మజిలీ

మజిలీ

రచన: కార్తిక్ నిమ్మగడ్డ

బూజు పట్టిన రాతి ప్రపంచంలో
మసి పట్టిన మానవత్వం కోసం వెతుకులాట ఎందుకో..
పెచ్చులూడిన కప్పు కింద
బానిస బంధాల బ్రతుకులో
బాధ్యతల బరువుల బాగోతం ఎందుకో..
పగిలిన మనసుకి అంచుల్లో నిగూడంగా దాగున్న గాయాలు చెరగవని తెలిసి పూసే లేపనాలు ఎందుకో…
జలపాతాలు అయిన చెక్కిళ్ళ చారల్లో చెదిరిపోయిన ఆశలకి ఊపిరి పోయాలనే పోరాటాలు ఎందుకో…
కారు మబ్బులు కమ్మేసిన కనుల చాటున కనుమరుగు అయిపోయిన కోరికల చిట్టాని మళ్లీ చిగురింప చేయాలన్న పిచ్చి ప్రయత్నాలు ఎందుకో…
పగిలిన పెదవుల కింద నలిగిపోయిన చిరునవ్వులకి మళ్లీ ఊపిరి పోయాలన్న ఆరాటం ఎందుకో….
ఒట్టిపోయిన ఊపిరిని కూడగట్టి కలలకి ఊపిరి పోసి కాలాన్ని జయించాలన్న కోరిక ఎందుకో…
బండ బారిన గుండెకి ఆశల రెక్కలు తొడిగి…
బంధాల బాంధవ్యాల ఆశలు చూపుతూ జీవం పోయాలన్న పిచ్చి ఎందుకో….
జనన మరణ వలయంలో..
సాగే జీవన గమనంలో ఎదురయ్యే ప్రతి బంధంలో ఆగి తరిచి చూస్తే….
ఉన్నవి అన్నీ మజిలీలు మాత్రమే మన జీవిత ప్రయాణంలో…

You May Also Like

2 thoughts on “మజిలీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!