కవితా రచన

అంశం: ఇష్టమైన కష్టం!

కవితా రచన
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: ఎం.వి.చంద్రశేఖరరావు

ఇష్టమైన కష్టం ఏమిటంటే కవిత్వం వ్రాయడం!
దినకర మయూఖ తంత్రిపై వ్రాయాలా,
నిశిలో శశిపై వ్రాయాలా,
తళుకు బెళుకు తారకలపై వ్రాయాలా,
నీలినీలి ఆకాశంపై వ్రాయాలా,
ఎగిసిపడే సముద్రకెరటంపై వ్రాయాలా,
పేదవాడి ఆకలిమంటలపై వ్రాయలా,
దినం దినం జరిగే అన్యాయాలు,అక్రమాలపై
వ్రాయాలా అనేది, ఓ పెద్ద సమస్య, ఒక్కమాటలో
చెప్పాలంటే, ఇష్టమైన కష్టం!
అనంత అనంత విశ్వాన్ని,
అక్షరాలలో ఆవిష్కరించి,
మదిని హృదిని, తట్టిలేపేదే కవిత,
ఎగిసిపడే భావాలను, అక్షరరూపంలో,
చెలియలికట్ట చేర్చేదే కవిత,
విశ్వశ్రేయస్సే కవిత్వ లక్ష్యం!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!