నా ప్రియమైన శత్రువు పెసరట్టు

నా ప్రియమైన శత్రువు పెసరట్టు

రచన :: జయకుమారి

అమ్మ తల్లి నువ్వు నీ జాడు నీరసం ఎప్పటికి పెడతావ్ తిండి తెల్లారి ఏ జాము అయ్యింది.
మా మొఖాలకి ఇప్పటికి ఇంకా ఏమి లేదు.
అయ్యో అత్తయ్య గారు అయ్యిపోతుంది.
ఇంకో పది నిముషాలు.
చీ.. నా కర్మ.
ఆడ దానికి ఆడదే శత్రువు అంటారు. అది నిజమో కాదో నాకు తెలియదు కానీ.
నువ్వే నా శత్రువు.
నువ్వు పెసరట్టు వు కాదు నా పాలిట పెద్ద టపకాయ్.
నీ పేరు ఎత్తిన ప్రతిసారి నా గుండెల్లో బాంబే.
పెసరట్టు:- ఓయ్ మేడమ్ ఊరుకుంటున్నాను అని ఏవేవో అంటున్నారు.
నేను మీకేెమి అన్యాయం చేసాను.
కోడలు:- ఎక్కడ నుంచి వస్తుంది ఈ మాట.
పెసరట్టు:- మేడమ్ అట్ల పేణం మీదా ఉన్నా నీ శత్రువుని మాట్లాడుతున్నా.
ఎందుకు నేను మీ శత్రువుని అయ్యాను కొంచెం సెలవు ఇవ్వండి.
కోడలు:-ఏమి చెప్పను.
నీ పేరు చెప్పి అల్పాహారం అనగానే నాకు హారతి పాట రెడి అయ్యినట్టే.
నిన్ను రాత్రి మూడు గంటలకే నానబెట్టాలి అంట
దానితో నా నిద్ర గోవిందా.
అప్పటి దాకా మెళుకువ గా ఉండి. అలారం పెట్టి నిద్రపోతే.
అలారం మోగే టైమ్ కి నీ సంగతి మరచి ఆదమర్చి నిద్దరోతే,
కోడి కూసే వేళలో హఠాత్తుగా నువ్వు గుర్తుకు వస్తే ఇక చూడాలి.
నా గుండెల్లో దడ దడ .అప్పుడు నాన బెడితే నానవు నువ్వు .
పెసరట్టు:- హా.. హా.. అవునా.
ఆ నవ్వు ఎందుకు వస్తుంది నీకు.
నాకు ఏడుపు వస్తుంది.
పెసరట్టు:- ఎందుకు ఆట  మూడు గంటలకే నాన బెట్టడం.
హ.. నాకేమి తెలుసు.
అది నీకు మా అత్త గారికె తెలియాలి.
ఏదో రుచి అంట.
నాన బెట్టడంలో తేడా వస్తే రుచి లో తేడా వస్తుంది అట.
పెసరట్టు:- అందరూ నన్ను అంత ల ఇష్ట పడుతుంటే నీకేంటోయ్ బాధ.
ఆహా.!
బాధ నాకు కాక తినే వాళ్లకి ఉంటుందా.
సరిగా నానని నిన్ను రుబ్బురోలు వేసే రుబ్బాలి అంట.!
మిక్క్సీ,గ్రైండర్ పనికి రాదు అంట.
పెసరట్టు:- అవునా.
హ్మ్మ్ అవును లేత గులాబీ రంగులో వుండే నా సుకమారమైన చేతులు ఎర్రగా కందిపోతున్నాయి.
పైగా దానిలో పచ్చిమిర్చి, అల్లమ్ ముక్కలు వేసి మరీ రుబ్బాలి.
పొరపాటున ఆ చేతులు మొఖం మీదకు వెల్లయో ఇక అంతే సాయంత్రం వరకు మంట మంట.
అప్పుడు నా గుండెల్లో మంట కు ఈ మంట తోడు అవుతుంది.
పైగా మా అత్త గారి మాటలు ఇంకా అవ్వలేదా అంటూ దానితో ఇంకా నా తిక్క నశనానికి వస్తుంది. హ.
పెసరట్టు:-
నువ్వే అంత బాధ పడితే.
నీ చేతిలో చస్తున్న నేను ఎంత బాధ పడాలి.
నీ అత్త మీదా కోపం అంతా నా మీద చూపిస్తూ
నన్ను రుబ్బురోలు వేసి కస కస రుబ్బుతుంటే.
అమ్మో అబ్బో అని నీలా అరవలేక నీ చేతిలో చస్తూ నీతో తిట్లు తింటూ.
నువ్వు వేసే అల్లమ్, పచ్చిమిర్చి ఘాటు కి నాలో నేను ఏడుస్తూ ఉంటా.
నా బాధ కన్నా నీ బాధ ఏ పాటిది చెప్పండి మేడమ్.
అయ్యో అవును కధా నీది బాధే కానీ. నువ్వు బాధ పడిన చివరికి మంచి పేరు వస్తుంది.
సూపర్ పెసరట్టు అంటూ నిన్ను మెచ్చుకుంటారు.
కానీ నాకు చివాట్లు, అలసట  తప్ప మిగిలేది ఏమి లేదు.
పెసరట్టు:-నాకు ఆ రుచి ఎక్కడి నుంచి వస్తుంది.
నేను వేడి వేడి పెనాం మీదా  వేసి నూనె వేసి దోరగా కాలుస్తున్నాం అనుకుంటారు కానీ నేను కాలుతూ మీకు ఆకలి తీరుస్తున్న అని ఎప్పుడైనా ఆలోచించరా.
అవును, కానీ నా పని నీ ఒక్క దానితో పోదు కదా, నీకు తోడు ఆ ఉప్మా గారిని పెళ్ళి కూతురిని రెడీ చేసినట్టు. నెయ్యి ,జీడిపప్పు కరివేపాకు, కోత్తిమిరా  వేసి రెడి చెయ్యాలి.
మీకు తోడు అల్లమ్ చెట్నీ,పప్పు చెట్నీ .
ఇన్ని రకాలు చేస్తుంది కదా కొద్దిగా ఆలస్యం అవుతుంది లే అనుకోరు.
ఇంకా అవ్వలేదా!  అంటూ సాగతీసుకుంటారు ఏమిటో.
మళ్ళీ ఇంకొకటి డైరెక్టుగా అట్టు పెనాం మీద నుంచి నోట్లోకి అన్నట్టు వేడి వేడి గా పొగలు కక్కాలి.
ఇది ఎక్కడి అన్యాయం చెప్పు నువ్వే నేను వంట గదిలో పడి చెమటలు కక్కుతున్న ఎవరికి పట్టదు కానీ,
నిన్నూ మటికి అపురూపంగా చూసుకుంటారు ముక్క కూడా  విరగనివ్వరు.
పైగా ఆహా…ఓహో… అంటూ పొగడ్తలు.
నిన్ను అంత అందంగా తయారు చేసిన నాకేమో చివాట్లు.
అందుకే నువ్వు ఎప్పుడూ నాకు  శత్రువు వే.
అందుకే నేను నిన్ను తిడుతున్న.
నీ గురించి నేను అందరితో తిట్లు తింటుంటే నిన్ను సృష్టించే నేను నిన్ను ఒక్క మాట అంటే.
వెంటనే వచ్చేసవా గొడవకు.
పెసరట్టు:- హా.. హా.. అవును మరి
అందరూ మెచ్చుకొనే నన్ను నువ్వు తిట్టుకుంటూ ఉంటే వచ్చా..
నువ్వు నన్ను అందరూ మెచ్చు కునేటట్టు చేసి.
నువ్వే తిడితే.
అమ్మే పిల్లలు మీదా కోపం తెచ్చుకుంటే మరి పిల్లలు ఏమవుతారు.
కోడలుపిల్ల :-
అవును కదా నేనే నిను అందంగా తయారు చేస్తున్నా. నేను నీకు అమ్మ ను.
అవును నువ్వు మటికి తక్కువ ఏమిటి.
నా ఇంట్లో వాళ్లకి ఆకలి తీర్చడానికి నువ్వు ఆహుతి అవుతున్నావ్ కదా.
నన్ను క్షమించు నిన్ను అనవసరంగా తిట్టుకున్న. మనుష్యులు మీద కోపం నీ మీద  చూపించా.
అయినా కూడా నువ్వు నా ప్రియమైన వారి ఆకలి తీర్చి వారి ఆరోగ్యానికి అండగా నిలిస్తున్నావ్.

అందుకే నా ప్రియమైన శత్రువు అయ్యావు.
ఇదే అండి నా పెసరట్టు నా ప్రియమైన శత్రువు.
********************************
ఇది నా స్వీయరచన ఎక్కడ అనువదించలేదు అని హాఁ

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!