ప్రేమ టపాకాయ్

(అంశం:ప్రేమ/సరసం)

ప్రేమ టపాకాయ్

రచన: సంజన కృతజ్ఞ

అనగనగా ఒక ఊరిలో ఇద్దరు ప్రేమికులు ఉంటారు. మోహన్ , సుహాసిని ఒకరి మీద ఒకరికి అమితమైన ప్రేమ ఉంటుంది సుహాసినికి మోహన్ అంటే చాలా ఇష్టం టూ ఇయర్స్ నుంచి ప్రేమిస్తూ ఉంటుంది. కానీ తన ప్రేమని ఎప్పుడు మోహన్ కి చెప్పలేదు. ఒకరోజు కాలింగ్ బెల్ శబ్దం వినిపిస్తుంది సుహాసిని కి పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు తీస్తుంది. కళ్ళ ముందు నిల్చున్న మోహన్ ను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అతడి చేతిలోని స్వీట్ ప్యాకెట్ చూసి గెస్ చేసింది. ఈరోజు నా బర్త్ డే అని తెలుసుకొని మార్నింగే విషెస్ చెప్పడానికి తన కలల ప్రియుడు వచ్చాడు. ఆనందంతో ఇంట్లోకి ఆహ్వానించడమే మర్చిపోయింది.

” రండి… రండి…” అని చెప్పటంతో మోహన్ ఇంట్లో కెళ్లి సోఫాలో కూర్చునాడు.
” ఐదు నిమిషాల్లో టిఫిన్ రెడీ చేస్తాను కూర్చో” అంది సంతోషంగా.
“నాకు టిఫిన్ అక్కర్లేదు నేను వచ్చింది…. ….”
“నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు”
“నేను చెప్పేది వింటావా?” ఆమె స్పీడుకు ఆశ్చర్యపోయాడు మోహన్.
“మీరు వచ్చింది నా బర్త్డే ఉందని తెలిసి నాకు విషెస్ చెప్పాలని. చూశావా నేను ఎంత కరెక్ట్ గా గెస్ చేశానో, మరి ఎందుకు ఆలస్యం, నీ చేతులతో నాకు స్వీట్ తినిపించవా?” అంది ఆశగా సుహాసిని.
“నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది ఆ మాట వినటం తోనే షాక్ తిన్నట్ల అయ్యింది సుహాసినికి.
“ఏంటి జోక్ చేస్తున్నావా? టూ ఇయర్స్ నుండి నిన్ను ప్రేమిస్తున్నాను. ఇప్పుడు నీవు మ్యారేజ్ చేసుకుంటానని అని చెపితే నా మనసు తట్టు కోలేకపోతుంది” కళ్ళనీళ్ళు పెట్టుకుంది.
“ఐ యామ్ సారీ సుహాసిని టూ ఇయర్స్ నుండి నన్ను ప్రేమిస్తున్నా నువ్వు ఒక్క రోజైనా ధైర్యం చేసి నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పలేదు. నీ ప్రేమను నాతో తెలియపరచ కుంటే నాకెలా తెలుస్తుంది. నాదెలా తప్పు అవుతుంది?”
“నీవు లేకపోతే నేను చచ్చి పోతాను” అంది సుహాసిని “పిచ్చి సుహాసిని! అన్ని సమస్యలకు చావే పరిష్కారం కాదు. సీమ టపాకాయ పేలితే బాంబుల వర్షం కురుస్తుంది. ప్రేమ టపాకాయ పేలితే ప్రేమికులిద్దరి మనసులో ప్రేమమృతం వెల్లివిరుస్తుంది. గుడ్డిగా ప్రేమించటం కాదు. మనసులోని ప్రేమను మరో మనసుకు తెలియజేస్తే నే తెలుస్తుంది. ప్రేమ టపాకాయ పేలుతుందో ,పేలదో అనే విషయం. నీకు నాకంటే మంచి ప్రేమికుడు దొరుకుతాడు. మార్కెట్లో ప్రేమ టపాకాయలు ఎన్నో ఉన్నాయి. ఏదో ఒక్క దాన్ని చూసి వెలిగిస్తే చాలు. ప్రేమ వెల్లివిరుస్తుంది.” అని ధైర్యాన్ని చెప్పిన మోహన్ తో, సుహాసిని స్వీట్స్ ను పంచుకొని ఆనందించింది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!