అమ్మ మనసు

అమ్మ మనసు

రచయిత :: సుకుమార్


అవనకేతెంచిన ప్రతి బిడ్డకి
జన్మనిచ్చింది అమ్మ రా
అమ్మంటే ఆది దేవతకి ప్రతిరూపము రా

మరిచినా మరపురాని అమ్మ లాలన
ఎక్కడో ఉన్న చందమామ వస్తాడని
గోరు ముద్దలు పెట్టి లాలించేది అమ్మ రా
తాను పస్తులుండి బిడ్డల పొట్ట నింపేది అమ్మ రా

చంద్రునిలో మచ్చ ఉంటుందేమో కాని
అమ్మలో మచ్చుకైనా
మచ్చ ఉండదురా

నవమాసాలు మోసి తన ప్రాణాన్ని పణంగా పెట్టి
జన్మ నిచ్చేది అమ్మ రా
లాలి పాటలు పాడి లాలించేది అమ్మ రా
జోల పాటలు పాడి జో కొట్టేది అమ్మ రా

సమాజంలో ఎలా నడుచుకోవాలో తెలిపే మార్గదర్శి అమ్మ రా
జగతిలోన అమ్మ ప్రేమకు సాటి లేదురా
జగతిలోన అమ్మతనం ఒక గొప్ప వరము రా

తల్లికి పాదాభి వందనం చేయరా
సర్వ సుఖాలకు అధిపతి నీవురా

మరువకురా మదర్ ని
త్యాగానికి ప్రతిరూపం తల్లి రా
అమ్మ మనసు అపురూపం
అవనిలో అదియే పరమార్ధం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!