(అంశం: ” పెంకి పెళ్ళాం”)
ముద్దుల భార్యామణి
రచన :: హసీనా ఇల్లూరి
అలిగి మూతి బిగించిన..
అల్లరి చేసి మురిపించిన…
ప్రేమతో మరిపించిన…
దుఖంలో నవ్వించిన…
సంతోషంలో జత కలిసిన…
కష్టంలో తోడు నిలబడిన…
గర్వమెక్కిన వేళ నేల దించిన..
కొంటె కళ్ళతో కవ్వించినా…
రోషంతో కన్నేగరేసిన…
ఏమ్ చేసినా ముద్దొచ్చే నా పెళ్ళాం..
పెళ్ళాలందు పెంకి పెళ్ళాలు వేరయా…
అందులో మా ఆవిడ బంగారమయా..