వెదురు జెండా

వెదురు జెండా

రచన:: మంగు కృష్ణకుమారి

చేత్తో చక్రంలా బుట్టలు అల్లుతూ మనసులో‌ఎం అలోచిస్తున్నావన్నా వెదరుని వేణువుగా మలచిన చిన్ని కన్నయ్య తలపులో ఉన్నాడా!

నువ్వు చక్రం చెయ్యడమే సరైనపని ఈవెదురు చక్రమే నీ పాలిటి విష్ణు చక్రం, సంసారపు బండిని లాగే రధచక్రం వెనక్కి తిరిగి చూడకు సుమీ!

నిన్ను తన వేపు లాక్కొనే ప్రయత్నంతో ‘అప్పులు ఇస్తాం’ అంటూ కొత్త కొత్త
బేంకుల ఆశలు రేపే
మోసాల బేంకులూ, తలపులు తలలోంచి తీసెయ్యి …నిరంతర శ్రామికుడివై సాగిపో!

నువ్వు నమ్ముకున్న వెదురుచెట్టు నిన్ను మోసం చెయ్యదు సుమీ పర్యావరణం పరిశుభ్రత కావాలందరికీ అంగడిలో, పేరంటాల్లొ నోముల్లో పూజల్లో నీవల్లిన బుట్టలే కావాలట!

ఆడవాళ్ల అభిరుచికి అమర్చి పెట్టేవా ఏరోజూ నీకు తీరికే దక్కదు నీ వెనకాతల ఊరిస్తూ ఉన్నవన్నీ ఎప్పటికో ఒకప్పడు తప్పకుండా నీ ముందుకే వస్తాయి!

విజేతగా వెదురు జెండాని ఎగరవేద్దాం! భూమీ ఆకాశం,
నీవే నీవే నీదే నీదే

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!