అంశం: నిశిరాతిరి
చంద్రబింబం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు
నిఘుడాoదకారం అయిన నిశిరాతిరిలో,
చంద్రబింబం వంటి నీ ముఖారవిందం,
సిరివెన్నెల విరబూస్తు చిరు మందహాసంతో,
నను మైమరపించెను నా నెచ్చెలి,
నీ కలువ రేఖలు వంటి కన్నులు,
మిలమిలలాడే నక్షత్రాల వోలె ప్రకాశించుచుండ,
నల్లని మబ్బుల వోలె నిగనిగలాడుతూ
తళుక్కున మెరిసే వేగుచుక్కలా,
నిశిరాతిరి’లో ప్రకృతిని
నిండైన వెలుగులతో ఉషోదయం నింపే,
ఓ నా ప్రేయసి, మకరందం కన్నా,
నీ తీయని మనసు నా సొంతమై,
అమావాస్య చీకటిలు తొలగిపోయి,
పున్నమి రేయిలుతో
మన ప్రేమ నిత్యము సత్యమై
ఉండాలని కోరుతూన్న నీ ప్రియుడు.