జైదు రాఘవీయం

(అంశం:”ప్రేమ/సరసం)

జైదు రాఘవీయం

రచన: చిరునవ్వు rj రాల్స్

కథ ఉద్దేశ్యం :  ప్రేమలో నిజాయితీని పరిచయం చేయడం.

కథ పూర్తి భావం : ఇరువురి పాత్రల మధ్య ప్రేమ పుట్టుక, ఆ ప్రేమని గుర్తించడంలో ఎదురయ్యే పరిస్థితిని గూర్చి వివరణనివ్వడం..

సస్పెన్స్ వర్డ్స్ :
మసకబారిన కళ్లను వేళ్ళతో అదుముతుంటే మూసిన కనురెప్పల వెనక  తెల్లని చుక్కల పరుగు తననే చూడాలని పరిగెడుతుంటే రాఘవి అన్న పిలుపుతో ప్రాణం లేచొచ్చి మెల్లిగా అడుగులు వేసింది…

రెండు సంవత్సరాల క్రితం : ఊరందరినోట్లో అల్లరి పిల్లగా ముద్ర వేయించుకున్న రాఘవి చేష్టలను సహించలేని
తండ్రి సూరయ్య పట్టణనికి తీసుకెళ్లి రాఘవి కాలేజికి దగ్గర్లో ఉన్న హాస్టల్లో వేసొచ్చారు…..
రాఘవి రూమ్ మేట్స్ ట్రెండ్ బాగా ఫాలో చేసే పెద్ధింటి అమ్మాయిలు…. రాఘవి వెళ్లిన రోజు రాత్రి ఆ అమ్మాయిలు
ఇలా మాట్లాడుకుంటున్నారు…
అందులో ఒకరు హేయ్ వైన్ బాగా కలపవే చేదుగా ఉంటే తాగాలనిపించదు…. ఇంకొకరు కొద్దిగా తాగితే చెదే  మునిగితేనే తీపి…అవునవును మన అమ్మాయిలు స్మెల్ దగ్గరే ఆగిపోయి మత్తులో మునగడం కేవలం మొగాళ్ళ వంతు చేస్తున్నారు…అంతేకాదు లవ్ లో కూడా చూపుల దగ్గరే ఆగిపోయి ఏమాత్రం మునగకుండా ఐ హేట్ లవ్ & బాయ్స్ అంటూ లవ్ అనే పదాన్ని వాళ్ళకే అంకితం ఇస్తున్నాం.. అందుకే లవ్ చేయట్లేమ్ మగజాతికి లవర్నివ్వట్లేమ్ అంటూ మనలో మనమే నవ్వుకుంటున్నాం.
రాఘవికి మొదటి రోజు కాబట్టి తనకిచ్చిన బెడ్ పై మొహమాటంగా కూర్చుని లోలోపల అనుకుంటుంది… వీళ్ళది కూడ ఒక అల్లరేనా… నా అల్లరికి తట్టుకుంటారో లేదో పాపం అనుకుంటూ సూరయ్య కొత్తగా కొనిచ్చిన మొబైల్ లో వాట్సాప్ డౌన్లోడ్ చేసి పర్మిషన్స్ ఇవ్వగానే
ఏంట్రా బాబు నీ నెంబర్ ఇప్పటికి దొరికింది ఈ సారైనా మెడలో వేసుకోడానికి రుద్రాక్ష తీసుకొస్తున్నావా పదిన్నర వరకి రషీద్ పాన్ కోక దగ్గరుంటా వచ్చేసేయ్ అనే మెస్సేజ్ వచ్చింది.. ఆ  నెంబర్ ప్రొఫైల్ ఫోటో రిమూవ్ చేసి ఉంది…
అది చుసిన రాఘవి సరే మావ వెయిట్ చెయ్ వన్ వరకొచ్చేస్తా ప్లీజ్ అనే మెసేజ్ తో రిప్లై ఇచ్చి సూరయ్య నెంబర్, వార్డెన్ నెంబర్ మొబైల్ లో సేవ్ చేస్కుని పడుకుంది……
ఆ మరుసటి రోజు  ఓ పెద్దయాన కర్ర సహాయంతో చిన్నపిల్లోడిలా తడబడు అడుగులతో కాలేజీ గ్రౌండ్ లోకి వచ్చి ఇక్కడ మా జైదు ఉండాలమ్మ ఎక్కడున్నాడో కాస్త పిలుస్తావా అని రాఘవినే అడగగా… అయ్యో కనీసం నడిచే ఓపిక లేకుండా ఇంత దూరమోచ్చారా అంత ముఖ్యమైన పనేంటో చెప్పండి నేనెళ్ళి జైదుకి చెప్పేస్తా… జైదు ఇప్పుడు స్టేట్ డ్రాయింగ్ కంపిటేషన్లో ఉన్నాడు మీరు కలవడం కుదరకపోవచ్చు…వీళ్ళిద్దర్ని గమనిస్తున్న కాలేజీ పోకిరి బ్యాచ్ రాఘవి వైపు బెదిరిస్తున్న యాక్షన్ తో చూపుడువేలు చూయించి కంపిటేషన్ వైపుగా వెళ్లారు…. ఆ…భయానికి రాఘవి జంగం మావయ్య మీరిక బయలుదేరండి అంటూ బస్ ఎక్కిస్తుండగా…. పోకిరి బ్యాచ్ రక్తపు చుక్కలతో తడిసిన కత్తిని చేతిలో పట్టుకునొచ్చి బస్ ఎక్కారు……ఆ ప్రయాణంలో జంగమయ్య పూర్తిగా సీట్ చివర నక్కి కూర్చుండి చుట్టూ ఉన్న జనాలను వింతగా చూస్తూ వణుకుతున్న చేతిలో డబ్బులు పట్టుకుని శివాక్షికి ఈ బస్సు వెళ్తుందా అమ్మ అనగా… పోకిరి బ్యాచ్ శివాక్షినా సోనాక్షి దగ్గరికి పోవేంట్రా ముసలి అనగానే రాఘవి కోపంగా వాళ్లలో ఒకడికి చెంప చెల్లుమనిపించింది….. అది చూసిన జంగమయ్య బాబు తప్పయిపోయింది చిన్నపిల్ల తెలీక కొట్టేసింది… మా ఊరి పేరు శివాక్షి బాబు అదో అడవి ప్రాంతం … శివరాత్రి పండగ సందర్బంగా గుడి పైనా మా కొడుకు బొమ్మలు వేస్తేగాని జరుపమని ఊరిపెద్దలు పట్టుబట్టి కూర్చున్నారు…. అందుకే పది సంవత్సరాల తరువాత ఈడికొచ్చా.. మీ అంత సదువుకోలేదుకదబాబు ఎట్ల మెలగాలో ఇక్కడి పద్ధతి తెల్వక మా ఊరు పోతుందేమో అడిగాను తప్పయిందయ్యా అంటుండగా  బ్యాచ్ లోని ఇంకొకడు రాఘవికి ఆ.. రక్తపు కత్తిని చూయిస్తూ మ్యాటర్ ఓవర్ అనే సైగ చేయగా.. బస్సును ఆపమని చెప్పి కాలేజీకి పరిగెత్తింది రాఘవి…
అక్కడ జరిగింది విన్న రాఘవి కళ్ళు తిరిగి పడిపోయింది….

రాఘవి కళ్ళల్లో దృష్యం :
మొదటిసారి రాంగ్ నెంబర్తో వచ్చిన మెసేజ్ కి రిప్లైగా ఆటప్పటించాలని వన్ వరకొస్తానని చెప్పి పడుకున్న తరవాత ఆ మెసేజ్ చేసిన వ్యక్తిని చూడాలని ఆ రాత్రి హాస్టల్ గోడ దూకి కాలేజీ ముందున్న రషీద్ కోకకి వెనకాల ఉన్న టెలిఫోన్ బూత్ దగ్గర నిల్చుని చూస్తుంది.. రషీద్ కోపంగా అరేయ్ జైదు….మన ఫ్రెండ్స్ కి కాస్త చెప్పురా ఎప్పుడు నా దగ్గరే ఉండి గిరాకీ రాకుండా కస్టమర్ల పైనా కామెంట్స్ చేస్తున్నారు…. అదొక్కటే కాకుండా నాకొచ్చే కొన్ని డబ్బులు కూడా జేబులో ఉంచనివ్వకుండా పదరా సిట్టింగ్ అనుకుంటూ లాక్కేలుతున్నారు… తీరా తాగేసి నా ప్యాంట్ లాగేసి ఎప్పటిలాగే ఏంట్రా రషీదు ముందు మాత్రమే డ్రాయర్ ఉంది వెనక ఎప్పుడు వేసుకుంటావ్ అని ఎగతాలి చేస్తున్నారు…. నువ్ చెప్పరా జైదు అసలు డబ్బులే ఉండనివ్వట్లేరు ఇక కొత్త డ్రాయర్స్ ఎలా కొనుక్కుంటారా అనగానే రాఘవి పక్కున నవ్వి వెనక్కి తిరిగి చూడకుండా హాస్టల్ కి పరిగెత్తింది…. ఆ మరుసటి రోజు బస్ లో కూర్చున్న జైదుని చూసి తన మొబైల్ సైలెంట్ లో పెట్టి ఒకటే కాల్స్ మొతతో జైదుని ఆటపట్టించింది.కాలేజీకి వెళ్ళిన జైదు కోపంగా ఏంట్రా భోగం (బోగేష్ ) పదే పదే కాల్ చేసి కట్ చేస్తావే వేషాల అంటుండగా.. నేనా నీకా కాల్స్ ఊర్కోరా నేనెప్పుడూ చేశా….. దానితో ఆ రాంగ్ నెంబర్ ఎవరిదో కనుక్కోడానికి జైదు పడిన పాట్లన్ని రాఘవి స్వయంగా చూస్తూ ఆనందిస్తుంది…. రాఘవి మొబైల్ లో  సేవ్ చేసిన రెండు నంబర్స్ మాత్రమే ఉండటంతో జైదు చేసిన యే నెంబర్ ని లిఫ్ట్ చేయడంలేదు….. ఆ రాత్రి జైదు చిరాగ్గా హాయ్ అండి మా ఫ్రెండ్ అనుకుని  తెలీక ఆ రోజు మెసేజ్ చేశా… దానికి తగ్గ ప్రతిఫలం ఒకటికి బదులు రెండు గంటలవరకు వెయిట్ చేశా…. కొంత వరకు సానుకూలంగా వాళ్ళ వాదన జరిగి మళ్ళీ కాల్స్, మెసేజ్ లు రావద్దని ఒప్పందం కుదుర్చుకున్నారు…
మరుసటి రోజు కాలేజీలో పోకిరి బ్యాచ్ రాఘవిని ర్యాగింగ్ చేస్తూ…. కాలేజీ పెయింటిగ్ హాల్ లో సరస భంగిమతో గల అమ్మాయి ప్రతిమను డ్రా చేయమని ఆర్డర్ వేసి వెళ్లిపోయారు …. ఆ డ్రా వేయడానికి క్రుంగిపోతున్న రాఘవి చేతిలోంచి జైదు పెయింట్స్ తీస్కుని అందమైన నాట్య ప్రతిమను డ్రా చేసి వెళ్ళిపోయాడు అది చూసిన రాఘవికి జైదు పైనా ప్రేమ పుట్టుకొచ్చింది… ఆ డ్రా ఎలా ఉందంటే నటరాజ ప్రతిమలో అమ్మాయిని ఆ ప్రతిమకు మొక్కుతున్న  భంగిమలో పోకిరిని అచ్చుగుద్దేలా డ్రా చేసాడు….
ఆ రోజు రాత్రి జైదుకి మళ్ళీ మెసేజ్.. మీ డ్రాయింగ్ చాలా బావుంది పెద్ద గుణపాఠంగా వాడి భంగిమ వేసి ఆ అమ్మాయి పరువు కాపాడారు…. అంటూ పొగడ్తలతో ముంచెత్తి…. వీలుంటే నన్ను డ్రాచేయండి… మీలాంటి గొప్ప పెయింటర్ చేతిలో నా డ్రా అని చెప్పుకు మురిసిపోతా అనగానే జైదు పెదవులపై చిరునవ్వు….. రాఘవి ఆ డైలాగ్ తో ఆగకుండా మీకో టాస్క్ అంటూ తన  భాగాలను విడిగా ( ముక్కు, చెవి, కళ్ళు, గడ్డం ) సెండ్ చేసింది..
ఆరోజు మొదలు ప్రతీ రోజు నా డ్రాయింగ్ వేశారా అంటూ జైదుకి మెసేజ్ చేయడం…ఒకరి అభిరుచులు మరొకరు, స్వియ వివరాలతో సహా తెలుసుకోవడం ఆ పరిచయం పూర్తిగా ప్రేమకి దారితీసింది… కానీ అప్పటికే జైదు కాలేజీ హాల్ లో వేసిన నాట్య ప్రతిమతో పగని పెంచుకున్న పోకిరి మూక అదును చూసుకుని రాఘవిని స్టూడెంట్స్ లేని గదిలోకి లాక్కెల్లి.. చున్నీ లాగేసి.. డ్రెస్ కాస్త చించి చెడిపోయిందని ముద్రని వేశారు ఆ అవమానాన్ని తట్టుకోలేని రాఘవి కాలేజీకి మాత్రమే కాకుండా జైదుకి కూడా టచ్ లో ఉండకూడదని ఊరేళ్ళిపోయింది…. జైదు నుండి ఎన్నో మెసేజ్ లు ఏమైంది … మీరు నాతో ఎందుకని మాట్లాడట్లేరు… ఏదైనా ప్రాబ్లెమ్ ఆ….కాలేజీ లో ఆ రాఘవి గారి సంఘటన వల్ల భయపడ్డారా… వచ్చే వారం మా ఊరిలో శివరాత్రి రాథోత్సవం  ఒక వారం అక్కడే ఉంటానేమో అందుకే నేను ఊరెళ్ళక ముందే మిమ్మల్ని డైరెక్ట్ గా చూసి ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి…అంతే కాకుండా కాలేజీ లో స్టేట్ డ్రాయింగ్ కంపిటిషన్ జరుగుతుంది… ఆ కంపిటేషన్ లో నేను పాల్గొనాలి అంటే మీరు కచ్చితంగా రావాలి అనగానే రాఘవి కొద్దిగా ఆలోచనలోపడి  మరుసటి రోజు జైదుకోసం తప్పక కాలేజీకి వచ్చిన గంటకే జైదు వాళ్ళ నాన్నగారు జంగమయ్య రావడం…. ఆ కొన్ని క్షణాల తరువాత బస్ దిగి పరుగెత్తుకొచ్చిన రాఘవికి తన హాస్టల్ రూమ్ మేట్స్ డ్రాయింగ్ కంపిటేషన్స్ జరుగుతున్న సమయంలో ఆ పోకిరి బ్యాచ్ జైదు ర్యాగింగ్లో నీకు సహాయం చేసాడని కోపంతో ఈ కంపిటేషన్ లో జైదు సెలెక్ట్ అవ్వద్దని చేతివేళ్ళని కట్ చేసి అదికూడా చాలదని మా అందరిని చూస్తూ…. ఎవ్వరైనా కంప్లెన్ట్ చేస్తే ఇలా కూడా జరుగుతుందని జైదుని పొడిచేసారు…. ఆ వెంటనే ఫ్యాకల్టీ వాళ్ళు అంబులెన్స్ కి కాల్ చేసారు …..అంటూ చెప్తున్న మాటలన్నీ విన్న రాఘవి కంపిటేషన్ రూమ్ కి పరుగెత్తి జైదుని చూసి కళ్ళు తిరిగి పడిపోయింది…..పడిపోయిన రాఘవిని చూసి అందరూ ఒక్కసారిగా రాఘవి అంటూ కేకలు వేసారు… ఆ రాఘవి అనే కేకలకు జైదు ఉలిక్కిపడి శ్వాసను దీర్గంగా తీస్కుని రాఘవి అంటూ మెల్లిగా పిలవడం చేసాడు…
మసకబారిన కళ్లను వేళ్ళతో అదుముతుంటే మూసిన కనురెప్పల వెనక  తెల్లని చుక్కల పరుగు తననే చూడాలని పరిగెడుతుంటే రాఘవి అన్న పిలుపుతో ప్రాణం లేచొచ్చి మెల్లిగా అడుగులు వేసింది రాఘవి….
ఆ క్షణమె అంబులెన్స్ రావడంతో వాళ్లిద్దరిని హాస్పిటల్ తీసుకెళ్లడం జరగగా కోలుకున్న జైదు పక్కనే ఉన్న రాఘవి చేతిని పట్టుకుని నన్నెప్పటికి విడిచివెల్లిపోనాని మాటివ్వు అనగానే కొద్దిగ షాక్ అయినా రాఘవి నేను మీకు ముందే తెలుసా….
హ తెలుసు మొదటి సారిగా రషీద్ కోక వెనకాల పక్కున నవ్విన సమయంలో టెలిఫోన్ బూత్ గ్లాస్ పై పడ్డ నీ ప్రతిబింబాన్ని చూసా….ఆ క్షణమే నా మనసులో చిత్రించేసుకున్న… అది కాకుండా పదే పదే కాల్ చేసి ఆటపట్టించి ఆనందిస్తుంటే నీ ప్రతీ చర్యని దూరంగానే ఉండి గమనించా….నువ్వు నా అనుకున్న కాబట్టే ఆ రోజు నాట్య ప్రతిమ వేసా… నాకు తెలుసు మెసేజెస్ నువ్వే చేస్తున్నావని అయినా అందులో కూడా ప్రేమ మాధుర్యాన్ని పొందాను.. ఆ తరవాత నీ విడి భాగాలను కలుపుతూ అందంగా గీసిన బొమ్మని నీకివ్వాలని అనుకున్న కానీ మన మొదటి మీట్ లో ఇద్దామని ఆగిపోయా…అంతగా నిన్ను నేను.. నువ్వు నన్ను ఆరాధిస్తుంటే చెడిపోయావన్న మచ్చకి నిన్నేలా వదిలేస్తాను అనుకున్నావ్…. ఆ మాటలన్నీ విన్న రాఘవి జైదు భుజాన ప్రేమగా వాలిపోయింది. ఆ రోజు సూరయ్య నా పేరుతో సహా పదా జంగం మావయ్య అన్నప్పుడే అనుకున్నా తల్లి మీరు ప్రేమలో ఉన్నారని అనగానే చిన్నగా నవ్వుకున్నారు…ఆ మరుసటి రోజే శివరాత్రి రథోత్సవంలో ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకున్నారు….ఆ క్షణం భోగం ( భోగేష్ ) రుద్రాక్షను రాఘవి చేతికిచ్చి జైదుకి కట్టించాడు… జైదు తను గీసిన చిత్రాన్ని ఇదిగో నా భార్యని నీ చేతిలో పెడ్తున్న జాగ్రత్త అంటూ చిలిపిగా రాఘవి కళ్ళ ముందు పరిచి నుదిటిన తిలకాన్ని దిద్దాడు….

ఈ కథ పూర్తి ఊహ కల్పితమే ✍️

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!