సరదాగా

(అంశం:”తుంటరి ఆలోచనలు”)

సరదాగా

రచన:పుష్పాంజలి

సరదగా ఉండే తనునవ్వుతూ నవ్వించే మనసత్వం అంజలిది.అది 2019వ సంవత్సరం కార్తీకమాసం అసలే చలికాలం కార్తీకపురాణం ,ఉపవాసము,దానధర్మాలు వత్రలు నోములు ఇలా చేయడానికి కాదు గృహప్రవేశంనకు ముఖ్యంగా కన్యదానం చేయడానికి అంటే పెళ్ళిముహర్తాలకు అనువైన మాసంగా భావించివచ్చు అలాంటి మాసం కోసం ఎదురుచూస్తున్న మా బంధువులు అంటే నాకు చాల ఇష్టసఖి అయిన మాధవీలతకి పెళ్ళి కుదరింది. ఆ పెళ్లికి ముందుగా రమ్మని గోలపెడతుంటే నాకు సరిగ్గా పరీక్షలు సమయం ఇంట్లో ఇంకోకా ముఖ్యమైన బంధువులు పెళ్ళి ఉంటే వెళ్ళారు ఈ పెళ్ళి మా పక్క ఊరిలో …….

నేను మాధవీపెళ్లికి వెళ్లాను ముందుగానే పెళ్ళిముహర్తాలు రాత్రి కుదరడం నాకు ఆనందం అనిపించింది ఎందుకంటే మరుసటి రోజు నుంచి నాకు పరీక్షలు మొదలు .అందుకే మా టౌన్ లోని మా బంధువులతో వారి వినోవాలో వారితో పాటు తిరిగివచ్చాను .మాధవీ కి నా పరిస్థితి అర్థమైంది .పరీక్షలు అయిన తరువాత నా దగ్గరకు రావాలని ప్రమాణం చేయించి కుని మరి పంపింది.. అక్కడ ఉన్న మా బంధువులు ఆవిడా నీతోపాటు హనీమూన్ తీసుకుని వెళ్ళాతావా కొంపతీసి అని అడగతుంటే అంతా నవ్వులతో నాకు మాధవీకి సిగ్గు వచ్చింది కానీ మాధవీ అంది ఓ అత్తయ్య నాకు అయితే మీకు ఏమైనా అభ్యంతరం చెప్పండి.అమ్మో ఏమో అనుకున్న మాధవీ గడుసుపిల్లవే.హ మరి ఏమి అనుకున్నారు మాధవీ గురించి
అందరు నవ్వులతో ప్రతిధ్యనిస్తూంటే నేను మా బంధువులతో బయలుదేరాను

రాత్రి అసలే ఆలస్యం అయింది. ఆ పెళ్ళికి
మా కుటుంబసభ్యులు
ఎవరు  రాలేదు.నేను మాత్రమే బంధువులతో వెళ్లాను . వెళ్లి తిరిగి రావడానికి  రాత్రి 10:3౦ సమయం కావస్తుంది.
మా వీథికి రోడ్డుకి  ఒక అర్ద
కీలో మీటారు లోపలకి వుంటుది.   వారి వాహనంలో వచ్చాను…..

నేను రోడ్డు మీదే దిగాను  వారు లోపలకి వచ్చి వదలతాను అన్నా వద్దు అని  దిగాను అసలే బడాయి కదా మనకు పెద్ద ధైర్యవంతురాలు రోడ్డుకు అటువైపు శశ్మానం అసలే  కావడంతో చిమ్మ చీకటిగా వుంది వీధీ అంతా పురపాలక సంఘ వీధీ దీపాలు వెలగడంలేదు ఎందుకో ఆరోజు , ఇకా (లైట్స్)  ఆఫ్ చేసి ఉంది  ఎవరి  ఇళ్ళులో వాళ్ళు నిద్రపోతున్నారు

కుక్కలు అరుపులతో భయంకరమైన ఏడూస్తూ అరుస్తున్నాయి .నాకు వెన్నులో నుండి సన్నగా వణుకు మొదలైంది .అటువంటి సమయంలో నాకు ఒక ఆలోచన చటుక్కన మెరిసింది  …….

అంతే నా  చేతిసంచిలో
ఒక  పేపరు తీసుకొని
పొడవుగా రౌండ్ గా చుట్టీ
నోటి దగ్గర పెట్టుకుని
హే ఉల్లిపాయలు ఉల్లిపాయలు కీలో పదిరూపాయలు కిలో పదిరూపాయలు అని అరుస్తూంటే దెబ్బకు  ఇళ్ళలోని ఇంటిముందు ఉన్న లైట్లు అన్ని ఒక్కసారిగా వెలిగాయి. అందరూ తలుపులు తీసుకుని బయటకు వచ్చారు.   అమ్మా అనుకుని, బ్రతికినాను దేవుడా భయం తగ్గింది కదా !. ఇకా మనం తొందరగా జంప్ అవ్వాలని అనుకుంటూనే ,ఈ జనం చూడు కీలో పదిరూపాయలు అంటే ఎలా నమ్మోరు అని, 120రూపాయలు ఉల్లిపాయలు అమ్ముతుంటే పదిరూపాయలు అనుకుంటే ఎలా? అమ్మో ఎంతా ఆశ చూడు……

ఏమైతే ఏమి నా తుంటరి ఆలోచనను అమలుపరచినందుకు నన్ను నేను అభినదించుకుంటూ నేను  నిశ్బబ్దముగా ఇల్లు చేరాను.

************************

You May Also Like

One thought on “సరదాగా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!