నా ప్రాణం నీవే అమ్మా

నా ప్రాణం నీవే అమ్మా

రచయిత :: వేముల ప్రేమలత

అమ్మంటే నీకెందుకంత ఇష్టం? అంటే ఏం చెప్పను!

అమ్మ నాతో కలిసి ఆడేది, పాడేది

ఎన్నో కష్టాలకోర్చి నన్ను చదివించింది

ఎంత ప్రేమగా చూసేదో, చదవకపోతే అంత కఠినంగా వ్యవహరించేది

ఎన్ని బాధలు, ఎన్నెన్ని బాధ్యతలు అన్ని ఒక్క చిరునవ్వు తో ఎదుర్కొనేది

పెళ్లి పేరుతో అమ్మను వదలి వచ్చినా,
ప్రతి క్షణం, ప్రతి పనిలో అమ్మ గుర్తొస్తుంది

అమ్మ దగ్గరకు వెళ్ళాలనే తలపు రాగానే
ఏదో కొత్త ఉత్సాహం ఉరకలు వేస్తుంది

ఊరిలోకి అడుగు పెట్టగానే అమ్మ చేయి గాలై నన్ను నిమిరినట్లుంటుంది

ఇంట్లో అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే
అందుకే అమ్మా ! హద్దులు దాటే ఆనందం కలిగినా నీతో పంచుకోవాలని

నీ స్వాంతన కోసం పరుగులు పెడుతాను

భరించలేని బాధ కలిగినా విశ్వమంత విషాదం కమ్మినా

నాకు నీవున్నావనే నిశ్చింత పొందుతాను

ఎంతటి విషాదాన్నయినా, బాధనైనా నీ స్పర్శ తోనే మర్చిపోవాలనుకుంటాను

ఎందుకంటే ఈ దేహము, ఇందులోని ప్రాణమూ
నీ భిక్షే అమ్మా!

ఏమిచ్చినా నీ ఋణం తీర్చుకోలేను అమ్మా!
మరు జన్మకు నీకు అమ్మనయితే తప్ప.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!