అమ్మ నీ ప్రేమ

అమ్మ నీ ప్రేమ

రచయిత :: లహరి

అమ్మకి అమ్మనైతే తప్ప
అమ్మ గొప్పతనం నేను ఏమని చెప్పను?
అమ్మ అన్న పిలుపు
ఎంతో అందమైన భావన..
నాన్నతో తిన్న దెబ్బలు గుర్తున్నాయి…
అమ్మ కూడా కొట్టింది ఏమో? కానీ,
అలాంటి ఒక సందర్భం గుర్తు లేదు.
గోరుముద్దలతో
ప్రేమ కలిపిందిగా అన్నీ మరిచిపోయా…..
స్నేహానికి ప్రతిరూపము
అందమైన రూపము
అలసటకు ఆమె దూరము
అలరించే మనసున్న అమృతమూర్తి…
తన ప్రాణం అల్లాడిపోతున్న…
జీవితాంతం తన బిడ్డ బాగుండాలని
తాపత్రయపడేది అమ్మ…
అమ్మ అన్న పిలుపు ఎంత మధురం…
వంటింటికి పరిమితమై
అందరి ఆకలి తీర్చి
ఆనందపడే అల్పసంతోషి అమ్మ…
నా గెలుపులో అమ్మే…
ఓటమిలో వెన్నుదన్నుగా నిలిచేది
అమ్మ ప్రేమే శాశ్వతమైనది….
వెలకట్టలేని బహుమతి మా అమ్మ
నన్ను కంటి పాపగా
అడుగడుగునా ప్రోత్సహిస్తున్న
మా అమ్మకు పాదాభివందనం…..

You May Also Like

34 thoughts on “అమ్మ నీ ప్రేమ

  1. తల్లి ప్రేమ వెలకట్టలేనిది. తను ఎంతగానో కష్టపడుతూ తన బాధల్ని కనిపించకుండా నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది.తన గురించి వర్ణించడానికి నిఘంటువులో వెతికినా పదాలు దొరకవు. అలాంటి అమ్మ గురించి ఇంత చక్కగా కవిత రూపంలో లిఖించిన మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మీరు ఎంచుకున్న రంగంలో మరెంతగానో పైకి ఎదగాలని ఆశిస్తూ….మాతృమూర్తులందరికి పాదాభివందనలు తెలుపుకుంటున్నాను….🙏🙏

  2. చాల బాగా రాసారు లహరి ఒక బిడ్డకు అమ్మ స్పర్శ తగిలితే ఆనందానికి అవధులు ఉండవు

  3. అమ్మలోని కమ్మదనం గురించి అద్భుతంగా రాశారు..!!

  4. అమ్మ ప్రేమ వెలకట్టలేని అమ్మ ఋణాన్ని తీర్చుకోలేనిది…
    అమ్మ ప్రేమ మీ కవితలో కనిపించింది…

  5. పదిమంది లో ఒక్కరు…వందలో ఒక్కరు… కోట్లలో ఒక్కరు…నన్ను నన్నుగా ప్రేమించే ఒక్కరు… మా Mom😘😘😘😘 గురించి ఎంత చెప్పిన తక్కువే…😍😍😍
    Happy Mother’s day ❤️💐❤️💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!