ఊహించని శరాఘాతం

ఊహించని శరాఘాతం

రచయిత::Dr.J.చలం

ఎంత ఘోరం జరిగింది మా ప్రియ రమేషా..
మమ్ములందరినీ వదిలి వెళ్లావు హమేషా!
ఎంత గాంభీర్యం శ్వేత వస్త్రధారణ..
ఎంత మనోహరం నీ మోమున చిరుదరహాసం..

పరోపకారమైన జీవన శైలి..
మరే ప్రతిఫలం ఆశించనిదే నీ రీతి .
ఏ మచ్చ లేని కర్తవ్యపాలనే నీకు ప్రీతి
సఛ్చీలము, అంతులేని సహనమే నీ ప్రకృతి.

మూగ జీవుల ఆదరించి ప్రేమించుటే నీ బాట
మెచ్చిన ఆ బాబాకే నీ అవసరం.
అందుకనేమో నీకు ప్రసాదించారు అల్పాయుష్షు
ఆ పైలోకంలో కూడా నీ అవసరం ఉందేమో !

చిరుప్రాయం నుండి ముళ్ళ బాటే నీ బాట
కష్టాలు, బాధ్యతలు తీరాయన్న మాట
అనుకునేంతలోనే మాకందరికి ఆశనిపాతం
నీ ఆకాల నిష్క్రమణం ఊహించని శరాఘాతం

జరగకూడనిది జరిగిపోయింది ప్రియతమా
మిత్రులు, సహోద్యోగుల ప్రశంసలూ,
మధురమైన నీ జ్ఞాపకాలు, చేతలు,
జీవిత కాలం పదిలంగా వుంటాయి మా మనస్సులో

స్వర్గలోకంలో నీవు చేరి మమ్ములను వీడినా
ఎప్పటికైనా మరువగలమా నీ స్మృతులను
ఆ పైలోకం నుండే శుభాలు, ఆశీర్వచనాలు
ఎల్లవేళలా అందించాలని మా వేడుకోలు.

బావమరిది రమేష్
అకాల మరణం మనసును
కలచివేసినందుకు ఈ నాలుగు మాటలు..🙏

You May Also Like

One thought on “ఊహించని శరాఘాతం

  1. మనసుని కుదిపివేసే వాక్యాలు సర్..
    మనుషులకు మనసులకు దగ్గరైన
    వాళ్ళ నిష్క్రమణ బాధాకరమైనదే
    దేవుని తీర్పుకి కట్టుబడి ఉండటం తప్ప
    మన చేతిలో ఏమి లేదన్నదే
    మనం అవగతం చేసుకోవాల్సిన నిజం..🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!