పరిఢవిల్లిన తెలంగాణ సంస్కృతి.. పరిమళించిన పాలపిట్టల ప్రకృతి

పరిఢవిల్లిన తెలంగాణ సంస్కృతి
పరిమళించిన పాలపిట్టల ప్రకృతి

సమీక్షకులు : బూర్గు గోపికృష్ణ

కవనాలు:
మోత్కూర్ మండలం పాటిమట్ల గ్రామం. వ్యవసాయమే జీవనాధారం. పల్లె సంస్కృతిని పల్లె తల్లి ఆప్యాయత అనురాగం గుండెల నిండా నింపుకున్న ఆ పాఠశాల బాల కవులు వారు. హిందీ ఉపాధ్యాయలు టి. ఉప్పలయ్య, తెలుగు ఉపాధ్యాయులు బానోజు వీరాచారి గారి మార్గదర్శకత్వంలో విద్యార్థులతో కవితా పఠనం చేయిస్తూ సాహిత్యాభిలాష రేకెత్తించారు. సృజనాత్మకత సామాజిక అంశాలతో విద్యార్థుల్లో సామాజిక స్పృహను తట్టిలేపారు. క్రమశిక్షణతో రాష్ట్ర, జిల్లా స్థాయిలో పాఠశాలకు విద్యార్థులకు మంచి పేరు తీసుకొచ్చారు. ఆదర్శవంతమైన పాటిమట్ల పాఠశాల అందరి ఇంటి పట్ల, పల్లె పట్టు కొమ్మలతో వెల్లివిరిసిన పాఠశాల వాతావరణం బాలకవుల కవిత్వానికి నిలయం.
పాటిమట్ల పాలపిట్ట 2 కవిత సంకలనంతో ప్రకృతి ప్రేమతో 31 కవితలు ఆలోచనాత్మకంగా రూపుదిద్దుకున్న కవిత్వ లక్షణం. పాలపిట్టలు నింగిలో వికసించే తారాలు ప్రకృతిని ఆస్వాదిస్తూ రాసిన కవిత్వం. పచ్చని చెట్లతో ప్రకృతి అందాలతో పరిమళించే ప్రకృతి సోయగాలు పల్లె పరిమళాలు భావకవిత్వంలో ప్రకృతిని ప్రేమించే బాలసుకుమాలు తెలంగాణ గర్వించు పాటిమట్ల కవనాలు బాలసాహితీ స్మృతులు.

“తొలి జల్లు కురిసింది
పుడమి పులకరించింది
పదవోయి రైతన్న
పొలము దున్నంగ
నడవరా తమ్ముడా
పడవ చేయంగా
పదవే చెల్లెమ్మ
గంతు లేయంగా
పుడమితల్లి ఆకుపచ్చ
కోక కట్టుకుంది
ఆకాశం నీలి దుప్పటి
ముసుగేసుకుంది
బావులు చెరువులు
పొంగి పొర్లుతున్నాయి
పక్షులన్నీ నీళ్లలో
ప్రతిబింబాన్ని చూసుకుంటున్నాయి
హరివిల్లు ఆకాశానికి
రంగులద్దింది
పదండి పదండి
ప్రకృతి మాతను
పలకరించివద్దాము”

ఆండ్రనవ్య తన కవితలో తొలి జల్లు కురిసింది అంటూ రైతులు పొలము దున్నాలి, నడువరా తమ్ముడు, పదవే చెల్లెమ్మ గంతులేద్దాం, పుడమితల్లి అంతా ఆకుపచ్చని ఆకాశంలో నీలి దుప్పటి ముసుగేసుకుంది. బావులు చెరువులన్నీ పొంగి పొర్లుతూ పక్షులన్నీ సరికొత్త ప్రతిబింబాన్ని ఆకాశానికి హత్తుకునేలా రంగులద్దింది ప్రకృతి మాతను పలుకరిద్దాం.. అనే రచన శ్రీ శ్రీ రాసినటువంటి హలాలు పట్టి పొలాలు దున్ని అనే కవితకు భిన్నంగా ఉంది మంచి సందేశాత్మకమైన కవిత్వం.

“పల్లెటూల్లో రైతులు
పచ్చని పొలాలు
బండ్ల నీడ్చే పశువులు
మనుషులు నీడ్చే బండ్లు
మండే ఎర్రటి ఎండలు
ఒంటినిండా చెమట చుక్కలు
కానరాని నీటి చుక్కలు
పంటకోసం కష్టాలు
అయినా అవే వారి ఇష్టాలు”

లవకుమార్ తన కవితలో పల్లెటూరుల్లో పచ్చని పొలాలలని బండ్లనీడ్చే పశువులు , మనుషులనూ తీసుకెళ్లే బండ్లు, బాగా మండే ఎర్రటి ఎండల్లో, ఒంటినిండా చెమట చుక్కలతో కాయకష్టం చేస్తున్నారు. పల్లె రైతు కానరాని నీటిబోట్లతో పంటకోసం పడిగాపులు అంటూ రైతు కష్టాలు కన్నీటి వ్యధలను వివరించారు.

“పచ్చని చెట్లు
ఆరోగానికి మెట్లు
చెట్టు పెట్టు
వాతావరణాన్ని రక్షించు
మొక్కను నాటు
చుక్కను రాలిపించు
చుక్కను పట్టు
మొక్కునూ తడుపు
మొక్కు చెట్టు అయితే
భావిత బంగారమే “

టీ.వంశీ తన కవితలో పచ్చని చెట్టు ఆరోగ్యానికి బాటలు వేస్తాయని చెట్టుపట్టు కొమ్మలతో వాతావరణని రక్షిస్తుంది . మొక్కను నాటితే చుక్క నీరు కురుస్తుంది చుక్కను పడితే మొక్కనూ తడుపుతుంది మొక్క పెద్దదయితే చెట్టు ఫలాలు భవిష్యత్తు తరానికి బంగారు మెట్టు పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు అని అద్భుతమైన రచన చేసారు.

“పచ్చని చెట్లను
తణువంతా నింపుకొని
ప్రాణవాయువు అందిస్తుంది
ఎక్కడాలేని సంస్కృతిని
ఇక్కడేగా చూసేది
బతుకునిచ్చే బతుకమ్మ
షడ్రురుచుల ఉగాది
హిందువుల బోనాలు
ముస్లింల పీరీలు
క్రైస్తవుల ప్రార్ధనలు
అందరిని అక్కున
చేర్చుక్కున్న తెలంగాణ
జొన్నరొట్టె రాగిసంకటి
అభిరుచికి మారుపేరు
హైదరాబాద్ బిర్యాని
ఇదే భరతావని హృదయవాణి “

పి.శ్రావణి తన కవితలో తెలంగాణ ఆయువుపట్టు పచ్చని చెట్లను ప్రాణవాయువు ఎక్కడలేని సాంస్కృతిని వివరిస్తూ బతుకునిచ్చే బతుకమ్మ మాగాణి సిరులతో, సంప్రదాయాలకు ప్రతీక షడ్రుచుల ఉగాది పండుగల గొప్పతనాన్ని అందరినీ అక్కున చేర్చుకున్న తెలంగాణ అభిరుచులను చాటిచెప్పిన హైదరాబాద్ బిర్యాని ఇదే హృదయవాణి మంచి రచన అందించారు.

“అంతులేని చెట్టు
అరవై ఆరు కొమ్మలు
కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు
ఆ పువ్వులకు విరబూయును
మా చిన్నారుల చిరునవ్వులు”

వై.రేణుక తన కవితలో పల్లె ప్రకృతి వనంలో అంతులేని చెట్టు 60 కొమ్మలతో వికసిస్తుందని కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు పుస్తుందని.. చిన్నారుల చిరునవ్వులతో ప్రకృతి అంశాలతో కూడిన పల్లె పచ్చదనపు చిరునవ్వులు బాగా వివరించారు.

“ఆకాశం అంటే ఇష్టం
అందుకోవడం కష్టం
నక్షత్రాలు అంటే ఇష్టం
లెక్క పెట్టడం కష్టం
జగతికి మూలం అమ్మ
తొలి ప్రేమకు మొదలు అమ్మ
రాణులకు రాణి అమ్మ
మా ఇంటి మహారాణి అమ్మ”

వై.శ్రీవల్లి తన కవితలో ఆకాశం
అందుకోవడం ఇష్టకష్టలనూ నక్షత్రాలంటే లెక్కపెట్టడం కష్టం, జగతికి మూలం అమ్మ అని అమ్మ ప్రేమను మొదలుకొని రాణులకు రాణి మా ఇంటి మహారాణి అంటూ అమ్మ ప్రేమను పంచిపెట్టారు.

పిల్లలలో మానసిక ఆత్మస్థైర్యాన్ని నింపుతూ విశాల హృదయమైన పల్లెటూరి పచ్చదనాన్ని ప్రకృతిలో చెట్లు ప్రగతికి మెట్లు
పర్యావరణ మార్పులను భౌగోళిక స్థితులను పరిమళించిన ప్రకృతి కవిత్వం
కవితలు సేకరించి నిరంతరం సమిష్టి అధ్యయనంతో పనిచేస్తున్న పాటిమట్ల విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులు టి. ఉప్పలయ్య, వీరాచారి గారికి, ఉపాధ్యాయ బృందానికి ఆర్థిక వనరులను సమకూర్చిన గ్రామ పెద్దలకు అభినందనలు కృతజ్ఞతలు.
జాతీయ ఉత్తమ సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి ప్రముఖ సాహితీవేత్త తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ కార్యదర్శి ఏనుగు నర్సింహారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు డా.పోరెడ్డి రంగయ్య వంటి మహామహుల అభినందనలు ఆశీర్వాదాలు అందుకున్న పాటిమట్ల పాలపిట్టలు రాబోయే రోజుల్లో
మరిన్ని రచనలు సంకలనాలతో రావాలని ఆకాంక్షిస్తున్నాను..

బూర్గు గోపికృష్ణ

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!