అమ్మ ప్రేమ

అమ్మ ప్రేమ

రచయిత :: నాగ మయూరి

ఆది గురువు అమ్మ
తొలి దైవం అమ్మ
అమ్మనుడే ఒక బడి
అమ్మఒడే ఒక గుడి

సృష్టికి మూలం అమ్మ
బిడ్డలకు తొలి చెలిమి అమ్మ
సహనానికి మారుపేరు అమ్మ

అమ్మ ప్రేమ అనంత సాగరం
అమ్మచూపే అనురాగం అధికం
అమ్మతో అనుబంధాలు శతకం
అమ్మ ప్రేమే అద్భుతం

ఆకాశానికి హద్దులు లేవు
అవనిలో అమ్మ ప్రేమకి అవధులు లేవు

అమృతం లాంటి ప్రేమను కురిపిస్తూ
ఆప్యాయత అభిమానాలను చూపిస్తూ
అనునిత్యం పిల్లలకై పరితపిస్తూ

తారతమ్యాలు చూపని
కల్మష మెరుగని
స్వచ్చమైన ప్రేమను పంచును అమ్మ

లోకానలేదు ఆమ్మ ప్రేమకు పోటీ
లేరెవ్వరూ అమ్మకు సాటి

అమ్మ లేనిదే మన జన్మలేదు
జన్మలేనిదే జగతి లేదు
జగతిలో జననిని మించిన దైవం లేదు
దైవ స్వరూపులైన మాతృమూర్తులు అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు 💐

 

You May Also Like

2 thoughts on “అమ్మ ప్రేమ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!