మేక వన్నె పులులు

మేక వన్నె పులులు

రచన: చింతా రాంబాబు

రాని చిరునవ్వులను
పెదవులపై అద్దుకొని
ఉన్న అవసరాన్ని దాచిపెట్టి
లేని ప్రేమలు కురిపించి
అవకాశం కోసం ఎదురుచూసే
మేక వన్నె పులులన్న
ఈ సమాజం లో…..
స్వచ్చమైన నవ్వులు
కనుమరుగవుతున్నాయి…
న్యాయం చోటును
అన్యాయం ఆక్రమిస్తుంది.
మంచితనం ఆనవాళ్లు చెరిగిపోతున్నాయి
నమ్మకం నడి వీధి లో అమ్మకమైనది..
అసూయ, ద్వేషాలు అందరినీ
ఆలింగనం చేసుకుంటున్నాయి.
పగ, ప్రతీకారాలు వెకిలి నవ్వులు నవ్వుతున్నాయి..
అమాయకపు ప్రజలను చూసి……

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!