అనాధ సేవ – జీవన సాఫల్యం

అంశం: ఇష్టమైన కష్టం

అనాధ సేవ – జీవన సాఫల్యం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

పరోపకారార్ధం ఇదం శరీరం
మానవసేవే మాధవ సేవని
నీకెవరేమిచ్చారని గాక
నీవెవరికేమి చేసావని చెప్పి
ఆచరణలో పెట్టిన మహాత్మగాంధీ,
వివేకానందుని  ఆదర్శంగా
భయంకరమైన కుష్టు వ్యాధి పీడితుల శరణాలయంలో
సేవ చేయడానికి చేరిన క్షణం
జీవితాన మరువలేనిది…!
బాబాయ్ గారు,పిన్ని గారు,
తాతయ్య, మామయ్య అంటూ
చిరునవ్వుతో పలకరిస్తూ వారికి సపర్యలు చేసినపుడు
జన్మనిచ్చిన పిల్లలకే భారమైన మాకు
సేవ చేస్తున్న నీవు నిండా నూరేళ్ళు బ్రతుకమ్మా అన్న దీవెనలు విన్న నాకు
ఇష్టమైన కష్టమే గాంధీ, వివేకానందునిల గాకపోయిన మానవ సేవ
జీవన సాఫల్యత కు కారణమన్నది జీవిత సత్యం….!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!