స్వచ్ఛమైనది మచ్చలేనిది మాతృ ప్రేమ
రచయిత :: ఎస్. ప్రవీణ్
నవమాసాలు మోసి పురిటి నొప్పులనోర్చి
జన్మనిచ్చును పసికందుకు తన ప్రాణం ధారపోసి
కాపాడును ప్రాణానికి తన ప్రాణం అడ్డువేసి
అపురూపంగా పెంచుతుంది తన బిడ్డను అమ్మ
స్వచ్ఛమైనది మచ్చలేనిది జనని ప్రేమ…!!
పువ్వులోని మకరందపు తీపివోలె
పాల సముద్రంలొంచి తీసిన అమృతంవోలె
స్వచ్ఛమైనది మచ్చలేనిది మాతృప్రేమ…!!
ధనాన్ని దాచిన కుబేరుని వోలె
కోరికలు తీర్చే కల్ప వృక్షం వోలె
తమ పిల్లల కోరికలు తీర్చును అమ్మ
స్వచ్ఛమైనది మచ్చలేనిది అమ్మ ప్రేమ…!!
వర్షాకాలంలో చిగురించిన వృక్షాల అందం వోలె
కోకిల యొక్క గానాల మధురం వోలె
పచ్చని పంట పొలాల ఆకర్షణ వోలె
స్వచ్ఛమైనది మచ్చలేనిది తల్లి ప్రేమ…!!