కరోనాకాలంలో మహిళ

కరోనాకాలంలో మహిళ

రచయిత::గుడిపూడి రాధికారాణి

బండెడు చాకిరీకి భయపడిందే లేదు
కుటుంబం తనతో ఉంటే చాలని కుదుటపడింది
ఉరుకులు పరుగులతో ఊపిరి సలపని పనితో
పగలెలా గడిచిందో రాత్రెపుడు వచ్చిందో
కాలాతీతమైన ఆ కాంతకు పట్టనే లేదు
చిరుతిళ్ళకు ఆశపడే చిన్నారుల ఆరోగ్యంకోసం
మండే కట్టెలా పొయ్యిదగ్గరుండడం మహద్భాగ్యమనుకుంది
కాఫీ టీలను మొగుడికందిస్తూ అలిసిపోతూనే
ఇక మద్యం అలవాటు మరిపించేయగలగాలని మొక్కుకుంది
తాగొచ్చి రాత్రికి తన్నే మొగుడు
పిల్లల నవ్వుల తేనె తాగి సరదా పడితే
అన్నమక్కరలేకుండా కడుపునిండింది

పాపం ఆమెకు పెద్ద కోరికలేమున్నాయనీ
చిటికెడు పసుపు కుంకుమ తనతో అట్టిపెట్టుకుని
వెళ్ళిపోవాలనుకునే ఆశ తప్ప.
పాపం ఆమెకేం తెలుసనీ
అందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం
తన ఆరోగ్యం పణంగా పెట్టడం తప్ప
కన్నబిడ్డల క్షేమంకోసం
కావాలంటే కరోనానే కౌగలించుకునే
ఆ ధీశాలికి మమంతలమూర్తికి ..అక్షర నీరాజనం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!