పరిపక్వత

(అంశం:”తుంటరి ఆలోచనలు”)

పరిపక్వత

రచన: కవిత దాస్యం

రాధ మధ్య తరగతి అమ్మాయి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ట్యూషన్ లు చెప్పుకుంటూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ, తన ఇద్దరు చెల్లెల్ల బాగోగులు తనపై ఉండడంతో బాధ్యతగా ప్రవర్తిస్తూ, తల్లికి తలలో నాలికలా కలిసిపోయేది. బరువు బాధ్యతలతో పాటు అనుకువ, గుణము ఓర్పు, నేర్పు ఆటోమేటిగ్గా మధ్యతరగతి వాళ్లకి ఆభరణాలు గా ఉండాల్సిందే.
మురళి, మానస ఇద్దరు కవల పిల్లలు. ఉన్నత కుటుంబానికి చెందిన వారు కావడంతో, గారాబంగా పెరిగారు. మురళి ఆకతాయి చేష్టలకి, అల్లరికి తుంటరి ఆలోచనలకి , హద్దె లేదు. వీరు కూడా రాధ చదివే కాలేజీలో చదవడం, రాధను మురళి ఆటపట్టించడం, తినేసేలా చూడడం, సరదా అయిపోయింది మురళికి. రాధ ఎంత చెప్పినా వినేవాడు కాదు. రాధ నాదే అంటూ, తనను ఎవరూ చూడ వద్దని, తనపై సర్వహక్కులు తనకే ఉన్నాయని చెబుతూ, కాలేజీలో చదువు సంధ్యలు లేకుండా, తన ఇష్టానికి తిరిగేవాడు. ఎవరైనా ఎదురు తిరగాలంటే వాడి పేరు మీదనే కాలేజీ నడుస్తుంది. ఎవరు ఏం మాట్లాడలేకపోయారు. రోజు రోజుకి అల్లరి మితిమీరసాగింది. రాధ ఎంత వాదించిన వినని పరిస్థితి. పరీక్షలు దగ్గర పడటంతో, ప్రాక్టికల్స్ చేస్తున్న సమయంలో, మానస మీదికి ఒక యువకుడు బట్టలపై ఏదో కెమికల్ గుప్పిస్తాడు. వెంటనే పక్కనే ఉన్న రాధ అతని చెంప చెల్లు మనిపిస్తుంది. ఏం ఊరికే ఉన్నా రా ఆడపిల్లలు మాకంటూ ప్రశాంతమైన జీవితమే లేదా చదువుకునే సమయంలో చదువుకోనివ్వరు. మాకున్న ఈ ఒక్క అవకాశాన్ని కూడా పాడు చేసి, జీవితమే లేకుండా చేయడం మీకేం సరదా. పిచ్చిపిచ్చిగా ఉందా, మాకు ఏదైనా అయితే తల్లిదండ్రులకు ఏం సమాధానం ఇస్తారు. అంటూ ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ చేస్తా అని గట్టి గట్టిగా అరుస్తుంది. ఇదంతా చూస్తున్న మురళి షాక్ తింటాడు ఆమె ధైర్యానికి.
పొద్దున లేస్తే తన వెంట పడి ఏడిపించి సతాయించేవాణ్ని. నన్ను ఏ రోజు కూడా కొట్టలేదు. మాటలతో సర్ది చెప్పింది. ఇలాంటి ఒక శత్రువు చెల్లెల్ని తను పెద్ద ప్రమాదం నుంచి కాపాడింది. నేను చేసేది చాలా తప్పు అని తెలుసుకొని, తన ఆకతాయి పనులు తన తుంటరి ఆలోచనలకు స్వస్తి చెప్పాలనుకుని, రాధ దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరి, తన చెల్లెల్ని కాపాడినందుకు థాంక్స్ చెబుతూ, ఇన్ని రోజులు నేను ఆడవాళ్ల పట్ల ప్రవర్తించిన తీరు నాకే అసహ్యం వేస్తుంది. అని రాధతో చెప్తాడు. రాధ నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నీకు నచ్చితే మీ పెద్దవారి దగ్గరికి వెళ్లి మన పెళ్లి గురించి మాట్లాడుతాను. అని బుద్ధిమంతుడిలా మాట్లాడుతూ ఉండడం గమనించిన రాధ పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదు. నువ్వు మామూలుగా మంచోడివి వయసు నీతో అలా చేయించినది. ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. అదే సంతోషం.
నాకు కొంత సమయం కావాలి. చెల్లెళ్ల బాధ్యత నాపై ఉంది. చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి, కుటుంబానికి కొంత ఊరట అందించాక పెళ్లి విషయం ఆలోచిస్తా అని చెప్తుంది. సరే రాధ నీకైఎన్ని ఏళ్లు ఐనా వేచి ఉంటాను. నా ప్రేమను నిరూపించుకుంటాను. ఏదేమైనా నన్ను కాదన లేదు. అదే చాలా సంతోషం. ఎప్పటికైనా నీ ప్రేమ పిపాసిని అంటూ, అక్కడి నుంచి కదిలి వెళ్తాడు. తన పరిపక్వతకు రాధ లోలోపల మురిసిపోతుంది. మురళిని పరిస్థితులు చక్కబడ్డాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఆ తలంపే రాధ బుగ్గలు సిగ్గులతో కందేలా చేశాయి. అదే అతడిపై ఇష్టాన్ని వ్యక్తపరచాయి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!