నిశీధితీరం

అంశం: నిశిరాతిరి

నిశీధితీరం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: మక్కువ. అరుణకుమారి

పగలంతా పని పాటలతో
తెల్లారుతుంది ఎలానో
అలసి సొలిసిన తనువు ఓర్వలేని
అలసటతో సోలిపోతుందో వైపు
మరో వైపు తరగని జ్ఞాపకాల
దొంతరలు పొరలు పొరలుగా
కుబుసం విడుస్తున్నాయి
విషనాగువోలే!
నీరవ నిశీధీలో స్వాప్నిక జగత్తులో
రేగే కలవరపు కలలను కనలేకనేమో
నిదురన్నదే మరచి బరువెక్కాయి కనురెప్పలు
దిగులు రేపు ఊహల తాకిడుల
తాడనల పీడనలకు ఓర్వలేకనేమో
నిశిరాతిరిలో వెలుగు జాబిలమ్మను
ప్రశ్నిస్తున్నాయి తలపులు
దూరతీరాల వీచు శీతల చందనపు పూతలద్దేదెపుడని?
మౌనం వహించిన నీరవ నిశ్శబ్ధంలో
గమ్యం తెలియని పయనంలా
లక్ష్యం చేరని నావలా
మిగిలున్నా నిశీధి తీరంలో!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!