తల్లిప్రేమ

తల్లిప్రేమ(మా అమ్మరజిని)

రచయిత :: పుల్లూరి సాయిప్రియ

అమ్మ.. అమ్మ..అమ్మ..
ఆ పదంలో ఉన్న అనుబంధం, ఆప్యాయత, అనురాగం, ప్రేమ, ఇలా అన్నింటిని కలగలుపుకొని ఉన్న పదం ఈ శ్రుష్టిలో ఏదైన ఉంది అంటే అది ఒక “అమ్మ” మాత్రమే..
తన అనువణువు నుండి తన రక్తాన్ని పిండంగా మార్చి, మాస మాసానికి నీ రూపాన్ని పునఃరిద్దరిస్తూ.. నవమాసాలు మోసి.. ఈ ప్రపంచానికి పరిచయం చేస్తుంది ఆ కన్నతల్లి.
నువు ఒక గొప్ప ప్రయోజకుడుగా మారినప్పుడు అందరి కంటె ముందుగా ఎక్కువగా సంతోషపడేది మన అమ్మ మాత్రమే..
అదే.., నువు ఎంత పెద్ద తప్పు చేసిన, అది ఈ లోకం కూడ క్షమించరానిది అయిన సరే..నీ తప్పును పక్కన పెట్టి నిన్ను క్షమించే దయాగుణం ఎవరికైన ఉంది అంటె అది ఒక “కన్నతల్లి” కి మాత్రమే..
అలాంటి కన్నతల్లులను ఇప్పుడు చూసుకోవడానికి.. అందరు ఎంతో భారంగా భావిస్తున్నారే..
మీకు ఒకటి చెప్తాను..
మనల్ని నవమాసాలు మోసి కంటుందే.. ఆ తల్లి. తను కూడ నీలా భారంగా భావిస్తే.. నువ్వు అనేవాడివి ఈ లోకాన్ని చూడగలిగేవా..?, నీకు ఇంత పేరుప్రతిష్టలు ఉండేవా..?
క్షమాగుణం, దయాగుణం కలగలిసిన దైవరూపం..
ఈ శ్రుష్టిలో “తల్లిప్రేమను” మించిన ప్రేమ ఇంకొకటి లేదు మిత్రమా.

🙏మాతృదేవోభవ🙏

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!