సవ్యసాచి

🌺🌺సవ్యసాచి🌺🌺

రచయిత :: జయసుధ కోసూరి

అమ్మ ప్రేమ
అక్షయ పాత్రలా.. ఎంత పంచినా..
ఇంకా మిగులుతూ.. !
అమ్మే ఓర్పుకు మారు పేరైతే..
అక్క చిరునామానే .. !

వేకువంటిన వెలుగును వంటింట్లో వెలిగించి..
పారవశ్యపు పరమాన్నాన్ని పదుగురికీ పంచేది.. !!

అమ్మ ఇంటనున్న పడమటిల్లు ఆహారపదార్థాలకు నెలవు.. !

అమ్మ చేతి షర్బత్
ఎప్పటికి మరువలేని ఓ రుచి.. !

ఎంత నెమ్మదితనం. !
ఎంతటి సామర్ధ్యం.. !

నిత్యాగ్నిహోత్రంలా నిత్యం వెలుగుతుండే పొయ్యి..
వచ్చేపోయే బంధుజనం..
ఇల్లంతా సందడి.. !
సవ్యసాచిని తలపించే నేర్పు.. !
ఒక్క అమ్మకే సొంతం.. !!

కాలం కాటువేసి తాతకు పక్షవాతమొస్తే..
పన్నెండేళ్ళు మామగార్ని పసిపిల్లాడిలా చూసిన తీరు అద్భుతం.. !!

అంతటి ప్రేమైక మూర్తి.. !
సహనశీలి అమ్మ.. !
చదువులేని సరస్వతి.

తన కథలతో
రాలిపోతున్న రాతిరికి
రంగులద్దేది.
ఒడ్డెరుగని ఓపికున్న
జీవనది అమ్మ..!

అమ్మ ధైర్యం నాన్న ..
ఆ ధైర్యం పోయాక..
దైన్యంగా బతుకీడుస్తున్న అమ్మ..
నాకెప్పటికీ గుర్తే.. !!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!