చిరు జల్లు
-ఐశ్వర్య రెడ్డి గంట
పుడమిని తాకే తొలకరి చినుకు
అందాల వెల్లువై
చినుకు చినుకు దార
పన్నీటి జల్లులై
పుడమిని అలంకరించే వేల
నల్ల మబ్బుల మేలిముసుగులో
చల్లగాలి కేరింతలు
మెరుపుల వెలుగులతో
ఉరుముల శబ్దము తో
పుడమిని నిండా తడిపిపో
నీ జడిలో ప్రకృతికాంత పరవశించి
మనసు మయూరమై నాట్యం చేస్తుంటే
రతనాల పంట కు నాంది వై
పుడమి వాకిట జారిపో
వాగులై వంకలై
మురిసిపో పచ్చని పైరుల
మకరందానివై
రైతన్న ఆశల సౌదానివై…
***
☁☁💦💦👌👌
Nice 👌👌👌👌👌👌👌👌👌
Nice chala bagundi