Dr. సంధ్య

Dr. సంధ్య

రచన::ఎన్. ధనలక్ష్మి

” హే హుర్రే నేను కోరుకున్న హాస్పిటల్లో డాక్టర్ గా ప్రాక్టీస్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు.రేపు ఉదయం నన్ను వచ్చి జాయిన్ అవ్వమన్నారు”
” హల్లో సంధ్య ! మేఘాలలో తెలిపోవడం తగ్గించి
కాస్త భూమి మీద నిలపడడం నేర్చుకో”
” పో బావ !నువ్వు ఎప్పుడు ఇంతే ..నేను హ్యాపీగా ఉంటే నీకు నచ్చదు అని బుంగమూతి పెట్టుకుని తన రూంకి వెళ్లిపోతుంది”
” రేయ్ రవి !ఎందుకు రా తనని ఎప్పుడు చూసినా అట పటిస్తు ఉంటావు. తన కల నెరవేరుతుంది అని సంతోషంగా ఉంటే నువ్వు ఏంట్రా అలా బాధ పెట్టావు తనని ”
” అత్తయ్యా నేను సరదాగ అన్నాను..తనకి కూడా తెలుసు .. ఉరికే మీ ముందర నన్ను ఇరికించలి అని ఇలా అలిగి వెళ్ళింది.నాతో పాటు రండి కావాలంటే చూడండి లోపల చాక్లేట్ తింటు డాన్స్ చేస్తూ ఉంటుంది  ”
” నిజంగానే తన రూంలో చాక్లేట్ తింటు డాన్స్ చేస్తూ ఉంటుంది. వీళ్లు వచ్చినది కూడా చూడదు”
” నటకిరీటి ఒక క్షణం నేను కూడా నిజం అనుకున్న ఫోన్ రావడంతో  నవ్వుకుంటూ వాళ్ళ అత్తయ్యా వెళ్ళిన వెంటనే రవి తనని వెనక నుండి హగ్ చేసుకొని కంగ్రలేషన్ బుజ్జి..నువ్వు ఇంకా మంచి పొజిషన్ కి వెళ్ళాలి..రేపు ఉదయం నేను నిన్ను డ్రాప్ చేస్తాను ”
” థాంక్స్ బావ..అలాగే నాకు ట్రీట్ కూడా ఇవ్వాలి.మొన్న నువ్వు రివిల్ చేసిన అక్రమ మందుల సరఫరా చేస్తున్న ముఠా న్యూస్ కి
మంచి స్పందన వచ్చింది. నీకు కూడా మంచి న్యూస్ రిపోర్టర్ గా పేరొచ్చింది. నీ ధైర్యం తోఎంతో మంది జీవితాలు బాగుపడేలా చేశావు కదా నాకు అందుకే ట్రీట్ కావాలి”
” రేపు సాయకాలం నీ పని అవ్వగానే అటు నుండే వెళదాము సరే నా”
మరుసటి రోజు హాస్పిటల్ కి వెళ్లి ఎండి కలిసి తన పని చేయడం మొదలు పెట్టింది సంధ్య.
ఒక రోజు లంచ్ చేస్తుంటే Dr.విక్రాంత్ వచ్చి పలకరించారు.నేను ఇక్కడ  గైనకాలజిస్ట్  అంటు చేయి చాపరు
సంధ్య కూడా సీనియర్ డాక్టర్ కదా అన్న ఉదేశ్యంతో
చేయి చాపింది..
Dr.విక్రాంత్ తను చేతిని పట్టుకున్న విధానం చూసి మొదట అనుమానం వచ్చిన తనే తప్పుగా అపార్థం చేసుకుందో ఏమో అని సైలంట్ అయిపోయింది.
ఇంకోరోజు సంధ్య రౌండ్స్ కి  వెళ్ళి వస్తుంటే ఒక నర్సు ఏడుస్తూ Dr.విక్రాంత్ క్యాబిన్ నుండి రావడం గమనించి ఏంటి విషయం అని అడిగింది.
ఆ నర్సు డాక్టర్ తన పట్ల తప్పుగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పింది.
ఈ విషయం మనం వెళ్ళీ ఎండీ గారికి పిర్యాదు చేద్దాము అంటే ఆ నర్సు నేను ఆల్రెడీ  చెప్పాను మామ్ సర్ గారు నమ్మడం లేదు!!!!పోని నేను వేరే చోట ఉద్యోగం చేసుకుందామంటే నా సర్టిఫికెట్స్ ఇక్కడ లాక్ అయిపోయాయి.ఎటు కాకుండా అయిపోయాను..ఈ డాక్టర్ రోజురోజుకీ హద్దు మీరుతున్నారు అని చెప్పి కన్నీరుమున్నీరైంది.తనని ఓదార్చి సాయం చేస్తానని సంధ్య మాట ఇచ్చింది.
ఏమి చేస్తే ఈ డాక్టర్ నిజ స్వరూపం బయటకి తీసుకురాగలను ఆలోచిస్తుంటే  ఒక ప్రెగ్నెంట్  లేడీ ఏడుస్తూ వెళ్ళడం గమనించి తన వెనుకాల వెళ్ళుతుంది .
” ఆ లేడీ ఆ హాస్పిటల్ బ్యాక్ సైడ్ లో ఉన్న బెంచ్ మీద కూర్చొని తన కడుపు పైన చేయి పెట్టుకొని ఏడుస్తూ ఏంట్రా ఈ మనుషులు ఇలా  హీనంగా మారిపోతున్నారు …
డాక్టర్   విక్రాంత్  చెక్ చేస్తాను అన్న వంక తో  చేతులు  ఎక్కడెక్కడో వేస్తున్నాడు.ఈ విషయం మీ నాన్నకు ,మీ నాన్నమ్మకు  చెప్పితే నేనే తప్పుగా చూస్తున్న అంటున్నారు.పైగా ఆ డాక్టర్ మీ నాన్న బెస్ట్ ఫ్రెండ్స్ . నా ఫ్రెండ్ గురించి నాకు తెలీదా అంటూ నా మాటలు తోసిపారేస్తున్నాడు. ఎవరికీ తెలిసిన తేలిక పోయిన ఒక అమ్మాయికి తెలుస్తుంది. తనని ఎవరు  ఏ  ఉద్దేశంతో పట్టుకున్నారు అని .ఈ రోజు వాడు ముద్దు పెట్టపోయాడు . అందుకే  వాడిని కొట్టాను..
వాడు కావాలనే నన్ను మీ నాన్న ముందర నన్ను ఇంకా బాడ్ చేసాడు. నేను నిన్ను వద్దు అనుకుంటున్నాను అని అందుకే వాడి మీద ఆలా అభాండాలు వేస్తున్నాను అని మీ నాన్న నమ్మేసాడు.
మీ నాన్నకు వాడు చదువుకోవడానికి ఏనాడో హెల్ప్ చేసాడు అని మీ నాన్న ఇప్పుడు కూడా వాడికి వేల్యూ ఇస్తున్నాడు.నేను ఏమి చేయాలి.నేను మీ నాన్న నుంచి విడిపోతా.ఇంకా నా వల్ల కాదు వాడి చేష్టలు భరించడం కానీ మీ నాన్నని వదిలి నేను ఉండలేను అని ఏడుస్తూనే కళ్ళు తిరిగి పడిపోతుంది.
సంధ్య వెళ్లి ఆమెకు హెల్ప్ చేసి మీరు ఈ రాంగ్ స్టెప్ తీసుకోకండి నేను ఆ డాక్టర్ నిజ స్వరూపం మీ ఆయనకే కాదు ప్రపంచానికి తెలిసేలా చేస్తా.
రవి కి ఫోన్ చేసి విషయం చెప్పింది. తను ఒక ప్లాన్ చెప్పి వాటిని అన్నిటిని తీసుకొని రామని చెప్పి తను హాస్పిటల్ కి వెళ్ళి బాగాలేదని ఆఫ్ డే లీవ్ తీసుకోంది
రవి అన్ని ఐటమ్స్ తీసుకొని సంధ్య దగ్గరికి వచ్చి దగ్గరలోన్న ఉన్న హోటల్ కి వెళ్లి రెడీ అయి వస్తారు రవి , సంధ్య పల్లెటూరి  భార్యాభర్తలాగా రెడీ అయి వస్తారు.
“సంధ్య ఈ కడుపులో నువ్వు బలే ముద్దగా ఉన్నావు తెలుసా !నిజంగా మన బేబీ నీ కడుపులో ఉంటె నిన్ను మహారాణిలాగా చూసుకుంటాను ..
మన ఇద్దరి పేర్లు కలిసేలాగా పెట్టుకుందాము .. మన ఇల్లంతా పిల్లలతో కళకళలాడి పోవాలి .మనం ఒక చాలా మంది  పిల్లలను కనాలి .నాకు చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు. తరువాత అమ్మ నాన్న అయి పెంచిన అన్న  ,వరుసకు వదిన అయినా అమ్మ లాగా చూసినా  వదినను  కూడా ఒక్కసారిగా  ఆక్సిడెంట్ లో  కోల్పోయాను . వాళ్ళ బాబు చింటూ  ఇంట్లో ఉండడం వల్ల తాను మాకు దక్కాడు. అందుకే మా అమ్మ,నాన్న ను ,అన్న వదినను మనమే  ఈ లోకం లోకి తీసుకొని రావాలి! ఏమంటావు సంధ్య ఏడుస్తూ రవి హాగ్ చేసుకొని తప్పకుండా  మనం తీసుకుకొని వద్దాము బావ
సరే పద ఆ డాక్టర్ అంతు చూద్దాము..
సంధ్య తన మొహం కనపడకుండా ముసుగు వేసుకుంది. సంధ్య మెడలో ఉన్న చైన్ కి
కెమెరాని కనెక్ట్ చేస్తారు
వారిద్దరూ  డాక్టర్ విక్రాంత్ దగ్గరికి వెళ్ళారు.
” డాక్టర్ బాబు మా ఇంటి అవిడికి కడుపులో రెండు రోజులు నుంచి నొప్పి అని విలవిలాడుతోంది.కాస్త చూసి పుణ్యం కట్టుకోండి
విక్రాంత్ సంధ్యను చూసి ఎందుకు ముసుగు వేసుకున్నారు అంటే మా ఊరిలో సంప్రదాయం బాబు తాళి కట్టిన వాడు తప్ప పరాయి పురుషులకు మొహం చూపించకూడదని లోపలకి పద అంటాడు.చెక్ చేసి చెప్పుతాను.
సరే లోపలికి రండి చెక్ చేస్తాను సమీర్ కి సైగ చేసి వెళ్ళుతుంది.
లోపల విక్రాంత్ తనని ఎలా టచ్ చేస్తున్నాడో కావాలనే తనని హద్దు మీరిన మాటలు అనడం
ఇన్ డైరెక్ట్ తనని ఇబ్బంది పెట్టడం ఇవ్వని లైవ్ లో అన్ని ఛానెల్లో కనపడేలాగా చేస్తారు ..
సంధ్యకు కంట్లో నుండి నీళ్లు వస్తున్నాయి రవి కాకా ఇంకొకరు అల పట్టుకోవడం అయిన కూడా తన బాధను భరించింది.
వాడు ఇంకా తన కడుపుని చెక్  అన్న టైం కి ఆ హాస్పిటల్ ఎండీ విక్రాంత్ అన్న పిలుపుతో    బయటకు వస్తాడు
ఏమి చేస్తున్నావు హాస్పిటల్లో అసలు నువ్వు చేసిన నిర్వాకం అంతా ఇపుడు లైవ్ లో వస్తుంది అని తన రూమ్ లో ఉన్న టీవీని ఆన్ చేస్తాడు
నమ్మి టెస్టింగ్ కి వచ్చిన గర్భవతుల పట్ల లైంగికంగా వేధిస్తున్న డాక్టర్. డాక్టర్ రూపంలో ఉన్న కామాంధుడు..
ఇలా రకరకాలుగా  టెలికాస్ట్ చేస్తూ ఉంటారు.ఈ లోపు మీడియా వాళ్ళు , భయపడి చెప్పకుండా దాచిన  కొంతమంది ఆ డాక్టర్ బాధితులు హాస్పిటల్ బయటకు వచ్చి నాన హడావిడి చేస్తుంటారు
సంధ్య కోసం రవి లోపలకి వెళ్ళితే  తాను ఆ డాక్టర్ టచ్ చేసిన ప్రతిచోటా వాటర్ పోసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది
ప్లీజ్ ఏడువకురా నువ్వు చేసింది చాలా మంచి పని
నీ వల్ల ఇంకా ఎవరు ఈ ప్రాబ్లెమ్ లేకుండా ఉంటారు అని హాగ్ చేసుకొని వెన్ను నిమరుతాడు.
సంధ్య చెవిలో నువ్వు ఇంకా ఇలాగే ఏడచావు అనుకో  నేను ఏమి చేస్తాను అంటే  ఎదో చెపుతారు ! చేయమంటావా అంటాడు దెబ్బకి సంధ్య సిగ్గుపడుతూ ఏడుపు ఆపేస్తుంది.
రా ఆ డాక్టర్ పరిస్థితి ఏంటో చూద్దాము రవికి కాల్ రావడంతో మాట్లాడుతూ ఉంటాడు. సంధ్య బయటికి వచ్చి చూస్తుంది
ఇంతకు ముందు సంధ్య దగ్గర బాధ పడ్డ లేడీ ఆమె హస్బెండ్ కూడా విక్రాంత్ ని తిడుతూ ఉంటాడు.ఇంకా కొంత మంది ఆడవాళ్లు అందరు కలిసి కొడుతుంటే సంధ్య ఆపమని చెప్పి చూసావు కదా ఆడవాళ్ళ శక్తి ఏంటో ! నా అనుకుంటే ప్రాణం ఇష్టము.అలాంటి ఆడవాళ్ళ పైన చిన్న చూపు చూపిస్తే కాళికామాత అవతారం ఎత్తి మరి నీ అంతు చూస్తాము గాట్ ఇట్ .
హాస్పిటల్ ఎండీ మీడియా వాళ్లతో మాట్లాడుతూ విక్రాంత్ చేసిన పనికి మేము సిగ్గు పడుతున్నాము తాను మాత్రమే అలాంటి వాడు మిగతా మా డాక్టర్లంతా మంచి వారు .ఇలాంటి తప్పు ఇంకా ఎవరు చేయకుండా విక్రాంత్ డిస్మిస్ చేస్తూ ,తన డాక్టర్ లైసెన్సుని  రద్దు చేసేలాగ మా డాక్టర్ కమీటీ తో మాట్లాడతాను .
విక్రాంత్ దీనికి అంతటికి కారణం సంధ్య అనుకోని తన పక్కనే ఉన్న కత్తిని తీసుకొని  కడుపులో పొడుస్తాడు. ఇంకో సారి పొడుస్తాడు అనగా రవి వచ్చి విక్రాంత్ ని కొట్టి సంధ్య అని గట్టిగ అరుస్తూ పట్టుకుంటారు.సంధ్య సృహతప్పి పడి పోతుంది
విక్రాంత్ ని పోలీస్లు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు..
సంధ్యకు వైద్యం మొదలుపెడతారు. తనకు ఇంకేం ప్రమాదం లేదని చెప్పి,ఇంకో రెండు గంటల్లో సృహ వస్తుందని చెబుతారు డాక్టర్లు .
సంధ్య చూపిన తెగువను ప్రతి ఒక్కరు ప్రశంసిస్తారు..
సంధ్య తన పరిజ్ఞానంతో సేవ చేస్తూ మంచి డాక్టర్ గా అందరి ప్రశంసలు అందుకుంది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!