కలికాలపు కాళి

అంశం : నిశి రాతిరి

కలికాలపు కాళి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: సత్య కామఋషి

తిమిరపు గాఢమైన మత్తుజల్లి
నిగూఢమైన అఙ్ఞానపు నిశి రాతిరి
నిరంతరం నిదురబుచ్చుతోంది..!

విఙ్ఞానపు వెలుగు రేఖలను,
ఏదారిన ఇట చోరనివ్వకుంది..
మెలకువనసలు రానివ్వకుంది.!

కనుపాప తెరలు ముడుచుకొనగ,
కలల మేఘాలు తరలుతుండగా.,

తూర్పు పడమరల తేడాలు మరచి.,
ఆశలూ ఆశయాల ఊసును విడిచి.,
నలిగిపోతున్న బంధాల పరిమళాల,
బాధ్యతల చితి వెచ్చదనం సాక్షిగా.,

మసకబారుతూన్న మానవ మనుగడనే.,
అస్థిత్వం లేని అస్తిపంజరాలుగా మిగల్చగ,
తీరని ఆకలిగొన్న కలికాలపు కాళియై.,
కాలాన్నలా కరిగించి కబళంచివేస్తోంది..!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!