చేపల పులుసు

🐟 చేపల పులుసు 🐟

 

హాయ్ నేను మీ దీపు….

ఈరోజు  పాతకాలం నాటి చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం!!

ముందుగా కావలసిన పదార్థాలు :

చేపలు ముక్కలు :: అరకిలో
కారం
పసుపు
సాల్ట్
ఉల్లిపాయలు
పచ్చి మిర్చి
కారేవేపాకు
కొత్తిమీర
అల్లం, వెల్లుల్లి పేస్ట్
మెంతి పొడి
ధనియాలు పొడి
జీలకర్ర పొడి
ఆయిల్
నిమ్మ చెక్క
చింతపండు

తయారు చేసే విధానం ::

  • ముందుగా చేపముక్కలను పొలుసు లేకుండా  రెండు మూడు సార్లు కడగాలి ఆఖరి సారి కడిగేటప్పుడు కొద్దిగా సాల్ట్, నిమ్మరసం వేసి కడగాలి.
  • తరువాత చేప ముక్కలని ఒక గిన్నెలో తీసుకోని పావు టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ కారం, టీ స్పూన్ సాల్ట్ వేసి కలిపి ముక్కలకి పట్టించి 20 నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు తీసుకుని కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి.
  • నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని నీళ్లు పోసి నాన పెట్టుకోవాలి.
  • చేపలు పులుసు వండుకోవడానికి ఎప్పుడు వెడల్పుగా కొంచెం దళసరిగా ఉన్న గిన్నె తీసుకోవాలి.
  • స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని నూనె వేసుకొని కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, నాలుగు పచ్చి మిర్చి వేసుకొని వేపుకోవాలి వేగాక గ్రైండ్ చేసుకున్న ఉల్లి ముక్కలు వేసి దోరగా వేపాలి
  • అవి వేగాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపాలి, తర్వాత మూడు టీ స్పూన్ ల కారం, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి కలపాలి. ఇప్పుడు రెండు టీస్పూన్లు  ధనియాల పొడి, టీ స్పూన్ జీలకర్ర పొడి, టీ స్పూన్ మెంతి పొడి వేసి రెండు నిమిషాలు నూనె పైకి తేలే వరకు వేపుకోవాలి.
  • వేగిన తరువాత చేప ముక్కలు వేసి, చింతపండు పులుసు వేసుకోవాలి
    పులుసు తో సహా గ్లాసున్నర నీళ్లు ముక్కలలో పోయాలి.
  • ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ మంట తగ్గించి  పెట్టుకొని 15 నుండి 20నిముషాలు ఉడికించాలి.
  • అంతే ఎంతో సింపుల్ గా చేసుకునే చేపల పులుసు రెడీ.చేపల పులుసు ఎప్పుడూ చల్లారిన తర్వాత తింటేనే చాలా రుచిగా ఉంటుంది.
  • ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ రుచిని అసలు వదిలిపెట్టరు.
  • మరి ఇంక ఆలస్యం ఎందుకు మీరు తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు…

మీ
“దీపు” వీర

You May Also Like

6 thoughts on “చేపల పులుసు

  1. నాకు చేపల పులుసు అంటే ఇష్టం ఉండదు.. మీరు చెప్పిన విధానం వల్ల తినాలి అనిపిస్తోంది. ట్ర్య్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేస్తాను.థాంక్యూ దీపు గారు🙏🙏🙏

  2. చాలా బాగుంది చదువుతుంటే..ట్ర్య్ చేసాక ఎలా ఉందో msg చేస్తాను దీపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!