గోనె సంచి

(అంశం:హాస్య కథలు)

గోనె సంచి

-తిరుపతి కృష్ణ వేణి

నమస్తే   రాఘవరావు  గారు  ఎలాఉన్నారు?      హా!హా!  నమస్తే    రంగారావు    గారు  మీరెలా   వున్నారు?     అంతా   కులాసయేనా?     హ!  అంతా  బాగేనండీ!     ఏమిటీ?   హడావుడిగా వున్నారు.   దేనికోసమో?   ఆదివారము   సంత అంతా కలియతిరుగుతూ     వెతుకుతున్నట్టు వున్నారు.అంటూ  పలకరించారు.  చాలాసేపటి నుండి    రాఘవరావు గారిని   గమనిస్తున్న రంగారావు గారు!అవునండీ!    మావాడికి   అమ్మాయిని చూడటానికి   వెళదాము,అనుకుంటున్నాము అండి!అన్నారు,  రాఘవరావు.        మీవాడికి   పెళ్ళి చూపులు అయితే  ఏ   బట్టల షాప్ లోనో !   లేదా   నగలషాపు   లోనో!    షాపింగ్   చెయ్యాలికాని, ఇలా,    సంతలో తిరుగటం  ఏమిటండీ?అని నవ్వుతూ అన్నారు  రంగారావు.
రాఘవరావు , రంగారావు   గార్లు మంచి స్నేహితులు,     ఇలా ప్రతీ  ఆదివారంనాడు     సంతలోకలుసుకొని ఒకరి   నొకరు క్షేమసమాచారాలు     తెలుసుకొని వారికి   కావలసిన  సరుకులు   తీసుకొని    వెళుతూ   వుంటారు.ఈ   రోజు   ఆయన   తను   వచ్చినట్లు  కూడా,   గమనించకుండా  దేని గురించో!     అంతలా   వెతుకుతున్నారు?  అదేమిటో?    అడిగి   తెలుసుకుంటే పోలా?   అనుకొని  సార్ !       ముందు    మీకు    కావలసిన   వస్తువు     ఏమిటో!   చెప్పండి    సార్!    నేను   కూడా    వెతుకు తానుగా    అని   నవ్వుతూ  అన్నారు   రంగారావు     ఏమి  లేదు  సార్?   ఎండా కాలం     కదా!     ఎండలు కాస్త     ఎక్కువ  గానే వున్నాయి?బస్  ప్రయాణంలో  చల్లటి   మంచి   నీళ్ళు   కావాలి   దానికి   గోనె  సంచితో   తయారు చేసిన    ఒక నీటి బ్యాగ్  కోసం వెతుకు   తున్నాను  సార్!  అన్నాడు,   రాఘవరావు.అందుకు   పక్కుమని   నవ్విన   రంగారావు    బలేవారండీ!    మీరు  ఒక   బాటిల్  బ్యాగ్ లో  పెట్టుకొని   వెళ్ళే దానికి   ఇలా   సంతంతా   తిరగడం    అవసరమా!    చెప్పండీ?   అని  నవ్వుతూ,  అన్నాడు   రంగారావు.
అది  కాదండీ!    వెళ్ళేది   దూరా భారం ప్రయాణం,   నీళ్ళు   చల్లగా   వుండాలి   కదా!    బాటిల్ లో   నీళ్ళు   వేడిగా   అయిపోతాయి.     బ్యాగ్  అయితే     బస్   వెళుతుంటే    వచ్చే   చల్ల గాలికి    నీళ్ళు   కూడా   చల్లగా వుంటాయి.      అందుకే   ఈ రోజు   ఎలాగైనా   ఆ  బ్యాగ్ ను   కనిపెట్టి   కొనాలి!  అది   సంతలోనే    దొరుకుతుంది.ఇంతకీ   అమ్మాయిని   చూడటానికి  ఏ   ఊరు   వెళ్తున్నారు   సార్?   అని   అడిగారు   రంగారావు.        పాలకొల్లు అండి!     ఓహో! అలాగా !          సార్  దాహం   వేసినప్పుడు   ఒక   వాటర్   బాటిల్    కొనుక్కుంటే     సరిపోయేదానికి     ఈ  రిస్కంతా       అవసరమా?  సార్ !    అన్నారు  రంగారావు        ఎందుకు  సార్    డబ్బులు   దండగ    బాటిల్   కొని   తాగి   పడేస్తాం     ఈ  బ్యాగ్   అయితే   ఒక్కసారి   కొంటే  మనం   ఎక్కడికి  వెళ్ళినా,   పని చేస్తూనే   ఉంటుంది.    అన్నారు   రాఘవరావు.      అయన   తెలివి   తేటలుకి  ముసి ముసి గా    నవ్వుతూ   ఇక   చేసేదీ   ఏమీ   లేదని    ఆయనతో  పాటు    తిరిగి   ఎలా  అయితేనేం    మొత్తానికి  ఆ  బ్యాగ్ ని   కొనగలిగారు.బ్యాగ్   కొన్న   తర్వాత   రాఘవ రావు, మరియూ   రంగారావు  గార్లు   తమకు  కావలిసిన    వెజ్,   నాన్ వెజ్    ఐటమ్స్   కొనుక్కొని ఇంటి   దారి   పట్టారు.    అలా   బ్యాగ్   తీసుకొని   ఇంటికి   వెళ్ళిన   రాఘవరావు    చేతిలో    బ్యాగ్ ను   చూసిన   అతని   భార్య   శకుంతలమ్మ    ఒంటికాలిపై   లేచింది!   ఏమిటయ్యా!   నువ్వు   ఎప్పుడనగా   వెళ్ళావు?  ఎప్పుడొచ్చావు?   ఎప్పుడు   చేసే  వంట  ఇది!  కూరగాయలకు   వెళ్ళిన   వారు   త్వరగా   తీసుకొస్తే   వంట  అయిపోతుంది   కదా!    అబ్బబ్బా   ఆదివారము   వచ్చింది   అంటే    ఇదో   సమస్య   టైమ్ కి   ఓ! తిండీ   తిప్పలు వుండదు.   ఎటు   వెళితే ,అటే,    ఈ   మగవాళ్ళు!  ఇంటి  దగ్గర   ఆడవాళ్లు  ఎదురు   చూస్తారు,   అనే   ఆలోచనే   లేకపోతే   ఎలా?   వంట   త్వరగా   ఎలా   అవుతుందో!   చెప్పండి?    కాస్త  లేట్   అయితే   ఆకలికి   తట్టుకో   లేరు?  అది  మాకే   తంట ! అని   గొణుక్కుంటూ   వంటలో   నిమగ్నమైంది   శకుంతలమ్మ .            హె!హే   ఏమిటే   నీ   గొనుగుడు   నోరుమూసుకో!    అంటూ   కసిరాడు   రాఘవరావు. స్వతహాగా   రాఘవరావు   చాలా  మంచి   మనిషి    ఇంటికి   ఎవరైనా   వచ్చారంటే   వారికి     భోజనం   పెట్టకుండా   పంపించే  ప్రసక్తే   లేదు.    ఏ   టైమ్  లో  వచ్చినా   సరే!  వారు   ఎదో  ఒకటి   తినాల్సిందే!    అప్పటి కప్పుడు   శకుంతలమ్మ   వండాల్సిందే!    అందర్నీ   చాలా   బాగా   చూస్తారు.   కానీ   భార్యని   మాత్రం చాలా    హడావుడి   చేస్తాడు!   ఆమె   ఏ   పరిస్థితిలో   వుంది   చెయ్యగలుగు   తుందా!   లేదా!   ఇదంతా   ఆయనకు  పట్టదు! వచ్చిన   వారిని   మనం   బాగా   చుసామా!   లేదా!    ఇంత   వరకే   ఆయనకు   తెలిసిన   విషయం,  వంటకు  ఎంత   టైమ్   పడుతుంది!   ఎంత   పని  చేస్తే   ఆ  వంట  రుచి  కరంగా   తయారు   అవుతుంది!    అందులో  భార్య   శ్రమ   ఎంత   వుంది! అనే   విషయం   ఆయనకు  అర్థం  కానీ  విషయం.   ఏమోయ్!     ఇంకా   వంట  కాలేదా!    ఎప్పుడనగా    తెచ్చి   ఇచ్చాను?     ఇంకా   అవకపోవటం   ఏమిటీ?   ఏమ్   చేస్తున్నావు?   ఇంత   సేపు,     అని   భార్యని    హడావుడి   చేసి  గద్ధించటం   తప్ప,  మరొకటి   లేదు.ఈ  రోజు   సండే   స్పెషల్  ఎదైనా   చేసుకొని   టైమ్ కు  తిందాము,  అంటే    వుదయం  అనగా పోయి, ఇప్పుడు   వచ్చారాయే!   ఎప్పుడు   అయ్యేదో!   ఏమో!    వస్తూ, వస్తూ   ఆ   గోనె  సంచి   ఒకటి!  రాను రానూ  మరీ   చాదస్తం   ఎక్కువ   అవుతుంది, ఈయనకి!
ఆ  సంచితో  పెళ్ళి   చూపులకు   వెళితే   అందరూ   నవ్వి   పోతారు.  చెపితే   వినరాయే!    ఏమ్  మనిషో!    ఏమో !     ఎదైనా   అంటే   చదువు   సంధ్య   లేని   దానివి   నీకేం   తెలియదు?  నోరుమూసుకో!    అంటారు.   కానీ   నాకు   తెలిసినంత   మాత్రం   కూడా   ఆయనకు   తెలియకుండా   పాయే!    అని    బయటకు  చెప్పే  ధైర్యం   లేక    మనసులోనే  నొచ్చుకుంది   శకుంతలమ్మ.రేపే   ప్రయాణం   అన్నీ  ఈ   రోజే  సర్దుకోవాలి.   ఉదయమే బయలు  దేరితే    మళ్ళీ   త్వరగా   తిరిగి   రావటానికి   వీలుగా ఉంటుంది.    దేవుడి  దయ వల్ల   ఈ   సంబంధం   కుదిరితే   కొడుక్కి   రెండు , మూడు   నెలల్లో   పెళ్ళి   చెయ్యాలని   శకుంతలమ్మ ఆరాటం   మంచి  సంబంధం!అమ్మాయి ఉద్యోగం  చేస్తుంది.  అంత   కన్నా  ఏమ్  కావాలి!   అని  పలు రకాలుగా      ఆలోచిస్తూ   తెల్లవారు   జామునే   ప్రయాణానికి   అన్నీ   సిద్ధం  చేసుకో   సాగింది.   ఇంతలో   భోజనం   ముగించి   విశ్రాంతి   తీసుకుంటున్న   రాఘవరావు   ఏమొయ్!   ఏమి   చేస్తున్నావ్   అన్నీ!  ఇప్పుడే  సర్ధి  పెట్టుకో ! మళ్లీ   ఉదయాన్నే   హడావుడి  అవుతుంది.?     అంతా   సవ్యంగా   వుంటే  అవసరం   అయితే
పూలుపండ్లు, కూడా   పెట్టుకొని   వద్దాము.       ముందుగా   ఆ   వాటర్   బ్యాగ్ లో    నీళ్ళు నింపి   వుంచు   ఉదయానికి     చల్లగా బడి ఉంటాయి   అని   భార్యకు    గుర్తు   చేశారు.    ఈయన    ఆ  బ్యాగ్  ని   వదిలేట్లు   లేరు!  రేపు  ఆ  బ్యాగ్  చూసి   ఎంత  మంది    నవ్వుతారో!   ఏమో!  అదొక    మోతబరువు    కూడా    చెపితే    వినరు    అనుకొని   హా ! అలాగే   నండీ!   అంది    చేసేది   ఏమి  లేక!    అనుకున్న   టైమ్  కు   అందరూ    బయలు   దేరారు.    ఎవరి    సీట్ల లో   వారు    కూర్చున్నారు.    రాఘవరావు  మాత్రం    తన    వాటర్   బ్యాగ్   ని   చాలా   జాగ్రత్త గా   బస్   కిటికీని   కొంచం    తెరిసి   బ్యాగ్   బయటకు    వేలాడేట్లు  ఉంచి,   అది    బరువుకి    ఎక్కడ    కింద    పడిపోతుందో!    అని   దానిని    చూసుకోవటం   తోనే   సరి   పోయింది   ఆయనకు.
ఒక   హోటల్   ముందు    బస్   ఆగింది.   అప్పుడు   ఆయన   అందులో    నీళ్ళు   తాగుదాము   అనుకొని   తనతో   వున్న  అందరిని    అడిగారు!    ఎవరైనా    మంచి నీళ్ళు   తాగుతారా!    అని,   తను    చేసిన    పనికి    ఎంతో   గర్వ పడుతూ   ఒకరిద్దరు   పిల్లలు   వున్న   వాళ్ళు   కాసిన్ని   ఇవ్వండి,   పిల్లలకి    తాగిద్దాము    అన్నారు.  మరొకరు    మంచి    పని    చేశారు.   పిల్లలు   వున్నప్పుడు   అన్నీ   మనతోనే   ఉండాలి   మంచి    ఆలోచన   కాస్త  మోత   బరువు    అయినా!
ఒక   గ్లాస్   కూడా   పెట్టాల్సింది   మాస్టారు!    అని  ఇంకొకరు,     హా! పెట్టానండి!    ఏమి ఆలోచన    ఏమి  ఆలోచన  అని       తలాఒక రకంగా       పొగిడారు.
శకుంతలమ్మ కి       మాత్రం    వాళ్ళు      పొగుడుతున్నట్లా!   లేక    తిడుతున్నట్లా!      ఏమి అర్ధం  కాలేదు.      ఇంతలో    ఒకామే    పిల్లాడిని   భుజానేసుకొని    రాఘవరావు   గారు    కూర్చున్న   సీట్ దగ్గరకు    వచ్చింది.     ఆయన   ఎంతో   తృప్తిగా    పిల్లాడి దాహం    తీర్చ గలుగు    తున్నాను, అన్న ఆనందంతో,    బయటకు  తగిలించి    ఉంచిన   సంచిని   లోపలకి    లాగుదామని    కిటికీ   గ్లాస్   లాగి   సంచిని    పైకి   లేపే  సరికి    సంచి    తేలికగా    పైకి   లేచింది?     ఆ   బ్యాగ్  లో  ఒక్క  చుక్క    నీరు    కూడా   మిగలలేదు?    అంతే!  ఒక్కసారిగా    ఆయన    ఆనందం    అంతా    నీరు    కారి పోయింది.    ఆయన   శ్రమ    అంతా  వృధా   అయిపోయింది.     భార్యతో    సహా  అది  చూసిన    అందరూ   పక్కుమని   నవ్వారు.    నేను   ముందు    నుండి   చెపుతూనే    వున్నాను.    నా    మాట    ఎప్పుడూ   విన్నారు   గనుక     అంది    శకుంతలమ్మ      ఏమి   కాదు    లేవోయ్!     కొత్త   బ్యాగ్   కదా!    అలాగే    పీల్చు   కుంటుంది.      ఇప్పుడు    కరక్ట్ గా    సెట్   అవుతుంది.ఎక్కడైనా   బస్   ఆగి    నప్పుడు   మళ్ళీ   దాని    నిండా   వాటర్    పొద్దాము .  అన్నాడు   రాఘవరావు.వాటర్   వద్దు?   ఏమి వద్దు?    దానిని    ఎక్కడైనా పడవేయండి ఆ మాయదారి సంచిని అంది   శకుంతలమ్మ .        అందుకు   రాఘవరావు   ససేమిరా అని,   మరలా   దానిలో   వాటర్    పోయించుకొని   వచ్చాడు .   అలా బస్ లో   ప్రయాణం   సాగుతూనే   వుంది .   భోజనం   టైమ్   అవుతుంది   రాఘవరావు   ఆకలి కి   కూడా   తట్టుకోలేరు!      ఒక  దగ్గర  బస్   ఆగితే   అక్కడికి   జామ కాయల   బండి   వచ్చింది,   జామకాయల్లో  దిట్టంగా    వుప్పు   కారం   పెట్టించి   తిన్నారు .   ఆ   తరువాత  చల్లని   మంచి   నీళ్ళు   తాగాలని    మరలా   వాటర్    బ్యాగ్     తీసారు.  అంటే   బ్యాగ్   అంతా   ఖాళీ    ఇంతలో   ఎవరిదో   ఫోన్   రింగ్   అవుతుంది.    దాని   రింగ్  టోన్   ఓరి   దేవుడో !   ఇదేమి   గోలరో!  అని   వస్తుంటే   తల దించుకొని   నేల చూపులు  చూస్తూ   కూర్చున్నాడు రాఘవ రావు.తరువాత   అందరి  వైపు   ఓ   చూపు   చూసారు.    అందరూ  తనవైపే   చూస్తూ   నవ్వుకోవడం   గమనించిన   రాఘవరావు కి   ఆ  వాటర్   బ్యాగ్   మీద   విపరీతమైన   కోపం వచ్చింది.  ఒక  చాకు   తో  ముక్కలు, ముక్కలుగా,   కోసెయ్యాలి అనుకున్నాడు.    ఎలాగైనా   సరే ! నన్ను   నవ్వుల   పాలు   చేసిన   ఈ   గోనె   సంచినీ    వదిలించు కోవాలి అనుకున్నాడు.    వాళ్ళు  దిగాలిసిన   స్టేషన్ లో    బస్సు ఆగింది.    హడావుడిగా   బస్   దిగి   దానిని   ఎక్కడ   వదిలేయాలా?   అని  ఆలోచనలో  పడ్డారు, రాఘవరావు!   అంతే   గబగబా   నడుచుకుంటూ ప్రక్కనే ఉన్న హోటల్ లో కి   వెళ్ళారు.   అందరూ భోజనం   చేసారు.   భోజనం  చేస్తున్నంత   సేపు   గోనె సంచినీ   ఎక్కడ   వదిలి  వేయాలా!   అనే  ఆలోచనే!  అప్పటికే   తడిసి, తడిసి   దాని   అవతారమే   మారి పోయింది.   చూడటానికి   చాలా   అసహ్యంగా   కూడా  వుంది .   ఎంతో   ఇష్టంగా   కొనుక్కున్న   దానిని   పట్టుకోవాలంటేనే   చిరాకేస్తుంది.
మెల్లగా  హోటల్  నుండి   బయటకు   వచ్చిన   రాఘవ రావు  ఆ హోటల్   గేటుకి   దానిని   ఒరిగించి  హమ్మయ్య    అనుకుంటూ  చిన్నగా   బయటకు   నడుచుకుంటూ   వెళ్ళిపోయారు .    అలా   వెళ్లిన   ఆయన  పెళ్ళి  వారి  ఇంటికి   వెళ్ళటానికి   ఆటో  మాట్లాడు తుండగా   వెనక నుండి   ఎవరో   సార్, సార్  అని పిలుస్తున్నట్లు వినిపించింది.    మనల్ని   ఎవరు   పిలుస్తారు?  ఇక్కడ   అనుకొని   ఆటో   ఎక్కిన   రాఘవరావు కి మీరు   గోనె సంచి   మర్చి పోయారు  సార్!  అని  చేతికి   అందించాడు   హోటల్  బోయ్!    ఇంతలో,  ఆటోలో  సాంగ్   మొదలైంది   నన్ను   వదిలి  నీవు   పోలేవులే!   అది నిజము లే ! అని   వినిపిస్తుంటే  రాఘవరావు  గారిని   చూసి  అందరూ,మరొక్కసారి  గొల్లున నవ్వారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!