మొక్కలు నాటు సంరక్షించు

ప్రక్రియ :: సున్నితం తెలుగు
అంశం:: మొక్కలు నాటు సంరక్షించు

రచయిత :: లింగన్న గారి గంగాధర్
ఊరు::మేళాపురం-హిందూపురం

పచ్చదనం పుడమికి పురోగతి
పచ్చని తరువులతో సుగతి
చెట్లు లేకపోతే అధోగతి
చూడచక్కని తెలుగు సున్నితంబు

చెట్లను పెంచడం బాధ్యత
బాధ్యత మరిచిన వ్యథలే..
భావితరాలకు వచ్చును వ్యాధులు
చూడచక్కని తెలుగు సున్నితంబు

మొక్కల్ని నాటిన ఇచ్చును
ప్రాణవాయువు అదే జీవితము
జీవులకు నిలయము పచ్చదనము
చూడచక్కని తెలుగు సున్నితంబు

బిడ్డల మాదిరి పెంచాలి
భూవి ఒక కుటుంబమే కదా
పెరిగిన బిడ్డలు భవిష్యత్తు..
చూడచక్కని తెలుగు సున్నితంబు

మొక్కుబడిగా మొక్కల్ని నాటవొద్దు
తరువులే ప్రాణమని మరువవొద్దు
మనిషికి మాను హితుడనుకో…
చూడచక్కని తెలుగు సున్నితంబు

You May Also Like

One thought on “మొక్కలు నాటు సంరక్షించు

  1. లింగన్న గారి గంగాధరప్ప (లింగన్న గారి గంగాధర్) says:

    సాహితీ మూర్తి శ్రీమతి నెల్లుట్ల సునీత మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!