(అంశం: ” పెంకి పెళ్ళాం”)
మీరైనా చెప్పండీ
రచన :: జీ వీ నాయుడు
ముద్దు అంటే వద్దంటది
వద్దంటే ముద్దంటది
కస్సు మంటే బుస్సు మంటది
బుస్సు మంటే కస్సు మంటది
చీర కట్టమంటే డ్రెస్ వేస్తానంటది
డ్రెస్ వేయమంటే చీర కట్టుతానంటది
బట్టలుతకమంటే బుట్టలెందుకు అంటదో
బుట్టలెందుకంటే బట్టలుతుకుతానంటదో
కూర చెయ్యమంటే కూడు చేస్తానంటదో
కూడు చెయ్యమంటే కూర చేస్తానంటదో
ఫ్యాను వేయమంటే డోరువేస్తానంటదో
డోరు వెయ్యమంటే ఫ్యాను వేస్తానంటదో
కాలు పట్టమంటే కూలీ ఇవ్వమంటదో
కూలీ ఇస్తానంటే కోపగించుకుంటదో
ఇది వెంకీ పెళ్ళామో పెంకి పెళ్ళామో
మీరైనా చెప్పండీ విజ్ణులారా
సాహితీ ప్రియులారా…