ఏమో..ఏమో
రచన: రాయల అనీల
నీ రూపం కనబడుతున్నా
కళ్ళ ముందు శూన్యమే కనబడుతుంది అంటే
నేను వాస్తవంలో లేనా…….. ఏమో
నీ చిరునవ్వు సవ్వడి వినిపిస్తున్నా
అది ఎటువైపు నుండో అవగతం కాలేదు
అది నిజమేనా …….. ఏమో
నీ చూపు ,నీ ప్రేమ నాకు తెలుస్తుంది
కానీ అది గడిచిన గతం అంటున్నారు
అంటే నాది భ్రమనా …….. ఏమో
అందరూ జాలి చూపుతున్నారు
అదే ప్రేమంటున్నారు
అది ప్రేమ కాదా…….. ఏమో
నా ప్రేమ నిన్ను మరచిపోమ్మని
నేర్పుతుందా ..నేర్పగలదా…….. ఏమో
***