అమ్మ ఓర్పు

అమ్మ ఓర్పు

రచయిత :: పి. వి. యన్. కృష్ణవేణి

రూపాయి నాణెమంత పరిమాణం
ఆ కుంకుమే ఆమెకు అలంకారం
మోముపై చెరుగని ఆ చిరునవ్వు
ప్రశాంతత ఆమెకు ఓ వరం.

మనసులో లేని కఠినత్వం
మన ముందే ప్రదర్శించే డాంభికం
మది లోపల అంతా మంచితనం
తన హృదయమే ఓ ప్రేమాలయం

తాను నడవలేని స్థితిలోనూ
మన కోసం రుచిగా వండుతుంది
కనులు నిద్ర లేమితో ఎరుపెక్కినా
మన కడుపు ఆకలి ఘోష ఆమేదే

పది మంది పిల్లలకు ఒక అమ్మ
ఆనందాన్ని, విజ్ఞానాన్ని కమ్మనైన
లోటు లేని జీవితాన్ని అందిస్తుంది
మనం ఆమె ముచ్చటైన బొమ్మలం.

ముసలితనం ముంగిట్లో ఉండగా
పిల్లలం పది మందిమి దండగ
సముద్రమంత ఆమె ఓర్పు ముందు
మన అనుభవం ఒక పిల్లకాలవేగా

చిన్నచూపు చూడకు అమ్మను
అందిచింది నీకు బువ్వను కమ్మగ
నడిపించింది నిన్ను తన గుండెలపై
ఆమె పై ఎల్లప్పుడూ ప్రేమఝల్లు కురిపించు.

You May Also Like

2 thoughts on “అమ్మ ఓర్పు

  1. 👌👌👌👏👏👏👌👌👌 అమ్మ ఎప్పుడూ అమ్మే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!