“నవ్య కవిత్వానికి చిరునామా” నెల్లుట్ల సునీత

“నవ్య కవిత్వానికి చిరునామా” నెల్లుట్ల సునీత

ప్రజా సమస్యలే తన కవితారచన వస్తువులు. రంగనాయకమ్మ సాహిత్యం చూసినట్లైతే మొదటినుంచి స్త్రీల సమస్యలను విభిన్న కోణాలలో పరిశీలించారు. సాహిత్యానికి నూతన ప్రాచుర్యం సంతరించుకునే రోజులివి. ఈ మధ్య కాలంలో అంతర్జాల పత్రికలలో కవితలు, వ్యాసాలు, కథలు, వివిధ వార పత్రికలలో సమస్యలను విభిన్న కోణాల్లో వివరిస్తూ దృష్ఠీకరించి పాఠకులను ఆలోచింపచేసే విధంగా రాస్తున్న రచయిత్రి నెల్లుట్ల సునీత గారు. తెలుగు ఆధునిక సాహిత్యంలో నవీన పద్ధతులలో సున్నితాలు సరళ శతకాన్ని రూపొందించి సంవత్సర కాలంలో సామాజిక సమకాలీన అంశాలపై కొత్త ఒరవడిని సృష్టించి ఈనెల పశ్చిమగోదావరి జిల్లాలో అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సదస్సులో తన ప్రక్రియను పరిచయం చేయడం జరిగింది. ఒక ప్రణాళికాబద్ధమైన విశేష ఆదరణ పొందినటువంటి సున్నితాలు ప్రక్రియను చరిత్రలో నిలిపారు.
నెల్లుట్ల సునీత గారు సామాజిక సాహిత్య ప్రస్థానంలో గత 18 సంవత్సరాలుగా నిరంతరం సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ, పిల్లలలో దాగి వున్న ప్రతిభను వెలికి తీస్తూ, అధ్యాపకురాలిగా పాఠాలు బోధిస్తూ సాహిత్యంలో నిమగ్నమై తెలుగు భాషా చైతన్య వ్యాప్తికి తన కృషి చాటుతున్నారు. స్త్రీల సమస్యల కోసం గుణాత్మకమైన మార్పులు తన కవిత్వంలో తీసుకొచ్చారు. చైతన్యవంతమైన గ్రామం సూర్యాపేట తాలూకా, పాతర్ల పాడు గ్రామంలో జన్మించి ఆమె.. సున్నితాలు ప్రక్రియ సృష్టించారు. తెలుగు ఆవశ్యకతను, రాయడానికి అనువైన మాత్రా ఛందస్సు నియమాలు కలిగిన తేటగీతి కదం పద్యాల మాదిరి చూడచక్కని తెలుగు సున్నితం. మకుటం పోలి ఉండడం రాసి చదవడంలో గొప్ప అనుభూతికి లోనవుతాము ఈ సున్నితాలు.

సున్నితం నియమాలు,లక్షణాలు:-
సున్నితం సరళ శతకం.
మొత్తం “నాలుగు పాదాలు” ఉంటాయి.
నాలుగో పాదం “మకుటుంతో” ఉంటుంది,
“చూడ చక్కని తెలుగు సున్నితంబు”

ప్రతి పాదం లో “మూడు పదాలు” వచ్చేలా పాదాన్ని పూర్తిచేయాలి.
లేదా మరొక పద్ధతిలో కూడా రాయవచ్చు “మాత్రఛందస్సులో”
ఒకటి నుంచి 16 మాత్రలు అనుసరించి
ప్రతి పాదాన్ని పూర్తి చేయాలి

ఒకటి నుంచి 16 మాత్రలు తీసుకుంటే మిగతా పాదాలు కూడా సమాన మాత్రలతో రాయాల్సి ఉంటుంది. అంత్య ప్రాస, ఆది ప్రాస అలంకారము ఉన్నది. మాత్రాఛందస్సులో రూపొందించినది, శతక పద్య లక్షణాలు కలిగి ఉన్నది సరళ శతకం అని కూడా చెప్పవచ్చు, మకుట నియమం కలిగి ఉన్నది.

ఉదాహరణ:-
సప్తరాగాల మధురిమ వెలుగు
అన్యభాషలందు తెలుగు జిలుగు
సాగుతున్న తేనె ఊటల తెలుగు
చూడ చక్కని తెలుగు సున్నితంబు

తెలుగు పూతోటలో విరిసేను
చక్కని అద్భుతమైన భాషలు
నూతన ఉత్తేజం నింపిన ప్రక్రియ
చూడచక్కని తెలుగుసున్నితంబు

నెల్లుట్ల సునీత
సున్నితం రూపకర్త

నేటి భవిష్యత్ కాలానికి సున్నితాలు గ్రంథంగా ఏర్పడి మును ముందు పరిశోధన కేంద్రంగా ఉంటుంది. సాహిత్య పోటీ ప్రపంచంలో సున్నితాలు అర్థవంతమైన భావన కలిగి ఉంది అని చెప్పడానికి సందేహం లేదు. “సాహితీ బృందావన వేదిక” స్థాపించి అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ 253మందితో ఒక సమూహాన్ని ఏర్పాటు చేసి వారానికి ఒక సరికొత్త అంశంతో వర్తమాన కవులకు సాహిత్య సేద్యం నేర్పిస్తున్నారు.

సాహితీ వాహిక
చైతన్య దీపిక
బృందావన వేదిక
అభ్యుదయ ఘనత
కూరెళ్ల నోటా
తెలంగాణ మొల్ల
భానుపూరి ధ్వని
నెల్లుట్ల సునీత

సాహిత్య అధ్యయనంతో పాటుగా, సాహిత్య చర్చా వేదికలు, కవితలలో మెళకువలు కార్యక్రమం, గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తూ ప్రజలలో చైతన్య సృజన, వారిలో సాహిత్య ప్రతిభని వెలికి తీస్తూ, కవిత్వాసక్తిని పెంపొందిస్తున్నారు నెల్లుట్ల సునీత.
జాతీయస్థాయిలో స్వామి వివేకనంద జయంతి వేడుకలు వట్టిమర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో ఘనంగా నిర్వహించి, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి, నేటి యువతను ముందు నడిపించడంలో సునీతగారి శ్రమ, గొప్పస్ఫూర్తి ప్రతిభకు నిదర్శనం. తెలుగు సాహిత్యంలో భాష గొప్పతనాన్ని కవితా పోటీలు నిర్వహిస్తూ కవులను చైతన్యం చేసి ఆన్లైన్ ప్రోగ్రామ్స్ అనేక సభలు, సెమినార్లు నిర్వహిస్తూ తన ప్రసంగం ఎంతో మంది సాహిత్యకారులను ఆకట్టుకున్నారు.
పాఠశాల స్థాయిలో విద్యార్థుల ప్రతిభను గుర్తించి ఉత్తమ సున్నితాలు పురస్కారం అందించారు. ఈ మధ్యకాలంలో జనగామ జిల్లా పాలకుర్తిలో సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో కవి సమ్మేళనం నిర్వహించి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం అక్కడ జరిగిన కార్యక్రమంలో నెల్లుట్ల సునీత గారు చేసిన సాహిత్య సేవలను కొనియాడుతూ, ఆ ప్రాంత ఉపాధ్యాయులు గ్రామస్తులు విద్యార్థులు ప్రత్యేకంగా ప్రశంసలు అందించారు. ప్రతిభను గుర్తించి కవులను ప్రోత్సహించడం తన కర్తవ్యంగా ముందుకు వెళ్తున్నారు సునీత గారు. తెలుగు సాహిత్యంలో కవితలు, కథలు, వ్యాసాలు, 42 ప్రక్రియలు రాసి పద్యాలు, పాటలు, సమీక్షలు, సంగీత పరిజ్ఞానం కలిగినటువంటి గాయకురాలిగా తన మాట పాటలు సాహిత్యంలో కనిపిస్తున్నాయి. తన సాహిత్య సేవలను గుర్తించి వివిధ సాహిత్య సంస్థలు సునీత గారు చేసిన సాహిత్య సేవలను కొనియాడుతూ జాతీయస్థాయిలో సన్మానాలు, నగదు బహుమతులు అందించారు.
పెట్టుబడిదారీ సమాజంలో స్త్రీల సమస్యకు ప్రధాన కారణం అది సృష్టించిన రాజకీయ సాంఘిక సాంస్కృతిక పరిస్థితులు అని ఆమె తన ఆలోచనతో రాసిన కవితా రచనలు పాలకులను ప్రశ్నించే విధంగా ఉంటాయి. నాటి వారసత్వం ఉద్యమ ప్రభావం వల్ల తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్త్రీలను అధిక సంఖ్యలో స్థానిక రైతాంగ పోరాటాలకు సమీకరించి ఉంది. ఆనాటి పోరాట చైతన్యం వీరుల గాథలను ప్రత్యేకంగా తలుచుకొని అప్పటిలాగే ఈ మధ్యలో మహిళా రచయితల సంఘం స్థాపించి స్త్రీ సమస్యలపై కవిత్వ అక్షరాలతో చైతన్యం చేసి స్త్రీ స్వాతంత్ర్యాన్ని సమాజ స్థాపనలో నూతన ఉత్సాహం తీసుకొచ్చారు. వివిధ పోటీ పరీక్షలకు రోజు వారి సాహిత్య ప్రశ్నలు చరిత్ర సాంప్రదాయాలు తెలంగాణ మాండలికంలో కథా వస్తువులను ఎంచుకొని మంచి సందేశాత్మకమైన కథలు రాశారు. ఆ సారాంశం అభ్యుదయ మార్గాన్ని అనుసరించి సమకాలీన జీవన విధానంలో సునీత గారి కథలు చదివితే అర్థమవుతుంది.
తెలంగాణలో గ్రంథాలయోద్యమం పురస్కరించుకొని గ్రంథాలయాలను విప్లవ కేంద్రాలుగా పరిగణించి, గ్రంథాలయోద్యమ కార్యకర్తలను ప్రభుత్వం నిర్బంధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వట్టికోట ఆళ్వారుస్వామి కోదాటి నారాయణ రావు వంటి వారు గ్రంథాలయ ఉద్యమానికి గొప్ప సేవలు అందించారు. వట్టికోట ఆళ్వారుస్వామి స్ఫూర్తితో నెల్లుట్ల సునీత నేటి గ్రంథాలయ విశిష్టతను వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి సాహితీ బృందావన వేదిక ద్వారా వారికి గౌరవ పురస్కారాలు అందించి, గ్రంథాలయ పుస్తక పఠనం చాలా గొప్పదని నేటి యువత సెల్ఫోన్ మైకం విడిచి గ్రంథాలయ బాట పట్టాలని పిలుపునిచ్చారు. ఇలాంటి గ్రంథాలయ వారోత్సవాలు ప్రతి యేటా నిర్వహిస్తున్నారు, దానికి తెలంగాణ సాహితీ బృందాన వేదికను ఎంచుకోవడం సంతోషించదగ్గ విషయం అందుకు సునీత గారు అభినందనీయురాలు.

మిగతాది తరువాయి భాగంలో

బూర్గు గోపికృష్ణ
-7995892410

You May Also Like

One thought on ““నవ్య కవిత్వానికి చిరునామా” నెల్లుట్ల సునీత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!