మా అమ్మ

మా అమ్మ

రచయిత :: విజయ మలవతు

అమ్మ ప్రేమ
అంతం లేని పుస్తకం….
తనకంటూ ఒక పేజీ లేని
అమాయక జీవి…

పిల్లల కోసం అందాన్ని
ఆనందాన్ని ప్రాణాలను సైతం
త్యాగం చేసే త్యాగమూర్తి..

జగతిలో కొలవడానికి
వీలులేని ప్రేమ
అమ్మ ప్రేమ….

ఇవ్వడమే తప్ప
తీసుకోవడం తెలియని
స్వార్థ మెరుగని
పిచ్చి ప్రేమ బంధం….

ఇంటికి దీపంగా
         దినమొక పండుగగా
                         రవిలా వెలుగులు నింపుతూ….

అనురాగానికి ఆదిగా
ఆత్మీయతకు పరమావధిగా
అణకువ లో ఓర్పుగా
ఆలంబన లో నేర్పుగా
మా ఇంటి దేవత ఇందిర గా వెలసిన మా అమ్మ…

మాతృదినోత్సవ శుభాకాంక్షలు మా💐

You May Also Like

5 thoughts on “మా అమ్మ

  1. చాలా బాగుంది విజయ గారు👌👏🏻👏🏻👏🏻💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!