అమ్మఅనురాగం

అమ్మఅనురాగం  (మా అమ్మ ఎన్.నాగమ్మ)

రచయిత ::ఎన్.ధన లక్ష్మి

అనురాగం, ఆప్యాయత, మమకారం కలగలిపిన రూపం ఏదైనా ఉంది ఈ జగతిలో ఉంది అంటే
అది ఆమ్మ…
నేనే పలికే మొదటి ,ఆఖరి మాట…అమ్మ….
నాలో స్ఫూర్తిని నింపే సాధనం నువ్వు
నాలో కోపాన్ని తగ్గించే అయస్కాంతం వి నువ్వు
నా మొదటి గురువు,బెస్ట్ ఫ్రెండ్ వి నువ్వు…
నేను ఓడిపోయిన ప్రతిసారీ నా వెన్ను తట్టి ధైర్యము చెప్పి…నా మీద భరోసా న్నీ కలిగిస్తూ….
మా కోసం అన్నీ వదులుకొని…మా సంతోషంలో నీ ఆనందాన్ని దాగి ఉంది ఎల్లవేళలా చెప్పుతూ ఉంటావు…
నాలో భయాన్ని పోగట్టే నన్ను గుండెకు హత్తుకొని..ఇప్పటికీ కూడా నన్ను పసిపాపల చూసే దేవత వి ..
కొత్తగా నేను ఏమి చేసినా… ప్రోత్సహించి నన్ను ముందుకు నడిపే మార్గదర్శివి…
తప్పు చేసిన ప్రతిసారీ ప్రేమగా చెవి మెలి తిప్పుతూ బుద్ది చెప్పి నాలో మార్పు తెస్తూ ఉంటావు…
నీ ప్రేమ , నీ మమకారం, నీ అప్యా యత అజరామరం…
నీ కోపం నీటి బుడగ లాంటిది ఎక్కువ సైపు మా పై ఉండదు
నీ ఋణం ఎలా తీర్చాలి అమ్మ
నిన్ను కంటికి రెప్పల చూసుకోవడమే
నీ గురించి రాస్తూ ఉంటే పేజీలు సరిపోవు .
ఒక్క మాటలో చెప్పాలి అంటే…
” అమ్మ అంటే కొండంత బలం, ధైర్యం
అమ్మ చేయి విడిచిన రోజు మా జీవితం అంధకారం..పక్కన ఉంటే హీరో లేదంటే జీరో”

You May Also Like

2 thoughts on “అమ్మఅనురాగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!