అపురూపము

(అంశం:: “నా ప్రేమ కథ”)

అపురూపము

రచన: నారుమంచి వాణి ప్రభాకరి


సూర్యుడు ప్రకాశవంతంగా వేసవిలో పగటికాలం ఎక్కువ వేడి ఉంటుంది పిల్లలను చదివించాలి అన్నది.రమణి కోరిక పల్లెలో హాయిగా సొంత ఇల్లు పాడి పంటలు చేతికి అందుతాయి అవన్నీ వదిలి పట్నం ఎందుకు ? కారు కొంటాను ఇద్దరు ఆడపిల్లలు తమ్ముడి మగ పిల్లలు నలుగురు కలిసి వెడతారు. నాకు పట్నం వద్దు అన్నాడు. సరే రమణి చెయ్యి గలిగినది
ఏమి లేదు? భర్త ఏమంటే అదే చెయ్యాలి ఇప్పటికీ ఉమ్మడి కుటుంబమే.ఆడ పిల్లలు ఇద్దరు ఇంటర్ చేరారు మగ పిల్లలను స్కూల్లో దింపి.తమ్ముడు వెళ్ళి వచ్చే వాడు ఆటో వచ్చి రాక వచ్చేవాడు ఇంక ఆడపిల్లలను రిస్క్ తీసుకుని వర్షం వావి ఏమి వచ్చినా వెళ్ళడం కష్టం అని ఆలోచించి పంపాడు.

చదువు తప్పదు చదువులేనిదే.జీవితం లేదు ఇంట్లో అంట్లు తోమి, పిల్లల్ని కని పెంచ డానికి కూడా డాక్టర్లు ,పి హెచ్. డీ ,ఇంజినీర్ చదివితే గాని పెళ్లి కావడం లేదు కట్నం పోలేదు
కానీ పక్కన ఇది ఒక. ఎడిషనల్ క్వాలిఫికేషన్ కావాలి. హరిణి అప్పట్లో హిందీ బి ఏ.చదివింది ఇల్లు పొందికగా చూసుకుంటుంది ఇద్దరు ఆడ పిల్లలు వారిని పెద్ద చదువు చవించాలని కోరిక.

హరిణి పిల్లలతో కలిసి మెలసి స్నేహితుల్లా ఉంటుంది .జ్ఞానం వచ్చిన పిల్లలు వంట వార్పూ అన్ని కూడా తల్లికి సహాయ పడతారు.

ఒకరోజు కాలేజి లో చేర్చాక పిల్లల్ని దగ్గర కూర్చో పెట్టుకుని అమ్మా ఈ వయస్సులో అన్ని అందంగానే ఉంటాయి ఎవరో ఏమి మాట్లాడిన పొగుడుతున్నారు అని పిస్తోంది కాని అది వయస్సు
ఆకర్షణ.చదువుకునే వయస్సులో చదువు కోవాలి. పెళ్లి వయస్సుకు పెళ్లి చేసుకోవాలి ఎది జీవితంలో వదలకూడదు దేని అనందం అందం దానివే కావాలనుకున్న ప్పుడు దొరకవు అందుకే మీ కోసం చదువుల నిమిత్తం కార్ కొన్నాను మీరు బుద్దిగా వెళ్ళి చదువు కొండి డ్రైవింగ్ కూడా బాబయ్య చేసి తీసుకు వెడతాడు అని ఎన్నో హితబోదలు చేశాడు.

రాగిణి మంజరి ఇద్దరు కూడా బాగా చదువు కోవడమే కాక మంచి చిత్ర కారిణి లు కూడా. ఒక సారి.ఒక పత్రిక పోటీలో రాగిణికి మొదటి బహుమతి మంజరికి నాల్గవ బహుమతి వచ్చింది. అయితే ఆ పత్రిక మేనేజ్ మెంట్ వారు వాళ్ళ కాలేజ్ లో సభ ఏర్పాటు చేసి బహుమతులు ఇచ్చారు.దానికి బ్యాంక్ నుంచి బహుమతి ప్రదా నానికి మెనేజేర్ వచ్చాడు

ఆయన వీళ్ళని చూసి ముచ్చట పడి నా కొడుక్కి పెద్ద పిల్లను చేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నాడు.

ఆ మర్నాడే వివరాలు.సేకరించి కబురు పంపాడు కానీ రమణి ఒప్పుకో లేదు భర్త శంకర్ కొంచెం మెత్త పడ్డాడు ఇద్దరుకి చెయ్యాలి కనుక.పెద్ద పిల్లకు చేస్తే మంచిది రెండవది కావాలంటే చదువు తుంది అన్నాడు అబ్బే పెద్దదే బాగా చదువు తుంది డిగ్రీ అవ్వాలని చెప్పి పంపేశారు

ఎంత చదివినా పెళ్లి పిల్లల తప్పరు అంటూ బామ్మ తాత సాగ దిశారు అని రమణి కోప్పడింది

సరే ప్రస్తుతానికి ఆవిషయం వీళ్ళు వదిలేశారు కానీ అవతలి వాళ్ళు వదల లేదు పిల్లల్ని ప్రేమ పేరుతో ప్రేమించాను అంటే పిల్లని చెయ్యరు అందుకని తెలివిగా కొన్నాళ్ళు చూద్దాము ఈ లోగా ఆడపిల్లల పెళ్లిళ్లు చేద్దాము అని నిర్యించుకుని ఆ ఎడిటర్ బ్యాంక్ మేనేజర్ ఊరు కుని వారిని మాత్రం వారి.పరిధిలో ఉంచారు రాగిణి కి డిగ్రీ అయ్యి పి జీ లో చేరుతా అన్నది తండ్రి వప్పుకో లేదు మేము డిగ్రీ వరకే అనుకున్నాము చెప్పించాము ఘనంగా పెళ్లి చేస్తాము నీకు నచ్చిన వాళ్ళు ఉన్నారా అన్నాడు రాగిణి భయ పడింది. కానీ బామ్మ అందుకుని రెండేళ్ల క్రితం బ్యాంక్ వారు కబురు చేసిన సంబంధం ఉందేమో చూడు వాళ్ళు పిల్లని చూసి ఇష్టపడ్డారు అని చెప్పింది సరేనని ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళి అడిగారు .ఆయన చిన్నగ నవ్వుకుని వివరాలు చెప్పారు అంతే ఇంకేముంది రాగిణి ని ప్రేమించి వాళ్ళ పిలుపుకోసం ఎదురు చూస్తున్న విశ్వ ఫ్యామిలీ అంతా ఇష్టపడ్డపెళ్ళి సంబంధం కదా .

రాగిణి కి విశ్వ ఫోన్ చేశాడు రెండేళ్ల నుంచి ఎదురు చూస్తున్న నీ చదువు ఎప్పుడు అవుతుందా అని .ఇప్పటికైనా మీ పెద్ద వాళ్ళు పిల్లకుపెళ్ళి చెయ్యాలని అనుకుంటున్నారు

అప్పట్లో ఎంత మందీ చెప్పిన వినలేదు నిన్ను ఒప్పించు కుందాము అంటే నువ్వు మీ పెద్దల మాట జవదాటని స్వభావము అందుకు నేనే నిదానంగా ఉండి మీ చదువు పూర్తి అయ్యే వరకు ఉన్నాను

ఇప్పుడైనా వాప్పుకున్న మీకు అందరికీ ధన్య వాదాలు

మాకు ఒక్క రూపాయి ఇవ్వ వద్దు అన్ని మేము చూసుకుంటాము అల్లుడు అయిన కొడుకు అయిన నేనే కదా నీకు ప్రేమ విలువ తెలియదు పెద్దల మాటే గాని ప్రేమ ఒక మధురము ఒక అపురూపం ఒక అపూర్వం ఒక అద్భుతం ఒక ప్రేమ అమృతం అది అందరికీ తెలియదు ముఖ్యంగా అడ పిల్లలు ఒక సంప్రదాయ కుటుంబంలో జన్మించిన మహిళలు ప్రేమ అనగానే
ఆమడ దూరం వెళ్ళి పోతారు

అందుకే నేను డైరెక్ట్ గానిన్ను కాక మీ పెద్దల మా పెద్దలను ఒకరి కొకరు ఒప్పుకునెలా చెప్పి పెళ్లికి వప్పించాను.పెళ్లిళ్లు ఏడు జన్మల నుంచి ఉన్న అనుబంధము విడదీయరానిది విడదీ య లేనిది నువ్వు ఇంకా చదువుకుంటానంటే చధివిస్తను ఒక్

మా ఇంట్లో నువ్వు చేసే పని లేదు పని వాళ్ళు వంట మనిషి ఉన్నారు నాన్న ఇంకా నాలుగు ఏళ్లు ఉద్యోగం చేస్తారు నేను ఎలాగ బ్యాంక్ లోనే కదా చేసేది నువ్వు బ్యాంక్ టెస్టుల రాయ వచ్చును అని చక్కగా రాగిణి .మనస్సులో పెళ్లికి ముందే మాటల ద్వారా స్థానం పొందాడు.

విశ్వ తెలివైన వాడు ముందు ఒక పేపర్ లో చిత్ర కరునిగా పని చేశాడు తరువాత ఒక ఛానెల్ లో కొన్నాళ్ళు పని చేశాడు కానీ తండ్రి బ్యాంక్ అయితే మంచిదని విశ్వని కూడా బ్యాంక్ లో వేయించాడు. అలా విశ్వ మనసు రాగిణి చుట్టూ పరి బ్రమించేది అతను చిత్ర కారుడు రాగిణి చిత్ర కారిణి కావడం ఒక్ రంగంలో గొప్ప అనుభవం ప్రేమకు దారి చూపినా పెద్దల బాటలో పెళ్లి ఆతరువాత ప్రేమ జీవితకాల ఆనందము. పిడికిిట తలంబ్రాలు పెళ్లి కూతురు అని శ్రీ అన్నమయ్య . శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన బ్యాండ్ మేళం వారి నుంచి శ్రావ్యంగా వినిపిస్తోంది

పెద్దల ఆశీస్సులతో విశ్వ రాగిణి పెళ్లి ఘనంగా జరిగింది ఏమైనా నీకు నీ ప్రేమ గొప్పది అందుకే నీకు ప్రేమ ఫలించిందని స్నేహితులు శుభ అభి నందన లు తెలిపారు . మనిషికి నిజమైన ప్రేమ ఉన్నట్లు అయితే తప్పక విజయం సాధిస్తుంది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!