అమ్మ ప్రేమ అమృతం

అమ్మ ప్రేమ అమృతం(మా అమ్మ లత )

రచయిత :: శ్రీలక్ష్మి.బి

అమ్మ అంటే ప్రేమ
అమ్మ అంటే నమ్మకం
అమ్మ లేనిదే ప్రపంచం లేదు.

అమ్మ, తన బిడ్డకు ఆకలి తెలీకుండా పెంచుతుంది,
కష్టం అనే పరిస్థితిని చూపకుండా పెంచుతుంది,
ఎలాంటి అవమానం ఎదురైనా సరే 
తన కుటుంబాన్ని సంరక్షిస్తుంది,
అమ్మ అంటే ప్రేమ, నమ్మకం. 
అమ్మ లేనిదే ప్రపంచం లేదు.

అమ్మ, మంచి మాటలు నేర్పి 
తన పిల్లలను మనిషిగా మారుస్తుంది,
జీవితంలో ఓటమిని ఎదుర్కునే ధైర్యాన్నిస్తుంది,
న్యాయంగా అన్యాయాన్ని ఎదుర్కునే శక్తినిస్తుంది,
అమ్మ అంటే ప్రేమ, నమ్మకం. 
అమ్మ లేనిదే ప్రపంచం లేదు.
 
అన్ని బంధాలను అనుసరించుకుంటూ, 
అందరికి చిరునవ్వుతో మసలుకుంటూ,
ప్రత్యేక దృష్టి తన పిల్లలు పై నుంచి 
ప్రేమతో పెంచుతుంది,
అమ్మ అంటే ప్రేమ, నమ్మకం. 
అమ్మ లేనిదే ప్రపంచం లేదు.

చేసిన పనినే రోజు విసుకు లేకుండా, 
ఎంతో ఉత్సాహముతో తన కుటుంబానికి చేస్తుంది,
తన ఇష్ట ఇష్టాల్ని మరచి పోయి, 
అందరి ఇష్టాలు, కోరికలు నెరవేరుస్తుంది,
ఎవరికీ ఏ భాధ వచ్చినా, 
తన భాధగా అనుకోని పరిరక్షిస్తుంది,
అమ్మ అంటే ప్రేమ, నమ్మకం. 
అమ్మ లేనిదే ప్రపంచం లేదు.

తన పిల్లలు పెరిగి పెద్దవారై ప్రయోజకులైనా,
తన కంటికి మాత్రం ఎల్లప్పుడూ చిన్న పిల్లలే
ఎవరి దగ్గర ఏమి ఆశించకుండా 
తన కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తిస్తుంది
అమ్మ అంటే ప్రేమ, నమ్మకం. 
అమ్మ లేనిదే ప్రపంచం లేదు.

అమ్మ చేతి వంట అమృతం, 
అమ్మ చేతి చివాట్లు అమృతం,
అమ్మ కసరింపు అమృతం,
అమ్మ సహనం అమృతం,
దేవతలు అమృతాన్ని ఉంచుకొని, 
అమ్మను మనకు అమృతంగా ఇచ్చారు ఎందుకంటే,
అమ్మ అంటే ప్రేమ, నమ్మకం. 
అమ్మ లేనిదే ప్రపంచం లేదు.

అమ్మా ! ఏమి చేసి నీ ఋణం తీర్చుకోవాలో తెలీదు
ఎంత చేసిన అది నీ కాలి గోటికి కూడా సరిపోదు
అమ్మా ! వచ్చే జన్మంటూ ఉంటే 
నువ్వు నా కడుపున పుట్టాలని,
నీ ప్రేమ కన్నా ఎక్కువగా 
నీకు ప్రేమను అందివ్వాలని 
దేవుడిని ప్రార్థిస్తున్నాను

ఎంత రాసిన తనివి తీరని “అమ్మ” గురించి 
ఒక్క రోజు సరిపోదు, 
ఎంత రాసిన సరిపోదు, 
ఎలా రాసిన సరిపోదు ,
ఎప్పటిలా నా ఈ తొలి రచనా పయత్నం 
నీతోనే మొదలవుతుంది.. ఎందుకంటే
నా ప్రోత్సాహం అమ్మ.. నా ప్రేరణ అమ్మనే
అమ్మ అంటే ప్రేమ, నమ్మకం. 
అమ్మ లేనిదే ప్రపంచం లేదు..!

 
   

You May Also Like

6 thoughts on “అమ్మ ప్రేమ అమృతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!