అద్భుతం… ఆమె
రచయిత :: శ్రీ
(రాజేశ్వరి)
మరణ యాతన
అంచులు చూసిన క్షణాలను
మరిపించే ఆ అమ్మతనం
ఆ చిన్ని చేతుల స్పర్శ
ఓ మధురానుభవం.
నవమాసాల నిరీక్షణ
పసి పాపను చూసిన క్షణాలు
అతిమధురం.
అమ్మ అనే మాట
అత్యద్భుతం ప్రపంచంలోనే
అమ్మలందరికి…
మాతృదినోత్సవ శుభకాంక్షలు
అమ్మ ఎప్పుడూ మధురమే… చాలా బాగుంది శ్రీ గారు👏👏👍🌹