బుజ్జీ-అమ్మ
రచయిత:: బుజ్జమ్మ
తెలతెలవారగానే..
తొలి కాంతిరేఖ నా ముంగిట చేరగానే..
నా కంటి ముందు నిలిచే తొలి వర్ణం.. నీ రూపం
నా చెవులకు తొలి సుప్రభాతం.. నీ పిలుపు
నా నుదుటిపై తొలి సంతకం.. నీ ముద్దు
నా మేనికి చల్లని పులకింత.. నీ స్పర్శ
నా శ్వాసకు ఆయువు పోసిన నీవు
నా ప్రతిరోజు మేలుకొలుపు కావాలి
“బుజ్జీ లేమ్మా తెల్లారింది” అంటూ
ప్రతి ఉదయం నీతోనే మొదలవ్వాలి… “అమ్మా..”
Superb 👌👌 Bujjamma
చాలా బాగుంది బుజ్జి👌👌👌👏🏻👏🏻👏🏻💐💐