అమ్మ అంటే అమృతం 

అమ్మ అంటే అమృతం 

రచయిత :: జాధవ్ ముకుంద్ రావు

అమ్మకు మించిన అపురూపం లేదు
వాస్తవానికి బ్రహ్మ అమ్మను సృష్టించే లేరు
అమ్మే బ్రహ్మను సృష్టించింది చెప్పేది శాస్త్రం
మాతృదేవోభవ అమ్మకి అగ్రతాంబూలం !!

నవమాసాలు అమ్మ గర్భాలయంలో ఉంచుతూ
ఎన్నో నొప్పులకు భరిస్తూ పిండాన్ని పోషిస్తూ
బిడ్డ కోసం ప్రాణం వదిలి మంచి జరగాలని ఆశిస్తూ
జన్మనిచ్చిన అనంతరం క్షణం నవ్వుతూ ప్రేమతో ముద్దు నిస్తూ !!

తీయని జోల పాటలతో మంచి గానం పాడుతూ
నిద్ర రావాలని ఉయ్యాలపై ఎన్నో బొమ్మలను పెడుతు
హృదయముతో నన్ను పట్టుకొని చంద్రుని చూపిస్తూ
ఇవన్నీ ఉజ్వల్ బంగారం భవిష్యత్తుకు ప్రసాదిస్తూ !!

తీర్చుకోలేను అమ్మ ఋణం అమ్మకే నా వందనం
అమ్మ ప్రేమ నా సకల సౌభాగ్యం అదే నా అదృష్టం
ఆరాధిస్తే ప్రత్యక్ష కనిపించే దైవుడు అమ్మతనం తప్ప
అమ్మ అమ్మ అమ్మ త్రైలోక్యం లో జగతికి నిజమైన గ్రంథం !!

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!