కాలంతో పయనం

అంశం : నిశి రాతిరి

కాలంతో పయనం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: క్రాంతి కుమార్

జీవితమనే కాల ప్రవాహంలో
కొట్టుకుపోకుండా ఉండటానికి
మహానుభావుల మధుర కష్టాల
అనుభవాల నావలో పయనిస్తూ
జీవిత విలువలను నేర్చుకుంటూ
చిన్న కష్టాలకే కుంగిపోకుండా
అనుభవించిన బాధల నుండి
ఉత్తేజిత స్ఫూర్తిని పొందుతూ
ఇప్పుడున్న ఆనందమే శాశ్వతం కాదని
రాబోయే దుఃఖాలను తప్పించుకోలేననే
నగ్న సత్యాన్ని మనసుతో గ్రహించి
అల్ప సుఖాలకు అలవాటు పడకుండా
తోటి వారిని ఇబ్బందులకు గురి చేయకుండా
నన్ను నేను గాయపరచుకోకుండా
నేను నాది అని ఎవరికి హాని చేయని
కల్మషం లేని స్వచ్ఛమైన స్వార్థంతో
ఈ సమాజంలో ఎలా బ్రతకాలనే
గమ్యం లేని ఎన్నో ఆలోచనలతో
నిశి రాతిరిలో చుక్కలను లెక్కపెడుతూ
సరైన గమనం కోసం
నా అన్వేషణను కొనసాగిస్తున్నా..

You May Also Like

One thought on “కాలంతో పయనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!