గడపాలో, ఎంతో ఉహించుకున్నది. ఇంతలోనే కోడలిలో ఇంత మార్పా? బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది.ఇక తను ఆ ఇంట్లో ఉండటం కోడలుకు ఏ మాత్రం ఇష్టం లేదు అని కాంతమ్మ గ్రహించింది.
ఆమెను బయటకు పంపాలిఅన్నదే, అమె ఎత్తుగడ!
అందుకే కోడలు ఈ మధ్య కొడుకుతో కూడా ముభావంగా వుండటం గమనించింది కాంతమ్మ. చివరికి
ఒక నిర్ణయానికి వచ్చిన కాంతమ్మ కొడుకుతో మాట్లాడి ఒక సలహా చెప్పింది.అందుకు రామారావు ససేమిరా అన్నాడు. కొడుకు పరిస్థితి తల్లి కాంతమ్మ కి తెలుసు. కొడుకు మాట వరుసకే అలా అంటున్నాడు. అని,! ఎలాగోలాగ ఒప్పించి తను వెళ్ళటానికి కావలసిన ఏర్పాట్లన్ని పూర్తి చేసుకుని తన ఇష్ట పూర్తిగా వెళ్తున్నానని వాళ్ళని ఒప్పించిది కాంతమ్మ.
అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళమని కొడుకుతో చెప్పి,చెమ్మగిల్లిన కళ్ళతో కొడుకు, కోడలు వంక ఒకసారి చూసి, అక్కడి నుండి సెలవ్ తీసుకొని వృద్ధాశ్రమానికి బయలు దేరింది.
రామరావు బరువెక్కిన గుండెతో తల్లి వెళ్తున్న వైపు అలాగే చూస్తూ వుండి పోయాడు.
కోడలు రమ్య మాత్రం మేము చెప్పకుండానే అత్త గారు బయటకు వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నందుకు మనసులోనే ఆనంద పడింది. ఎంతో గారాబంగా చూసుకున్న తన కొడుకుని ఒదిలి వెళ్తున్నందుకు మనసులోనే కుమిలి కుమిలి ఏడ్చింది. అలానే రామారావు కూడాతల్లిఅలావెళ్తుంటే,
ఆపలేకపోయిన,తన చేత కాని తనానికి తనలో తానే కుమిలి పోసాగాడు. అలా కాలం భారంగా గడిచి పోతూంది. కొద్ది నెలల తరువాత సెలవులకు, మనుమలు ఇద్దరు ఇంటికీ వచ్చారు. నానమ్మ లేని ఆ ఇంటిని చూసి వాళ్లు ఊహించుకోలేక పోయారు. అలా నానమ్మను ఎందుకు పంపించారు? అని అమ్మా నాన్న లని నిలదీశారు. జరిగింది తెలుసుకొని హుటా హుటిన ఆశ్రమానికి వెళ్ళారు. నానమ్మ మనుమలు ఒకరినొకరు పట్టుకొని బోరుమన్నారు. నిన్ను ఎవరయిన ఏమన్నా అన్నారా? చెప్పు?నానమ్మ చెప్పు?మనఇంటికీవెళదాం పదా,నానమ్మ.అని ఇంటికి తీసుకుని రావటానికి శత విధాల ప్రయత్నం చేసారు. కానీ,నానమ్మ చూడండి నాన, నన్ను ఎవరూ ఏమి అనలేదు. నాకు అక్కడ కాలక్షేపం అవటం లేదు, అంతే!వూరికే తిని కూర్చోవటం తప్ప నాకేమి తోచటం లేదు.,మీరు చదువుల కోసం వెళ్లారు. అమ్మ నాన్నలకి వాళ్ళ పనులు వాళ్ళకి వుంటాయి. నాతో మాట్లాడే సమయం కానీ సందర్భం కానీ వాళ్ళకి వుండక పోవచ్చు. ఇక్కడ అయితే అంతా నా వయస్సు వారే హాయిగా కబుర్లు చెప్పుకుంటూఉంటారు. నాకు కాలక్షేపం అవుతుంది. మనసు మంచిగా ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. అన్ని ఆలోచించే ఇక్కడికి వచ్చాను. మీరు ఎలాగో ఇంట్లో వుండరు కదా! ఇంటికి వచ్చి నప్పుడల్లా,ఇలా వచ్చి నన్ను చూసే వెళ్తారుకదా! అని మనుమలకి సర్ది చెప్పి, అమ్మ నానల గురించి కూడా వాళ్ళకి తగు జాగ్రత్తలు చెప్పింది. అరుణ్ వరుణ్ కూడా నానమ్మకి
ఏదైన సమస్య వుంటే ఫోన్ చేయించమని జాగ్రత్తగా ఉండమని చెప్పి, విషన్న వదనాలతో వెను తిరిగి వెళ్ళారు.కాలంచక్రం గిర్రున తిరిగి పోయింది. అరుణ్ వరుణ్ కి ఇక్కడ చదువులు పూర్తి అయ్యాయి.
పై చదువుల నిమిత్తం అరుణ్ వరుణ్ అమెరికా వెళ్ళవలసి వచ్చింది. అప్పుడే మొదలయింది అసలు సమస్య,వాళ్ళిద్దరికీ డబ్బు సర్దుబాటు చెయ్యాలి! అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలా అని ఒక్కరినే పంపిస్తే ఇద్ధరిలో ఎవరినీ పంపాలా ఇధ్ధరు తెలివైన వారే! ఇప్పుడు ఎలా?అని రామారావు రమ్య సందిగ్ధంలో పడ్డారు. అత్తగారు వుంటే మంచి సలహా ఇచ్చే వారు. అమే దగ్గర డబ్బు కూడా ఎంతో కొంత వుండే వుంటుంది. చాలా కాలంగా దాస్తుంది కదా! ఓ మాట అడిగిచూద్దాం?
అన్నది భర్త తో రమ్య. రామారావు,ఏ ముఖం పెట్టుకొని అడుగుతావు అని మనసులోనే అనుకున్నాడు.అరుణ్ వరుణ్ కాలేజీ పనులన్ని పూర్తి చేసుకొని సర్టిఫికెట్స్ తీసుకొని,అన్నీ సర్దుకొని ఇంటికి వచ్చారు.అన్నీ సమకూరితే అమెరికా వీసాలు రావటమే ఆలస్యం, అమెరికాకు ప్రయాణం కావాలి.వచ్చిన వెంటనే
హుటాహుటిన
నానమ్మ ఉంటున్న వృద్ధ ఆశ్రమానికి వెళ్ళారు. ఆమె క్షేమ సమాచారం తెలుసుకొని తీసుకెళ్లిన స్వీట్స్, నానమ్మతో పాటు అక్కడ వున్న అందరికి పంచారు. ఆ తరువాత నానమ్మ తో కావలిసినంత సమయం గడిపి వెళ్ళే ముందు, వాళ్ళ అమెరికా ప్రయాణం గురించి దానికి అయ్యే ఖర్చు గురించి నానమ్మకు చెప్పారు. డబ్బు గురించి ఏమి చెయ్యాలా?అని నాన్న , అమ్మ ఆలోచిస్తున్నారు, అని నానమ్మ కు వివరించారు. అరుణ్ వరుణ్ తో మీరు మళ్ళీ వచ్చేటపుడు నాన్నని ఒకసారి తీసుకొని రండి అని చెప్పింది. అలాగే నానమ్మ అంటూ మేము వున్నన్ని రోజులు నీ గురించి వస్తూనే వుంటాం! అని బై చెప్పి వెళ్ళారు. మనుమల రాకతో కాంతమ్మ గారి ముఖం లో సంతోషం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.రెండు రోజుల తర్వాత కొడుకులతో కలసి రామారావు వృద్దాశ్రమానికి తల్లి వద్దకు వచ్చారు. కొడుకుని చూసిన కాంతమ్మ గారికి దుఃఖం పొంగి పొర్లింది. మనుమళ్లు కూడా నానమ్మని పట్టుకొని మరొక్కమారు వారి గుండెలోని భాద నంతా తీర్చుకున్నారు. నానామ్మని ఇంటికీ వెళదాం రమ్మని రామారావు గారి తో సహా బ్రతిమిలాడారు. కాని ఆమె అందుకు అంగీకరించలేదు. తను పిలిపించిన విషయం గురించి కొడుకుతో మాట్లాడింది. అది విన్న రామారావు గారు బోరుమంటు ఏడ్చారు. తల్లి మనస్సు ఎంత గొప్పది. అని మనసులోనే వాపోయారు. అమ్మకి చదువు సరిగా లేక పోయినా ప్రతి విషయంలో మంచి అవగాహన కలిగి వుంటుంది అమ్మ దగ్గరికి రావాలంటే నాకు మొహం చెల్లలేదు . కాని అమ్మ ఎప్పుడూ ఎలా వుండేదో అలానే వుంది, ఏమి జరగనట్టు! అదే అమ్మ ప్రేమ అంటే! అమ్మ ఉన్నట్టు వుండి, వృద్ధఆశ్రమానికి వెళ్ళాలని నిర్ణయం ఎందుకు తీసుకుందో, నాకు ఇప్పటికి అర్ధం కాని విషయం.?రామారావు గారి మనసు కాస్త స్థిమిత పడింది. అమ్మ చెప్పిన విషయం విన్న తర్వాత, ఎంతో సంతోషించారు. అమ్మ వ్యాపారం చేసే రోజుల్లోనే ముందు చూపుతో చాలా డబ్బు ఫిక్సిడ్ డిపాజిట్ చేశారు. బహుశా పిల్లలగురించే కావచ్చు! అది పెరిగి చాలా పెద్ద మొత్తం అయింది. అది మెచ్యూరిటీకి కూడా వచ్చింది. అవి విత్ డ్రా చేయుటకు అన్నీ ఫామ్స్ పై సంతకాలు పెట్టి కొడుకుకు ఇచ్చింది.అమ్మ మూలంగా డబ్బు కూడా సమకూరింది. ఇంక పిల్లల ప్రయాణ ఏర్పాట్లు మిగిలాయి. చూస్తుండగానే వాళ్ల ప్రయాణ సమయం దగ్గర పడింది. ఉన్నన్ని రోజులూ నానమ్మ దగ్గర ఎక్కువ సమయం గడిపి నానామ్మకి తగు జాగ్రత్తలు చెప్పి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళి పోయారు. అక్కడి నుండి కూడా ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసు కుంటునే వున్నారు. అలాకొన్ని సంవత్సారాలు గడిశాయి వాళ్ళ చదువు పూర్తి అయ్యింది. మంచి కంపెనీల్లో ఉద్యోగాలు రావటంతో అక్కడే జాబుల్లో జాయిన్ అయ్యారు. .వీలు చూసుకొని ఒకసారి ఇండియా వెళ్ళి అమ్మ నాన్న,నానమ్మ లను చూసి రావాలి అని వరుణ్ అరుణ్ అనుకున్నారు.ఈ మధ్య వయసు రీత్యా కాంతమ్మ గారి ఆరోగ్యం క్షిణించింది. .మనుమళ్ళను తరచూ బాగా గుర్తుకు చేసుకుంటూంది.
కొడుకు కోడలు ను కూడా చూడాలని అమె కోరిక . రేపు ఒక సారి కొడుకుకి ఫోన్ చెయ్యాలి. అని మనసులోనే అనుకుంది. కానీ తన ఆరోగ్యం సహకరించటం లేదు కొడుకుతో మాట్లాడాలి. అనుకున్న మాటలను తన బట్టల బ్యాగ్ నుండి పెన్ను పేపర్ తీసుకుని చిన్న లెటర్ వ్రాయటం మొదలు పెట్టింది నాన రాము,
నేను ఆశ్రమానికి ఎందుకు వచ్చానో,నీకు అర్ధం కాక ఆలోచిస్తున్నావని నాకు తెలుసు. కానీ ఏం చేయను! ఆ రోజు మీ రిద్ధరు గొడవ పడటం నేను విన్నాను. ఇద్దరి మధ్య పెద్ద ఘర్షణ. నా గురించి మీరిద్దరూ గొడవ పడటం నాకు బాధ కలిగించిం ది. మీరు వచ్చి నన్ను వృద్ధాశ్రమంలో వదలటం, నలుగురి దృష్టిలో తల్లిని వృద్దాశ్రమంలో వదలటం కొడుకు కోడలు గా మీకు చెడ్డ పేరు వస్తుంది. నా ఇష్టంతోనే వెళ్తే ఎవరు తప్పు పట్టరు. అలాగే మీ పిల్లల దృష్టిలో మీరు ఒక మంచి తల్లి దండ్రులు గా మిగలాలి. మీరు నన్ను వృద్ధాశ్రమంలో వదిలేశారు అని మీ పిల్లలకు తెలిస్తే రేపు మీ పరిస్థితి ఏమిటి? అందుకే నేను ఈ విషయాన్నీ పిల్లల దృష్టి కి వెళ్ళకుండా జాగ్రత్త పడ్డాను. ఎంతయినా మీరు నా కొడుకు కోడలు కదా! నాన! మిమ్మల్ని నేనెలా కాదనుకుంటా! చెప్పండి? కోడలు నా దగ్గర డబ్బు ఉంటుందని అడగమని ఊరిక నీతో గొడవ పడుతూనే వుండేది.నాకు తెలుసు. డబ్బు నాకెందుకు నాన?డబ్బుఉంటే ఎంతయినా
ఖర్చు పెట్టొచ్చు. కాని అవసరం అనుకున్నప్పుడు మనకి దొరకదు. అత్యవసరం అనుకుంటేనే ఆ డబ్బు తీద్దాం అనుకున్నాను. ఇప్పుడు నా మనవళ్ళ అవసరానికి ఉపయోగపడింది కదా!ఎన్నో విలువలు నేర్పిస్తూ ప్రేమగా నిన్ను పెంచాను. కాని నీ భార్యకు భయపడి అమె తప్పును తప్పు అని చెప్పలేక పోయావు.? ఎన్నో కష్టాలు పడి నిన్ను ప్రయోజకున్ని చేసాను.భార్య మాటవిని నన్ను వృద్ధాశ్రమానికే పంపటానికి అంగీకరించావు. ఆ రోజు ఎంతోబాధతో కృంగి పోయాను. నా అవసాన దశలో కొడుకు, కోడలు, మనుమలతో గడపాలనుకున్న నాన.
కానీ ఆ ఆశ తీరకుండానే పోతున్నాను.
ఉత్తరం మడచి బ్యాగ్ లో పెట్టి అచేతంగా మంచంలో నెమ్మదిగా వాలిపోయింది.
అమ్మ ఉత్తరం చదివిన రామారావు నన్ను క్షమించు అమ్మా అని భోరున గుండెలవిసేలా విలపించాడు.కోడలు పశ్చాత్తాపంతో కుమిలి పోయింది.
మేము వచ్చేంత వరకు నానమ్మను దహనం చేయకండి అని పిల్లలు బయలుదేరేముందు ఫోన్ చేసి చెప్పారు.
రెండో రోజు మనమళ్ళు ఇంటికి చేరుకున్నారు. నానమ్మ పార్దివదేహాన్ని చూసి చంటిపిల్లల్లా ఏడ్చారు.
అంత్యక్రియలు ముగిసినవి
తెల్లవారి వృద్ధాశ్రమానికి వెళ్లి ఇంతకాలం మానానమ్మను ఎంతో జాగ్రత్తగా చూసిన ఆశ్రమ నిర్వాహకులకు కృతఙ్ఞతలు తెల్పి, ప్రతి సంవత్సరం ఆశ్రమ నిర్వహణకు నానమ్మ పేరున కొంత ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారు. ఆశ్రమంలో వృద్ధులందరికి బట్టలు, దుప్పట్లు, మందులు, పంచి అందరికి భోజనాలు ఏర్పాటు చేసి భారమైన హృదయాలతో వెనుదిరిగారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!