నా ప్రేమ గురించి

(అంశం:: “నా ప్రేమ కథ”)

నా ప్రేమ గురించి

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

సాయంత్రం 6గం.. చల్లని వాతావరణం, హాయిగా ఉంది. ఫ్రెష్ అయ్యి, నిఖిల్ ని తీసుకుని ఇంటికి దగ్గరలో ఉన్న పార్కుకు వచ్చాను. ఇంతలో శ్రీధర్ … శ్రీధర్ అన్న పిలుపు విని ఉలిక్కిపడ్డాను. అటు చూసేసరికి, ఒక బాబు పరిగెత్తుకుంటూ వస్తుంటే, వాళ్ళ  అమ్మ అనుకుంటా  వాడిని  పిలుస్తోంది. బాబుని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుని, నీ పేరేమిటి అని అడిగాను, నాకు తెలిసినా  కూడా . సాయి శ్రీధర్ అని చెప్పి, వాళ్ళ అమ్మ దగ్గరకి పరిగెత్తాడు.

అసలు ఆ పేరులోనే ఉందేమో వైబ్రేషన్ అనిపించింది. మళ్లీ  అదేదో సినిమాలో మహేష్ పేరులోనే వైబ్రేషన్ ఉంది అని అంటుంది హీరోయిన్ ఆ డైలాగ్ గుర్తు వచ్చి నాలో నేనే నవ్వుకున్నాను. చాలా చీకటి గా అనిపించి, నిఖిల్ ని తీసుకుని ఇంటికి బయలుదేరాను.

నిఖిల్ కి హోమ్ వర్క్ చేయించి, అన్నం పెట్టి, వాడిని నిద్ర పుచ్చాను. రాత్రి 10గం.. ఇంకా సురేష్ (మా వారు) ఆఫీస్ నుంచి రాలేదు. టీ వీ ఆన్ చేసి, పాటలు పెట్టుకుని చూస్తూ, ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటే చేస్తున్నాను. ఇంతలో బయట గేట్ సౌండ్, సురేష్ వచ్చినట్టున్నాడు. తను ఫ్రెష్ అయి వచ్చాక, ఇద్దరం అన్నం తిన్నాము.

తను పడుకున్నాక, నేను రేపు మార్నింగ్ కు కావలసిన కూరలు కట్ చేసుకోవటం, టిఫన్ కి గ్రైండర్ పని చేసుకుంటున్నాను. ఇంతలో టీ.వీ లో నుంచి  నాకు ఇష్టమైన హీరో నాగార్జున, తన  హిట్ సాంగ్ ఏటో వెళ్లి పోయింది మనసు….  అన్న పాట ప్లే అవుతోంది. సౌండ్ పెంచి, చూస్తూఉంటే, నిజంగానే నా మనసుకూడా ఏటో వెళ్ళిపోయింది.

అవి నేను, డిగ్రీ చదువుకొనే రోజులు. నాకు చాలా ఇష్టమైన కాలేజీ రోజులు. నిజంగానే ఎవరి జీవితంలో నైనా,  గుర్తువుంచుకునే రోజులు ఏవో ఒకటి  ఉంటాయి. ఇల్లు, కాలేజీ, ఫ్రెండ్స్, చదువు, ఎగ్జామ్స్, ర్యాంకులు, సినిమాలు. అవే ఆరోజుల్లో మేము ఆలోచించేవి.

విజయ్, శ్యాం, నీలు, రాజీ, హరిత వీళ్ళే మా ఫ్రెండ్స్ గ్యాంగ్. . శ్రీధర్ కూడా నా క్లాసు మేట్. డీసెంట్ గ, స్టైల్ గ  ఉండేవాడు. అంతకు మించి తన గురించి ఏమి తెలియదు. కానీ మా గ్యాంగ్ లో నీలిమ తో బాగా మాట్లాడేవాడు. కనుక జస్ట్ నన్ను చూసి చిన్న స్మైల్ ఇచ్చేవాడు అంతే. అలాంటిది ఒక రోజు వచ్చి, సడన్ గ నాకు ప్రపోజ్  చేసాడు. నేను ఫుల్ షాక్. ఎందుకంటే, క్లాస్ లో నేనే కామ్ గోయింగ్. (నాలో తనకి నచ్చింది కూడా ఇదేనట తరవాత తెలిసింది). తనతో కూడా పెద్దగా మాట్లాండింది లేదు. జస్ట్ స్మైల్ అంతే మాకు కమ్యూనికేషన్. ఆలా ఎలా ప్రపోజ్ చేస్తాడు.

నాకు చాలా కోపం వచ్చింది. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్ధం అవ్వలేదు. కానీ బాగా తిట్టాను. నాకు అలాంటి ఉద్దేశ్యమే లేదని చెప్పాను. కాదు, నాకు నీ స్మైల్ ఇష్టం. అని ఇంకా ఎదో చెప్పబోయాడు. కానీ నేను మాట్లాడలేదు. తాను కూడా కామ్ గా వెళ్ళిపోయాడు అక్కడ నుంచి.

తరువాత రోజునుంచి, నేను కాలేజీ లో ఎంటర్ ఐతే చాలు, తను, నాకు కనిపించకుండా వెళ్లిపోయేవాడు. నాకు కొంచెం బాధగా అనిపించేది. నన్ను మాత్రం తను ఏ రకం గాను ఇబ్బంది పెట్టలేదు. తను మాత్రం ఇదివరకటిలా ఆక్టివ్ గ ఉండట్లేదు.
ఆ రోజు శ్రావణ శుక్రవారం. నేను చక్కగ తలంటి పోసుకుని, వైట్ కలర్  (ఆ కలర్ తనకి ఇష్టమని తర్వాత తెలిసింది) లంగా ఓణీ వేసుకుని, లూస్ హెయిర్ తో కాలేజీ లో అడుగుపెట్టాను. మా ఫ్రెండ్స్ అందరు, హే, ఏంజెల్ .. కం, కం, అని ఆట పట్టించారు. నేను చిన్న స్మైల్ తో వాళ్ళని మందలిస్తుంటే, అనుకోకుండా శ్రీధర్

ఎదురుపడ్డాడు. నన్ను చూసిన తన కళ్ళల్లో చిన్న మెరుపు, పెదువుల పైన చిన్న చిరు నవ్వు నేను గమనించాను. కానీ నన్ను పలకరించలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ తనని వారిస్తున్నా, తను మారట్లేదు, ఇదివరకు లాగా ఉండట్లేదు. ఎప్పుడు ఎదురు పడిన ఇదే భావం, కళ్ళతోనే మాటలు. అసలు నీకు మనసు లేదే, అని మా ఫ్రెండ్స్ నన్ను తిట్టకపోలేదు. కానీ అసలు నాకు, ఆ ప్రేమ, పెళ్లి ఆలోచనే లేదు. ఎంతసేపు, చదువు, రాంక్ లు అదే ధ్యాస.

డిగ్రీ ఫేర్ వెల్ టైం దగ్గరికి వచ్చింది. ఆ రోజు మాత్రం నేను తనతో  మాట్లాడకుండా ఉండ లేక పోయాను. ఆటోగ్రాఫ్ అడుగుదామని వెళ్ళి న నన్ను చూసి, నమ్మలేనంత మెరుపు తన కళ్ళల్లో. ఈ సారి నాకు కూడా ఆ ఫీలింగ్ బాగుంది అనిపించి, కాసేపు తనతో ఉండిపోయాను. అంతకంటే, తన హ్యాపీ నెస్ కి నేనేమి చేయలేకపోయాను. ఎందుకంటే, ఇంకా ఇంకో స్టెప్ వేయాలంటే, మా కుటుంబం గురుంచి కూడా ఆలోచించాలి కదా. ఇలాంటివి మా ఇంట్లో ఎంకారెజ్ చెయ్యరు.  కనుక, నేను ఇంకా ఏమి చెయ్యలేక సెండ్ ఆఫ్ ఇచ్చాను.

నెక్స్ట్ ఇయర్ లో   నేను పి. జి. లో జాయిన్ అవ్వటం, కొత్త స్నేహితులు, ఎగ్జామ్స్, రాంక్స్, సినిమాలు, ఆలా వేరే లోకం లో ఉన్నాను. ఇయర్ చివరిలో,  ఫస్ట్ రాంక్, లైఫ్ సక్సెస్ అనుకున్నాను. ఆలా కాలేజీ లైఫ్ ఎండ్ అయింది.

తరువాత ఒక సంవత్సరానికి, సురేష్ తో పెళ్లి, నెక్స్ట్ ఇయర్ కి నిఖిల్ పుట్టడం, ఆలా జరిగిపోయింది.

కానీ, ఈ మధ్య పాత ఫ్రెండ్స్ లిస్ట్ లో శ్రీధర్ కూడా ఉన్నాడు నా పేస్ బుక్ అకౌంట్ లో. ఒక రోజు మెసెంజర్ లో, సెప్టెంబర్ 2 న, హాయ్ అని మెసేజ్ పెట్టాను. ఆ రోజు తన బర్త్ డే అని విషెస్ చెపుతూ . హాయ్, ఎలా ఉన్నావ్ అని రిప్లై పెట్టాడు.  తన బర్త్ డే గుర్తుపెట్టుకున్నందుకు చాలా హాపీగా ఫీల్ అవుతూ.
మా ఫామిలీ ఫోటో తనకు సెండ్ చేశాను మెసెంజర్ లో . నా వివరాలన్ని చెపుతూ. తను కూడా, వాళ్ళ ఫామిలీ ఫోటో నాకు సెండ్ చేసాడు. వాళ్ళ వివరాలు నాకు సెండ్ చేసాడు.
తను ఎం. బి. ఏ.,  పి హెచ్డీ చేసి, కాలేజీ లో ప్రొఫసర్ గ చేస్తున్నాడు. వాళ్ళ వైఫ్ పేరు, షాలిని. పాప పేరు ప్రణవి. తను కూడా డిగ్రీ హోల్డర్. ఇప్పుడు ఎం . బి. ఏ. చేస్తోంది వేరే ఊరిలోని యూనివర్సిటీ లో. పాప ని శ్రీధర్ చూసుకుంటున్నాడు. తన చదువు డిస్టర్బ్ అవ్వకూడదని.
ఇలా చాల వివరాలు చెప్పాడు చాట్ లో. సోషల్  మీడియా మాకు ఆలా ఉపయోగ పడుతుందని నేను అనుకోలేదు. మళ్ళి మమ్మల్ని కలిపింది ఈ సోషల్ మీడియా నే కదా. అంతే కదా ఏ విద్య ఐనా, మనం మంచికి వాడితే మంచిది, చెడుకి వాడితే, చెడు జరుగుతుంది. ఎలా ఉపయోగించుకుంటే, అలాగే ఉపయోగం కదా. నేటి తరానికి ఇది చెప్పాలిసిన నిజం.

సురేఖ అన్న పిలుపుకి ఈ లోకం లోకి వచ్చాను. ఏంటి ఇంకా పడుకోలేదు అన్నాడు సురేష్. హ సురేష్, రేపు నేను కాలేజీ కి త్వరగా వెళ్ళాలి. అందుకే రేపు మార్నింగ్ కి అన్ని రెడీ చేస్తున్నాను. సెమిస్టరు ఎగ్జామ్స్ దగ్గరకి వస్తున్నాయి కదా స్పెషల్ క్లాసెస్ ఉంటాయి అని చెప్పాను స్టూడెంట్స్ కి. రేపు సాయంత్రం కూడా క్లాసు లు తీసుకోవాలి వాళ్లకి. సో, వచ్చేసరికి లేట్ అవుతుంది. నిఖిల్ ని నువ్వే చూసుకోవాలి, రేపు ఒక్కరోజు అని చెప్పాను . సరే, నేను చూస్తానులే కానీ, నువ్వు ఇప్పుడు ఇంకా పడుకో, ఇప్పటికే చాలా లేట్ ఐయిపోయింది. అన్నాడు.

ఉదయం 7గం.. కిచెన్ లో ఉన్న నన్ను, సురేఖ మీ ఫ్రెండ్    టీ. వీ లో వస్తున్నాడు అని పిలిచాడు. అప్పటికే నిఖిల్ ని రెడీ చేసేసాడు సురేష్. వెళ్లి టీ.వీ లో చూస్తే, శ్రీధర్  ఉత్తమ ప్రొఫసర్ ఆఫ్ ది ఇయర్  అవార్డు అందుకుంటున్నాడు. హ మొన్న చెప్పాడు అవార్డు వచ్చిందని అన్నాను. నేను తనకి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పాను. ఫోన్ పెట్టేసి, టీ. వీ వైపు చూసేసరికి, ఎవరో అమ్మాయి మీద యాసిడ్ పోసిన ప్రేమికుడు అన్న న్యూస్. ఒక్కసారిగ మనసు ఎదో లాగా అయి పోయింది.
ప్రేమ సక్సెస్ అంటే, కేవలం పెళ్లి చేసుకోవటమేనా? లేకపోతే ఇద్దరి జీవితాలు నాశనం చేసుకోవటమేనా?

లవ్ ఫెయిల్యూర్ అంటూ తను చావటం, లేదా వేరే వాళ్ళని చంపటం ఇదేనా జీవితం అంటే. ఎందుకు అందరు అలాగే ఆలోచిస్తారు?

లైఫ్ లో సక్సెస్ కంటే, ప్రేమ లో సక్సెస్ అంత ముఖ్యమా? ప్రేమ తప్పు కాదు, కానీ ప్రేమ పేరుతో చేసే తప్పులు వలన ఎన్ని ఫామిలీస్ లో విషాదం అల్లుకుందో, మనం చూస్తూనే ఉన్నాం కదా? అది అవసరమా? అనుకుంటూ ఉంటె, శ్రీధర్ గుర్తువచ్చాడు.

చిన్న నవ్వు నా పెదవులపైన.
నాకు కాలేజీ కి టైం అవుతుంటే, బయలుదేరుతున్నాను. నా ఇష్ట దైవం శ్రీ కృష్ణుడు కు దీపారాధన చేసాను. రాధా కృష్ణుల ప్రేమ ని లోకానికి ఆదర్శం గ చెపుతారు. ఎందుకంటే, వాళ్ళ ప్రేమ తగ్గదు, వాళ్ళు ఎప్పటికీ మంచి స్నేహితులే.

ఇలా ఆలోచిస్తుంటే, ఈ మధ్యే చదివిన వాట్స్ అప్ మెసేజ్ ఒకటి  గుర్తుకొచ్చింది.

ఒక రోజు రాధ, కృష్ణుడుని అడిగిందట, నాధా నువ్వు లోకమంతా నిండి ఉంటావట కదా, మరి నేను ఎక్కడ ఉంటాను? అని. రాధా, నువ్వు కూడా ఈ లోకమంతా నాతోనే ఉంటావు , ఒక్క నా తలరాత లో తప్పితే, అంతటా నాతోనే, నా లోనే  ఉంటావు కదా అన్నాడట. అంటే వాళ్ళకి పెళ్లి రాత లేదని అర్ధం. ఇది ఒక అపురూపమైన ప్రేమ కావ్యం, మంచి స్నేహానికి అర్ధం. ఇది ఒక గుడ్ వాట్స్ అప్ మెసేజ్, నా వాట్సప్ డి స్ ప్లే  కుడా.

సరే, సురేష్ నేను వెళ్ళొస్తాను, బై నిఖిల్  అని చెప్పి కాలేజీ కి బయలుదేరాను. గొప్ప ప్రొఫెసర్ గ నా  భవిష్యత్ నా ఎదుట కనపడగా, శ్రీధర్ ని ఆదర్శ్యం గ తీసుకుని, నా స్కూటీ ని ముందుకు నడిపాను, నా కాలేజీ వైపు. వెనక్కి తిరిగి చూస్తే సురేష్  నిఖిల్ ని ఎత్తు కుని, బై చెప్పిస్టున్నాడు. నవ్వుతూ…

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!