సరస్వతి నమస్తుభ్యం

సరస్వతి నమస్తుభ్యం

రచన:: సావిత్రి కోవూరు 

‘సరస్వతీ నమస్తుభ్యం’ అని అక్షరాలు దిద్దితిన్

నీ చరణాల చెంత చిన్ని విరినై వికసించగ నెంచి,

తపించిన నా తృష్ణకున్ కరుణించి నా జిహ్మపై నిలిచి,

నా వాక్షుద్ధి గావించి  నా జీవమై, జీవన భృతివై,

నా సర్వస్వమై, నా యశస్సువై,  నా గమ్యమై,

నా తోడువైన శారదాంబ నీ పాదాల శిరస్సునుంచి ప్రణమిల్లు దాన.

నా కల సాకారమొనరించి ఆత్మశుద్ధివై అ, ఆ, లు దిద్దించి,

నీ కృప సాగరంబున తరింపజేసి తలెత్తుకునేలా చేసి,

నీ కరుణావీక్షణాల నన్ను ప్రశస్తిన్, యశస్విన్ గావించి,

నా కవనమై, నా కలమున కదలికవై,  నా కరమున ఆకరంబై,

నా స్వర గానమై గళ శుద్ధి గావించి, సకల కార్యాలకు ఆదివై

నా స్థిరచిత్త నివాసి వాగ్దేవి, నీ పాదాల శిరస్సు వంచి
ప్రణమిల్లుదాన.

అనవరతం నీ సేవాభిలాషినై,  కవనమై, నీ చరణములే స్పృషియించి,

మార్గదర్శివైన నీకున్ గానాల పాదాభిషేకంబు గావింతు,

నీ దయలేని నా ఉనికి అనామకమౌ, వాణి నీకు వందనాలు వందనాలు

నా మదిని నిక్షిప్తమై భాషాభావాల జాలువారు  సాగరంబున ఓలలాడించిన

ఓ దయామయి, వాగ్దేవి నీకు వందనాలు వందనాలు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!