అమ్మ

అమ్మ

రచన: బుదారపు లావణ్య

నవమాసాలు మోసి
నరనరాలు తెగి పడే
నరకమే భరిస్తూ….
నీ రక్తమే ధారలై
ప్రవహించగా….
ఊపిరంతా బిగబట్టి
ప్రాణమే పోసావు
పసిబిడ్డకు….
పరవశించి పోయావు
ఈ….జన్మకు……

నీ ఒడినే ఉయ్యాలగా చేసి
నీ రక్తాన్ని పాలుగా మలిచి
నీ పొత్తిళ్ల నే మెత్తటి
పానుపు చేసి
నీ గుండె చప్పుడు
జోలపాటగా వినిపించి
నీ వెచ్చని ఒడిలో
ప్రపంచాన్ని చూపి
నీ అనురాగాన్ని
గోరుముద్దలుగా పెట్టి
నీ ఆలింగనం తో
నాలోధైర్యాన్ని నింపి
నీ ప్రాణాన్ని పణంగా పెట్టి
నా ప్రాణానికి ప్రాణమై
నిలిచిన…..అమ్మా….

అనుక్షణం అండగా ఉంటూ
అడుగడుగున
నీడవై రక్షిస్తూ….
అమితమైన ప్రేమ
ఆప్యాయతలను అందిస్తూ….
కంటికి రెప్పలా
కాపాడుతూ
కళ్ళముందు కదిలే
నా దైవమా…..

వేయి జన్మలెత్తినా
నీ రుణం తీర్చుకోలేనిది….
కోట్లు ధారపోసిన
నీ ప్రేమ కొనలేనిది….
జన్మజన్మలకు నాకు
అమ్మగా నిలిచి…..
నీ చల్లని దీవెనలు
ఎల్లవేళలా అందించు
తల్లి.. నీ సేవలో తరించే
భాగ్యాన్ని నాకు అందించు.
********

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!