పుట్టిన రోజు శుభాకాంక్షలు బిందు

మాటేమో ఫైర్ బ్రాండ్..
మనసేమో హిమమేలే
ముద్దుగా మైకు అన్నా..
మౌనంగా మురిసేవులే

పెద్దరికంగా మాట్లాడినా..
అల్లరి పనులు ఆపవులే
నీ దగ్గర వినటమే కానీ..
చెప్పే సాహసం మాకు తగదులే

కనుల నీరు వచ్చేంతగా..
నవ్వులు పూయిస్తావులే
అనుకోని కలయిక మనదైనా..
అక్షర బంధమై..
బిందు బిందువుగా కలసి
మనోహరంగా తపస్వి నీడన సాగుతున్నదిలే.

కొన్ని పరిచయాలు ఎప్పుడు ఎలా మొదలు అవుతాయో తెలియదు కానీ తెలియని అనుబంధంగా మారుతాయి అని నీ పరిచయంతో తెలిసింది బిందు..
హ్యాపీ బర్త్ డే 🌷
కార్తిక్ ఫైర్స్ & తపస్వి మనోహరం టీమ్

****

అనుక్షణం ప్రేమ వెన్నెలలు
హిమమై కురిపిస్తూ ఈ దత్తుని జీవితాన
ప్రియసఖివై ఆనంద “బిందు”వులతో
సాయి చందనాలై నిత్యం విరియాలి అని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ప్రతిక్షణం నీ చిరునవ్వుల స్నేహ పరిమళాన్ని అందించాలని ఆశిస్తూ
పుట్టిన రోజు శుభాకాంక్షలు హిమా..🌹

భర్త
V.V.S.R.దత్

కుమారులు
V.L.K. పవన్ చందన్
V. సాయి ప్రణీత్

****

తన మాట మంచు ముద్ద కాదు… కానీ
తనతో మాట్లాడని రోజు వెలితిగా అనిపిస్తుంది

తన కోపం అగ్ని గుండం కాదు… కానీ
తన కోపం కూడా ముద్దుగానే అనిపిస్తుంది

తన స్నేహం సాగర సమీరం కాదు… కానీ
మనసుని తాకే చల్లని హాయిని ఇస్తుంది

తన ప్రేమ అనుక్షణం నాకోసం కాదు.. కానీ
భరోసా ఇచ్చే బంధం తానే అనిపిస్తుంది

తోబుట్టువు కాదు… కానీ
నా ప్రతి భావం తనతో పంచుకోవాలి అనిపిస్తుంది

అక్షరాలు కలిపిన అన్న నీడన
అనుకోకుండా కలిసిన
అపూరూపమైన బంధం తను.

మన మనోహరమైన బంధాలు ఎప్పటికి ఇలాగే సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ..
జన్మదిన శుభాకాంక్షలు బిందు..❤️

అక్క & అన్నయ్య
G. V. లక్ష్మి & కార్తిక్

హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు బిందు

from

తపస్వి మనోహరం టీమ్💐

You May Also Like

17 thoughts on “పుట్టిన రోజు శుభాకాంక్షలు బిందు

  1. నా పుట్టినరోజుని ప్రత్యేకంగా మరిచిపోలేని జ్ఞాపకంగా మలచిన మా తపస్వి మనోహరం స్నేహితులకు హృదయ పూర్వక ధన్యవాదములు😍😍😍🥰🥰
    నాకు శుభాకాంక్షలు తెలిపిన మా శ్రీవారికి, మా శ్రీదేవి అక్కకి, నా సన్నిహితులకు మరియు రచయిత మిత్రులకు ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻

  2. Happy birthday sis❤🧡💛💚💙💜💙💚💛🧡❤
    kavithalu chala bavunnai👌👌👌👌👌

  3. పుట్టినరోజు శుభాకాంక్షలు బిందు సిస్ 💐💐

  4. పుట్టినరోజు శుభాకాంక్షలు రా బిందు నిండు నూరేళ్ళు ఇలా సంతోషంగా చక్కని ఆరోగ్యం ఉండాలి .god bless you రా💐💐💐💐💐💐💐

    1. పుట్టిన రోజు శుభాకాంక్షలు మేడమ్ 🎂💐

  5. కలకాలం చిరునవ్వులే నీ ఆభరణంగా
    అంబరాన్ని అంటే ఆనందాలే నీ తోడుగా
    అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్పూర్తిగా ఆశిస్తూ
    పుట్టినరోజు శుభాకాంక్షలు బిందు బేబీ…💐🎂🍫🍰

  6. అక్షర మాలికా చాలా బాగుంది
    నా శ్రీమతి కి ఇదే జన్మదిన శుభాకాంక్షలు🎂🎉🍻

  7. బంధాలు కలవడానికి కావలసింది సమయం కాదు, మనసు అని అనిపించేలా చేశావ్. పరిచయమయ్యి సంవత్సర కాలమే అయినా మరిచిపోలేని స్నేహాన్ని అందించావ్. మనసులో బాధలను మాటలతో మరిపించి చిరునవ్వులు పూయిస్తావ్. మన స్నేహం కలకాలం ఇలాగే ఉండాలని, నీ పెదవులపై చిరునవ్వు ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటున్నాము. 💐💐💐💐
    Many more happy returns of the Bindu. May u r all wishes come true. God bless u my dear. Love u sweet heart😘😘😘

  8. పుట్టిన రోజు శుభాకాంక్షలు బిందు డియర్ 💐🎂♥️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!